Monday, October 12, 2009

ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి

స్వీడిష్ నోబెల్ కమిటీ సమావేశం జరుగుతోంది.. రోజూ ఒక్కొక్క రంగం వారికి బహుమతులు ప్రకటిస్తున్నారు, ఈ రోజు శాంతి బహుమతి ప్రకటించాలి.. వచ్చిన నామినేషన్ల నుండి తీవ్ర వడపోత తరువాత, ఫైనల్ రౌండ్ కి కొన్ని పేర్లు ఎంపిక చేయబడ్డాయి. వాటిల్లోనుండి, ఒక వ్యక్తి ని బహుమతి కి ఎంపిక చేశారు..

విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ప్రకటిస్తున్నారు..

*************************************

శ్వేతసౌధం, అమెరికా:
ఫోన్ ఆపకుండా రింగ్ అవుతోంది.. కాల్ రిసీవ్ చేసుకున్న ఒబామా కి ఏమీ అర్ధం కాలేదు.. ఈ బ్రిటన్ ప్రధానమంత్రి కి ఏమైనా మతిపోయిందా.. అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ, టి.వి వైపు చూశాడు.. స్వీడిష్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతి వివరాలను ప్రకటిస్తున్న సమావేశం.. అక్కడ స్క్రోలింగ్లో వస్తున్న తన పేరు చూసి కాసేపు అలా నిలబడిపోయాడు.. చివరికి ఎలాగో తేరుకుని, ఆ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపి పెట్టేశాడు..అలా పెట్టాడో లేదో, ఇంకో దేశాధ్యక్షుడు లైన్లోకి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడే, ఇంకో గవర్నర్ కాల్ అంటూ పియ్యే వచ్చి నించున్నాడు...

అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కాసేపు విరామం తీసుకుందామనుకుంటున్నంతలో మిఛెల్లీ సుడిగాలి లా అక్కడికి వచ్చింది.. మీకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందట.. I am so happy for you dear.. ఇలా అందరిదగ్గరి నుండి అభినందనల వర్షం ఒకవైపు కురుస్తుండగా, ఒబామా మనస్సులో కొంచెం ఆలోచన, కొంచెం ఆశ్చర్యం, కించిత్ గర్వం.. కొంచెం సిగ్గు.. కొంచెం ఉత్సాహం.. మరెంతో ఉల్లాసం.. ఇంకా ఎంతో ఆనందం అన్నీ కలగలిపి కలుగుతున్నాయి..

అలా పగలంతా అభిమానుల వర్షంలో తడిసిన ఒబామా, రాత్రికి పడుకోబోతుండగా ఒక ఆలోచన వచ్చింది.. ఇంతకీ ఈ బహుమతికి నన్నెందుకు ఎంపిక చేశారు... ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు.. అలా ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు...

*************************************

నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం:

అంగరంగ వైభవం గా నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. అతిరధ మహారధులందరూ వచ్చారు.. ఎక్కడెక్కడి వారూ, ప్రతీ రంగంలో పేరెన్నికగన్న వారు, ఇలా ఒకరేమిటి, ఎందరో మహానుభావులు, ఒక్కో రంగం లో విశిష్ట సేవలు చేసిన వారందరినీ వరుసగా వేదిక మీదకు పిలిచి అవార్డులు ప్రధానం చేస్తున్నారు.. ఒబామా వంతు వచ్చింది.. ఒకలాంటి ఉద్వేగంతో స్టేజీ పైకి వెళ్ళి అవార్డ్ అందుకున్నాడు ఒబామా...

కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ వెళ్ళిపోతున్నారు.. ఆ సమయంలో నోబెల్ కమిటీ అధ్యక్షుడి దగ్గరకి వచ్చి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఒబామా.. తప్పకుండా, ఇటు రండి అంటూ మీటింగ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు..

అధ్యక్షుడు: చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు..
ఒబామా: మీరు శాంతి బహుమతికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు..?

అధ్యక్షుడు: :) ఈ ప్రశ్న చాలా మంది దగ్గర నుండి వచ్చింది, కానీ మీ దగ్గర నుండి కూడా వస్తుందని ఊహించలేదు...
ఒబామా: మీరు బహుమతి ప్రకటించిన నాటి నుండి, సమాధానం కోసం వెతుకుతూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను, కానీ కొంచెం కూడ తట్టలేదు.... అందుకే మీ నుండే తెలుసుకుందామని అడుగుతున్నాను.. అసలు నేను ఏం చేశాను అని మీరు నన్ను ఎంపిక చేశారు..?

అధ్యక్షుడు: హ్మ్.. అర్ధమైంది.. శాంతి బహుమతికి ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో నామినేషన్లు వచ్చాయి.. చాలా గట్టి పోటీ ఉంది.. నామినేట్ చేయబడిన వారందరూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి ప్రస్తావించారు..అసలు ప్రపంచంలో ఎవరైనా ఖాళీగా ఉన్నారా.. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ మీద యుధ్ధం చేయాలా అని చూస్తూ ఉంటుంది.. చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది, కుదిరితే భారత్ ని కూడా ఆక్రమించేయాలనే ఆలోచనే.. ఇటు ఇజ్రాయెల్ - పాలస్తీనా ఎప్పుడూ రావణకాష్ఠమ్లా రగులుతూనే ఉంటుంది.. పోనీ ఆస్ట్రేలియా వైపు చూస్తే, జాత్యహంకార ధోరణులతో కొట్టుమిట్టాడుతోంది.. ఫ్రాన్స్ ని పరికిస్తే, ఏ ఫ్యాషన్స్ బావుంటాయి, ఏ మోడల్ అందం గా ఉంది అని తప్పితే వేరే ఆలోచన లేదు..

ఇంతమంది, ఏదేదో చేయాలని, ఇంకేదో చేస్తూ, తమెంతో సాధించామని భ్రమ పడుతూ, నామినేట్ చేయబడ్డారు.. కానీ వారందరికీ మీకూ ఉన్న ఒకే ఒక్క తేడా -- అదే.. ఎంతో చేయగలిగి ఉండి కూడా, మీరు ఏమీ చేయలేదు..!!!
తలుచుకుంటే, పాకిస్తాన్ ని తన్ని కూర్చోపెట్టి భారత్ జోలికి వెళ్ళకుండా చేయచ్చు.. చైనా ఆగడాలని కంట్రోల్ చేయచ్చు.. జన్మతః నల్లవాడైనా మీకు జాత్యహంకారం గురించి తెలుసు, దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన విషయాలని ఆస్ట్రేలియా వాళ్ళతో చర్చించి ఉండచ్చు.. పాలస్తీనా మీదకి రయ్యిమంటున్న ఇజ్రాయెల్ ని బెదిరించి, పాలస్తీనా తో సంధి ఒడంబడిక చేసి ఉండచ్చు.. ముసలివాడై కూడా, ఇంకా టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దలైలామా మీద ప్రేమతో చైనాని ఒప్పించి ఉండచ్చు.. ఇంకా ఎన్నో.. మరెన్నో.. చాలా చాలా చేసి ఉండచ్చు.. కానీ, మీరు .. మీరు.. అవేమీ చేయలేదు.. ఆ చేయకపోవడమే, మిమ్మల్ని అందరిలోనూ విభిన్నంగా నిలబెట్టింది.. నిజానికి మీరున్న పరిస్థితుల్లో ఏమైనా చేసి ఉండచ్చు, కానీ మీరు తొందరపడలేదు.. ఏమీ చేయలేదు.. కేవలం ఆ ఒక్క కారణంతో మిమ్మల్ని అవార్డ్ కి ఎంపిక చేయడం జరిగింది.. ఇప్పటికి మీ అనుమానం తీరిందా అని అడిగారు ఆయన నవ్వుతూ...

ఒబామా: ఆ వివరణంతా విన్న ఒబామా నిశ్చేష్టుడై అలానే ఉండిపోయాడు...

*************************************

మహేష్ బాబు ఇస్టైల్లో చెప్పాలంటే --
ఏం చేశామన్నది కాదన్నయ్యా, అవార్డ్ వచ్చిందా లేదా...

శ్రీశ్రీ గారి శైలిలో చెప్పాలంటే --
మాయావతి, వై.ఎస్.ఆర్, సోనియా, ఒబామా కారే అవార్డుకూ అనర్హం...!!!

21 comments:

కొత్త పాళీ said...

ha ha ha.
very well could be.

చైతన్య.ఎస్ said...

హ హా బాగా చెప్పారు :)

వేణూశ్రీకాంత్ said...

హ హ అదిరింది. నిజమేననిపిస్తుంది :-)

karthik said...

మాయావతి, వై.ఎస్.ఆర్, సోనియా, ఒబామా కారే అవార్డుకూ అనర్హం..

that summarizes the whole thing. if possible see this blog:

http://www.urskarthik.blogspot.com/

-Karthik

Thikamaka said...

చాలా బాగా చెప్పారు. ఇన్ని రోజులుగా నాకు ఉన్న ధర్మసందేహాన్ని తీర్చేసారు.
తికమక

Anil Dasari said...

'ఏం సాధించాడని ఇచ్చారు?' అన్నది ఒబామా విషయంలో అందరూ అడుగుతున్న ప్రశ్న. 'ఏదో సాధిస్తాడని ఇచ్చాం' అన్నది కమిటీ సమాధానం.

అయితే, చాలామందికి తెలీని విషయం ఒకటుంది. కమిటీ ఇలా చెయ్యటం ఇదే మొదటి సారి కాదు. 1971లో అప్పటి పశ్చిమ జెర్మనీ ఛాన్స్‌లర్ Willy Brandt కి పదవిలోకొచ్చిన ఏడాదిన్నరకే శాంతి బహుమతి ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది నోబెల్ కమిటీ. అప్పుడూ ఇదే ప్రశ్న: 'ఏం సాధించాడని?'. అప్పుడూ ఇదే సమాధానం, 'ఏదో సాధిస్తాడని'. చివరికాయన ఏమన్నా సాధించాడా మరి? చాలా. విదేశాంగ విధానం విషయంలో ఆయన తెచ్చిన పెనుమార్పులే బెర్లిన్ వాల్ కూలటానికీ, రెండు జెర్మనీలు ఏకమవ్వటానికీ దారి తీశాయి.

మరో ఉదాహరణ కూడా ఉంది. 1990లో శాంతి బహుమతి పొందిన అప్పటి యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్. గోర్బచెవ్ తన మానస పుత్రిక 'పెరిస్త్రోయికా'ని ప్రపంచానికి పరిచయం చేసిన కొద్ది నెలలకే ఆయనకా బహుమతి లభించటమ్మీద అచ్చు ఇదే స్థాయి సంభ్రమాశ్చర్యాలు: 'ఏం సాధించాడని?'. పెరిస్త్రోయికా లేని, ఇంకా కోల్డ్‌వార్‌లో మునిగితేలుతున్న ప్రపంచాన్ని ఓ సారి ఊహించుకుంటే, గోర్బచెవ్ ఏం సాధించాడో తేలిగ్గానే అర్ధమవుతుంది.

గత రెండు సందర్భాల్లోనూ నోబెల్ కమిటీ అంచనా నిజమయింది. ఒబామా విషయంలోనూ నిజమవుతుందని ఎందుకనుకోకూడదు?

ఉమాశంకర్ said...

good one. :)

భావన said...

ha ha ha very well said. చాలా బాగుంది.. :-)

చిలమకూరు విజయమోహన్ said...

ఒబామాకు శాంతి బహుమతి వచ్చిందని తెలిసి ప్రజలే చలన రహితులయ్యారని అనుకున్నా,ఆయన కూడా చలన రహితుడయ్యాడన్న మాట.

Indian Minerva said...

నిజమే జార్జ్ బుష్ గారిలా ఎవరి కొంపా కూల్చనందుకిచ్చుంటారు.

రవి వైజాసత్య said...

మీరు మరీనండి అబ్రకదబ్ర గారూ, ఏదో సాధిస్తాడని ౯/౧౧ జరిగిన తర్వాత నిబ్బరంగా నిలిచి దేశాన్ని నడిపించిన జార్జిబుష్ కి ఎందుకివ్వలేదంటారు? రీగన్ కు ఎందుకివ్వలేదు? (మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసులే) నాకీ చెత్త బహుమతి మీద గౌరవం పోయిందంతే..

Anil Dasari said...

@రవివైజాసత్య:

ఇప్పుడే ఇక్కడో లోకల్ వార్తాపత్రికలో ఒకాయన సమాధానం చదివి నవ్వుకున్నా. మీకూ అది పంచుతున్నా.

'ఒబామా ఏం సాధించాడంటారేమిటి? జో బైడిన్ తో కలిసి బుష్‌నీ, చెనీనీ దించేశాడు. మెకెయిన్‌నీ, పాలిన్‌నీ శ్వేతసౌధంలోకి అడుగు పెట్టకుండా చూశాడు. ఈ మధ్య కాలంలో ప్రపంచానికి అంతకన్నా గొప్ప మేలు చేసిన వాళ్లెవరున్నారు?'

నిజమే కదా.

మురళి said...

Just excellent..

Anonymous said...

తెలుగులో ’చలనరహితుడు” అనరు. ’అవాక్కయ్యాడు’ అంటారు. లేకపోతే ’నిశ్చేష్టుడయ్యాడు’ అంటారు.

-- తాడేపల్లి

Praveen Mandangi said...

సామ్రాజ్యవాదులకీ, ముస్లింలకీ మధ్య కొత్తగా యుద్ధం మొదలవ్వడానికి కారణం పెరెస్త్రొయికా కాదా? అప్పట్లో కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదులు ముస్లింలతో చేతులు కలిపారు, ఇప్పుడు సామ్రాజ్యవాదులు ముస్లిం దేశాల మీద బాంబులు వేస్తున్నారు. పెరెస్త్రొయికా తరువాత ఏమి శాంతి వచ్చిందో పెరెస్త్రొయికా సమర్థకునికే అర్థం కాదు. I always remember Karl Marx's quote "Capitalism breeds war". గోర్బచేవ్ USSRని రద్దు చెయ్యబోతున్నాడన్న విషయం 1987లోనే తెలిసి పోయింది. సామ్రాజ్యవాదులు వాడికి 1990లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం విచిత్రం కాదు.

సుజాత వేల్పూరి said...

మేథ,
కేక! కేక!

అబ్రకదబ్ర,
ఏదో సాధిస్తాడని...ఒబామాకే ఎందుకివ్వాలి? యువరాజుకి అదే జగన్ కి ఇవ్వొచ్చుగా! లేకపోతే అంతకంటే ఘనుడు రాహుల్ గాంధీకివ్వొచ్చుగా! రాహుల్ గాంధీ కూడా ఎప్పటికో అప్పటికి ఏదో ఒకటి(కనీసం వెనిజులా గాల్ ఫ్రెండ్ ని అయినా) సాధిస్తాడని నాకు ఆశ ఉంది.

Unknown said...

హహ... బాగుంది.

ఎప్పుడో సాధిస్తాడని ఇచ్చాము అనేది "Lame excuse". అది ప్రస్తుతం సాధించిన వారికి అవమానం.

కలి said...

పెట్టుబడి దారి వర్గాల కుట్ర ఇది. కోమాలొ ఉన్న కమ్యూనిజాన్ని దెబ్బతీసే పన్నాగం ఇది. ఇది శ్రామిక, కార్మిక మరియు ధనిక వర్గాలకు మధ్య జరుగుతున్న పోరాటం

మేధ said...

@కొత్తపాళీ గారు, @చైతన్య.ఎస్, @వేణూ శ్రీకాంత్, @కార్తీక్ గారు, @తికమక గారు, @ఉమాశంకర్ గారు, @భావన గారు, @మురళి, @రవి వైజాసత్య గారు, @Praveen Sarma గారు, @కలి గారు: నెనర్లు..

@Indian Minerva గారు: అది కూడా కారణం అయ్యి ఉండచ్చు :)

@చిలమకూరు విజయమోహన్ గారు: కొన్ని కొన్ని నిజాలు అంతే ఉంటాయండీ.. అందించినవారితో సహా, అందుకున్న వారు కూడా అలా అవ్వాల్సిందే :)

@అబ్రకదబ్ర గారు: హ్మ్మ్.. ఎప్పుడో ఏదో సాదించచ్చేమో.. అంత సాధిస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు, అది సాధించిన తరువాత ఇస్తే బావుండేది.. ఈ సమయంలో ప్రకటించడం మాత్రం సరికాదని నా అభిప్రాయం..

@సుజాత గారు: మీరు మరీనండీ.. యువరాజు(అదే జగన్) కి ఇస్తే, మహారాజు వై.యస్ ఏమైపోవాలి.. ముందు తండ్రికి తరువాత కొడుకుకి ఇవ్వాలని నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా :)
రాహుల్ విషయంలో మీ లాగే నాకు ఘాట్టి నమ్మకం ఉంది

@తాడేపల్లి గారు: :) నిజమే, సరిచేసాను.. నెనర్లు..

@ప్రవీణ్: Even I too felt the same...

రవి said...

సూపరు. చాలా వినూత్నమైన ఆలోచన. ఏమీ చెయ్యని వారికి బహుమానం ఇవ్వడం! ఈ స్ఫూర్తితోనే భారతరత్న అవార్డ్ కూడా సాగాలని తెలియజేసుకుంటున్నాను.

బరాక్ ఒబామా, బహుపరాక్.

Srujana Ramanujan said...

Very nice, but I agree with Abrakadabra garu