Thursday, December 31, 2009

చిట్టచివరి టపా

2009 చివరికి వచ్చేశాం.. ఇంకొద్ది ఘడియల్లో 2010 రాబోతోంది..
క్రొత్త సంవత్సరం వస్తుందహో అని పది రోజుల ముందు నుండే హడావిడి, ప్లాన్లు.. తీరా చూస్తే, ఎప్పుడు వచ్చిందో లేదో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది.. అయినా, ఇలాంటి సమయం లో వేదాంతం అనవసరం...

పోయిన సంవత్సరం 10x స్పీడ్ లో గడచిపోతే, ఈ సంవత్సరం ఎలాంటి హడావిడి లేకుండా అయిపోయింది .. వ్యక్తిగతంగా, ఎప్పటినుండో వాయిదా వేస్తున్న కొన్ని పనులు మొదలుపెట్టాను.. వాటిల్లో M.Tech చదవడం.. రెగ్యులర్ గా చదవడం ఇక కుదరదు అని అర్ధమై డిస్టెన్స్ లో మొదలుపెట్టాను, అప్పుడే సంవత్సరం కూడా పూర్తైంది.. ఇంకా వృత్తిపరంగా కూడా బానే ఉంది.. Royalty Saving Solution డెవలప్ చేస్తున్నాము, అది కూడా commercialize అయితే ఇంకా సంతోషం..

అందరి కంటే మన రాష్త్ర ప్రజలు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్త్ర విభజన కారణంగానేమి, వరదల వల్లనేమి, YSR చనిపోయినప్పుడు టి.వి. లో వచ్చిన పాటల వల్లనేమి మన వాళ్ళు అనుభవించినన్ని బాధలు వేరే ఎవరూ పడి ఉండరు.. రాబోయే సంవత్సరమైనా ఇలాంటి విపత్తుల వల్ల కాకుండా, అభివృధ్ధి పరంగా మన రాష్త్రం పేరు అన్ని వేదికల మీద వినిపించాలని ఆశిద్దాం...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రొంగొత్త సంవత్సరం మీకు మరిన్ని శుభాలను అందివ్వాలని కోరుకుంటూ...

ఇదే ఈ సంవత్సరానికి చిట్టచివరి టపా :) క్రొత్త సంవత్సరం లో, మరింత క్రొత్తగా కలుసుకుందాం...

13 comments:

వేణూశ్రీకాంత్ said...

"YSR చనిపోయినప్పుడు టి.వి. లో వచ్చిన పాటల వల్లనేమి" హ హ మరే మరే

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

budugu said...

హ హ well said.

మురళి said...

నేను పదే పదే వెంట పడుతున్నా మీరు సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు.. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా చెప్పాల్సిందే.. విశాలాంధ్ర లో ఏం జరిగింది? ఏం కొన్నారు?? ...నూతన సంవత్సర శుభాకాంక్షలు..

జయ said...

మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లక్ష్మి said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తృష్ణ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను మీదగ్గరకు వచ్చే లోపే మీరు నా దగ్గరకు వచ్చేసారు...:)

పరిమళం said...

ఈ సంవత్సరానికే కదా :)మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సిరిసిరిమువ్వ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మురళి గారు:) మేధా వచ్చే సంవత్సరమన్నా చెప్తారా?

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

విశ్వ ప్రేమికుడు said...

అదేంటి ఈ నాలో నేను అనే బ్లాగు సుజన అనే బ్లాగరికి కూడా ఉందే...

http://naalonenu-sujji.blogspot.com/

మీది ఇప్పుడే చూస్తున్నాను.

Happy new year 2010

రవి said...

"వృత్తి పరంగా అలానే ఉంది." - :-) అది మారుతుందన్న ఆశ నాకు మాత్రం లేదు.

శ్రీఘ్రమేవ M.Tech ప్రాప్తిరస్తు. (ఇది తెలివైన పని).

మేధ said...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
@మురళి: ఈ సంవత్సరంలో తప్పకుండా విశాలాంధ్ర గురించి వ్రాస్తాను :)
@విశ్వప్రేమికుడు గారు: నా బ్లాగు సుజన గారి బ్లాగు కంటే ముందు నుండే ఉంది, సుజన గారు అప్పుడప్పుడు నా బ్లాగులో కామెంటుతారు కూడాను..

Vasu said...

చిట్టచివరి టపా అని చూడగానే ఉలిక్కిపడ్డాను.ఏమైంది ఎందుకు ఆపేస్తున్నారు అని అడుగుదాం అనకున్నా :)
హ్యాపీ న్యూ ఇయర్ మీకు.