Sunday, October 26, 2008

ఎటో వెళ్ళిపోతోంది మనసు...

బ్లాగులో full fledged టపా వ్రాసి చాలాకాలమైంది... పని మరీ ఎక్కువగా ఉంది... ఎప్పుడైనా కాస్త తీరిక దొరికి బ్రెయిన్ idle లో కి వెళ్ళగానే, మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది... కొత్తపాళీ గారు ఇచ్చిన కధ long time pending.. విష్ణువుని ఆన్సైట్ కి ఎలా పంపాలో ఆలోచిస్తుండగా, నా ఆన్సైట్ ప్రయాణం గుర్తొస్తుంది... సరే అని ఛానల్ మారిస్తే చిరు/బిరు/కిరు ల యాత్రలు కనిపిస్తున్నాయి.. పోనీ చదువరి గారి లాగా రాజకీయాలు రాద్దామా అనుకుంటే, ఇంతలో ఏవేవో ఊహలు..... సరే పూర్ణిమలాగా ఊహలన్నింటినీ ఊసులు చేసేద్దాం అనుకునేలోపు అవి తెల్లవారు ఝామున రూమ్ కి వస్తూ వేసుకున్న జోకుల దగ్గర నుండి, చిన్నప్పుడు దీపావళి చేసుకున్న రోజుల వరకూ వెళ్ళిపోతున్నాయి... ఎటూ ఇక్కడ వరకూ వచ్చాం కదా, ప్రవీణ్ లాగా వాటినే రాసేస్తే పోలా అని కలం కదిలించబోతే, ప్రక్కనే 300 B.C. మీద చర్చ వినిపిస్తోంది... ఇంకెందుకాలస్యం, మహేష్ గారి లాగా సినిమాల మీద వ్రాసేద్దాం అని పేపర్ తీసుకునేసరికి, సినిమా చూసి దాదాపు ఆరు నెలలు దాటింది అనే సంగతి గుర్తొచ్చి, నీరసం గా ప్రక్కన పెట్టేయబోతోంటే, ఎదురుగ్గా ఉన్న చివరికి మిగిలేది కనిపించి సౌమ్య లాగా పుస్తకాలని ఒక పట్టు బడదాం అనిపించి, శీర్షిక మొదలెట్టేసరికి పుస్తకం చదవడం కాదు కదా, కనీసం పట్టుకుని ఎన్నో రోజులయ్యింది అని జ్ఞాపకం వస్తోంది... సరే రొటీన్ కి భిన్నంగా రాధిక గారిలాగా కవితలు రాద్దామా అని మొదలుపెడితే, మన తెలివితేటలు ప్యారడీలవరకే వచ్చి ఆగిపోతున్నాయి.. ఫర్లేదులే, ప్రపుల్ల చంద్ర జపాన్ కబుర్ల లాగా, కొరియా కబుర్లు చెబుదామా అంటే, ఈ నెలలో ఆఫీసు, రూమ్ తప్పించి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళనే లేదు...

ఇలా ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతుండగా, మా మానేజర్ వచ్చి ఒక వెధవ నవ్వు నవ్వారు.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనేదానికి, నిలువెత్తు ఉదాహరణ!!!! Bug రావడం ఆలస్యం, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు.... చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా వెళ్ళు అన్నా కూడా వినిపించుకోకుండా దాన్ని చూసేవరకు అక్కడనుండి అంగుళం కూడా కదలరు.. సరే అని చేసే పని వదిలేసి, అది చూడడం మొదలుపెట్టాను.. ఇంతలో కొరియన్ మానేజర్ తయారు... మేమందరం(ఇండియన్స్ అందరూ) పనికి ఆహార పధకం క్రింద ఇక్కడ పని చేస్తున్నారు అనే చెత్త ఫీలింగ్ ఈయనకి... సరే వచ్చిన పని ఏంటి అంటే, ఆయన పదింటికల్లా వెళ్ళిపోతాడట, ఏవో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ check-in చేయాలట -- అర్ధరాత్రి 2:00 - 3:00 check-in టైం.. అప్పటివరకు ఉండి నేను చేసి వెళ్ళాలట!!!! ఏమి చేస్తాం... ఏమి అనలేం కదా.. సరే బాబూ నేను చేస్తాను, నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పా... మళ్ళీ నా పనిలో మునిగిపోయా.. ఇంతలో ఎక్కడో భయంకరమైన అరుపులు.. ఏంటా అని చూస్తే చైనీస్ మానేజర్ --- ఆడ పులి... ఆమె క్రింద పని చేసామంటే, చేరిన రోజే జీవితం మీద విరక్తి కలిగి ఒక గ్లాస్ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది... ఎంతైనా ఈ కొరియన్స్ గట్టిపిండాలు, ఆమె క్రింద దాదాపు అయిదేళ్ళుగా పని చేస్తున్నారు!!!! ఈ కాకిగోల ఎప్పుడూ ఉండేదే అని పని చేసుకోవడం మొదలుపెట్టాను... ఇంతలో సూర్యుడు కనిపించాడు.. సూర్యుడు అంటే సూర్య భగవానుడు కాదు, ఇంకొక కొరియన్ మేనేజర్... ఎంత వేడిగా ఉంటాడు అంటే, మాకు A.C పని చేస్తుందని కూడా ఎప్పుడూ అనిపించలేదు.. బయట మైనస్ డెగ్రీలున్నా, లోపల మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్లుంటుంది.. ఈయన దృష్టిలో ఇండియన్స్ అందరూ, వలస వచ్చిన కార్మికులు! ఏదో ఇంత పడేసి, అడ్డమైన పనులు చేయించుకోవచ్చు అనే ఇదిలో ఉంటారు ఈయన... ఎలాగో ఈయన తాకిడి నుండి తప్పించుకుని, పని చేసుకుంటూ ఉంటే సీనియర్ V.P వచ్చి అటూ -- ఇటూ రౌండ్స్ వేస్తూ కనిపించారు.. మా కంపెనీ మొత్తంలో పనీ-పాట లేని వ్యక్తి ఎవరంటే ఈయనే... చివరికి ఈయన కూడా మా కోడ్ టెస్టింగ్ చేస్తాడు... మనం బిజీగా ఉండి ఏదో పని చేస్తూ ఉంటే మధ్యలో సుడిగాలిలా వచ్చి, ఇదుగో నీ కోడ్ క్రాష్ అవుతోంది... Fix it అని ప్రక్కనే నించుంటారు... ఈ కొరియన్స్ అందరిలోను ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా ఇష్యూ వస్తే వచ్చి ప్రక్కనే కూర్చుంటారు, మనల్నీ, సిస్టమ్ ని మార్చి చూస్తూ ఉంటారు... సరే ఎలాగో ఆయన్ని ప్రక్కకి పంపించేసరికి, Conf-Chat మొదలయ్యింది... మేము ప్రొద్దున్న ఆఫీసుకి వచ్చిన దగ్గరనుండి, రాత్రి వెళ్ళిపోయే వరకూ, ఇది open అయ్యి ఉంటుంది... పనికి వచ్చే డిస్కషన్ ఒక్కటి కూడా ఉండదు... సరే దాంట్లో పోట్లాట అయిపోయేసరికి, లంచ్ టైం అయ్యింది.. తినడానికి వెళ్ళాం.. అక్కడ మా ఇండియా బ్రాంచ్ V.P కనిపించారు... మధ్యాహ్న భోజన పధకం ఈయన కోసమే పెట్టారేమో అనిపిస్తుంది చూసినప్పుడల్లా... కొరియాలో రూమ్ క్లీన్ చేసేవాళ్ళకి కూడా వంగి వంగి దణ్ణాలు పెడతారు కానీ, మన మానేజర్లని కనీసం కూర్చోమని కూడా చెప్పరు! అంత గొప్పాయన... ఈయనకి మేము పెట్టిన ముద్దు పేరు - డిప్స్... అంతకుముందు మనిషా, మోహన్ బాబా అనేవాళ్ళం... ఈ మధ్య అది కాస్త మార్చి, మనిషివా, డిప్స్ వా అని అంటున్నాం...

hmm... అదుగో మళ్ళీ బ్రెయిన్ idle లోకి వెళ్ళిపోతోంది... మళ్ళీ అన్ని వరసగా మొదలవుతాయి... ఇదొక while(1) without any break!!!!


Finally what i can say is,
Head is breaking, Eyes are burning, Body is Trembling.... Next is Whatttttttttttttttt??????????????

P.S. అందరికీ దీపావళి శుభాకాంక్షలు...

Wednesday, October 22, 2008

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం...



చంద్రయాన్-1 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో వారికి అభినందనలు..

Saturday, October 18, 2008

ఏమాయే నా కోడింగ్... కష్టపడి వ్రాసిన కోడ్!!!

Note: ఇవి చూసి మీకు
కోపం -- నాకు ఇష్టమైన పాటలని ఇంత భయంకరంగా మార్చేసిందేంటీ ఈ అమ్మాయి అని!
చిరాకు -- ఛా, ఇంత దారుణంగా మార్చాలా...


వీటిలో ఏ భావాలు కలిగినా, అది కేవలం మీ మానసిక ఫీలింగ్ తప్ప, నా టపా కి, నాకు - మీ మనోభావాలతో సంబంధం లేదు అని తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా!

ముందుగా అర్చన...

కోడర్, డెవలపర్, టెస్టరార్చిత సిస్టం...
అష్ట దరిద్ర కారక సిస్టం...
నష్ట భయంకరశోభిత సిస్టం..
సిస్టమాష్టకమిదం పుణ్యం యః పఠేత్ పున్నామ నరక మవాప్నోతి!

ఇప్పుడు - పల్లవి

పల్లవించు తొలి బగ్గే సూర్యోదయం...
పరవశించు తొలి ఫిక్సింగే చంద్రోదయం...
సరికొత్తగా సాగు ఈ టెస్టింగ్.. మా జీవితాలతో ఆడు సయ్యాట!
నాలుగు దిక్కుల(మాకు 4 టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి!) నా కోడ్ క్రాష్ లు తెలిసిపోయే వేళ..


అనుపల్లవి...

సిస్టం మూగది.. కోడింగ్ రానిది.. టెస్టింగ్ ఒకటే అది నేర్చినది... అదే నా కొంప ముంచుతున్నది..

చివారఖరుది...

జాలిగా కంప్యూటరమ్మ Shutdown అవలేదు ఎందుచేత...
code left-right-centre crash అవుతోంది...
ఆటుపోటు ఘటనలివి, ఆటవిడుపు నటనలివి...
కంచి కెళ్ళిపోయేవే రిలీజ్ లన్నీ!!!

Saturday, October 4, 2008

ప్రధానమంత్రి గారి అమ్మాయి, కన్నడ కస్తూరి...

ఏదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది... కంపెనీ వాడు వాయువిహారానికి అనుమతి ఇవ్వడంతో, బెంగళూరులో ప్రొద్దున్నే బయలుదేరాను.. చాలా తొందరగా, హైదరాబాద్ చేరాను.. సరే ఇప్పుడే వెళితే, కంపెనీ వాడు తాళాలు కూడా తీయడు అని ఎయిర్-పోర్ట్ లోనే వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యా.. బ్యాగ్లో ఏదో పుస్తకం ఉంది.. అలానే చదువుతూ ఉండిపోయా.. నవల పూర్తైంది... సరే టైం తొమ్మిది అవుతోంది... చిన్నగా బయలుదేరదాం అని చిన్నగా మెట్లు దిగి వస్తున్నా... క్రింద అంతా హంగామా హంగామా గా ఉంది... ఏంటా, ఎవరైనా మినిస్టర్ వస్తున్నారేమో అనుకుంటూ క్రిందకి వచ్చేశాను.. అలా రావడం ఆలస్యం ఫ్లాష్లు, కెమెరా క్లిక్ లు, పొలీసులు హడావిడిగా అట్టెన్షన్ లో కి రావడం.. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.. పోనీ నా వెనక ఎవరైనా వస్తున్నారా అని చూస్తే ఎవరూ లేరు.. కలా ఏంటి అని గిచ్చుకున్నా.. కాదు, బాగా నొప్పిగా అనిపించింది..! అలా అందరి వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉండగా, ఇంతలో ఎవరో వచ్చి, Let Her go.. She is not the person we are waiting అని నన్ను పంపించేశారు.. హమ్మయ్య అనుకుని బయటకి వచ్చేశా... తరువాత అడిగితే తెలిసింది... అప్పుడే మన్మోహన్ సింగ్ గారి అమ్మాయి హైదరాబాద్ కి ఏదో పని మీద వస్తున్నారట... సో ఈ హంగామా అంతా దానికోసం...!


ఇక కన్నడ కస్తూరి గురించి...

రోజూ లాగానే ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ, నించున్నా.. మా పిన్ని వాళ్ళ అమ్మాయి గత మూడు రోజుల నుండీ కాల్ చేస్తోంది.. దానితో మాట్లాడడానికి కుదరనే లేదు.. ఆటో కనుచూపు మేరలో కనిపించకపోవడంతో, దానికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నా.. ఇంతలో కొన్ని ఆటోలు వచ్చాయి.. వాళ్ళు 2కి.మీ దూరానికి, నా రోజు శాలరీ అడగడం, నేను పొమ్మనడం జరిగిపోయాయి.. నా ప్రక్కన నించున్న అమ్మాయి కూడా అటువైపే అట.. ఇద్దరం షేర్ చేసుకుందామా అంది.. సరే అని కాసేపటికి ఇంకో ఆటో వస్తే, ఇద్దరం ఎక్కాం.. ఆటో ఎక్కేముందు, ఆటో అతనితో ఒక రెండు కన్నడ మాటలు మాట్లాడా.. ఇంతలో నా ఫోన్ కాల్ కూడా అయిపోయింది.. నా ప్రక్కన అమ్మాయి, మీరు కన్నడ బాగా మాట్లాడుతున్నారు, ఎప్పటి నుండి బెంగళూరు లో ఉంటున్నారు అని అడిగింది.. మొదట నాకు, నేను ఆటో ఎక్కే ముందు అన్న మాటలేమో అనుకుని ఆ చిన్న చిన్న మాటలండీ అన్నా.. లేదు మీ రిలెటివ్స్ తో కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు కదా అంది...నాకు అస్సలు సౌండ్ లేదు.. ఆమె కి కన్నడ రాదేమో అని ఆలోచిస్తూ ఉన్నా.. ఇంతలో తనే చెప్పడం మొదలుపెట్టింది... వాళ్ళు బేసిక్ గా తెలుగు అట, కానీ ఈమె పుట్టకముందే బెంగళూరులో సెటిల్ అయ్యారట... ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లడతారట... (ఇప్పటివరకూ ఆమె నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది!) అని ఆమె హిస్టరీ చెప్పింది... నాకు కాసేపు హిస్టీరియా వచ్చినంత పని అయింది.. ఈమెకి కన్నడ తెలుసు... నేను ఆటో వాడితో మాట్లాడింది కన్నడ కాదంటుంది... ఫోన్ లో కన్నడ చాలా బాగా మాట్లాడతాను అంటుంది... హా... భగవాన్ అనుకున్నా... ఇంతలో నా స్టాప్ వచ్చేసి దిగి వెళ్ళిపోయా....! ఆ తరువాత ఆలోచిస్తే అనిపించింది... నేను తెలుగు కాస్త వేగంగా మాట్లడతాను.. కానీ అది మరీ కన్నడలాగా ధ్వనిస్తుందని ఆ రోజే అర్ధమయ్యింది!!!