Wednesday, December 26, 2007

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

అమోఘం, అమేయం, అనుపమానం… ఒక చిత్రంలో ప్రధాన పాత్రధారిగా వేయడమే కాక, కధ, సాహిత్యం, మాటలు, పాటలు, బొమ్మలు, నిర్మాత, దర్శకత్వం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు..! కానీ అంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన ముందు తరాల వారికి మార్గదర్శకత్వం చేశారు “శ్రీ సుమన్”…!!

అది డిసెంబరు 24.. ఆ రోజు ఒక పత్రికాధిపతి ఇంట, బుల్లి తెర అధినేత జన్మించారు. ఆయన మరెవరో కాదు, ఈ.టి.వి సుమన్ గారు.. ఆయన జన్మించి ఎన్ని యేళ్ళైందో తెలియదు కానీ, 2006లో, ఆయన జన్మదినోత్సవం సందర్భం గా తెలుగు ప్రజలకి, ముఖ్యం గా ఈ.టి.వి వీక్షకులకి, తన జన్మదిన కానుకగా తాను తీసిన చిత్రాన్ని విడుదల చేశారు.. సినిమా అన్నాను అని, అది ఎప్పుడు విడుదల అయిందా, ఎన్ని రోజులు ఆడింది, శతదినోత్సవం జరుపుకుందా లాంటి సందేహాలు రావడం సహజం. కానీ మీ సందేహాలకి సమాధానం గూగులమ్మ కాదు కదా, వికిపీడియా వారు ఆఖరుకి, డబ్బులు ఇచ్చి బ్రిటానికా వారిని అడిగినా చెప్పలేరు.! ఎందుకంటే, ఇది కేవలం ఈ.టి.వి ప్రేక్షకులకి మాత్రమే ఉద్దేశించబడింది. ఈ.టి.వి ప్రేక్షకులకి సుమన్ అంటే ఉన్న అభిమానం ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు..

ఏ శనివారమో, ఆదివారమో, లేక ఏ పండగ సెలవు రోజులోనో పొరపాటున ఈ.టి.వి కనుక పెడితే, దాంట్లో సుమన్ గారి పాటలో, ఆటలో ఇలా కేవలం “exclusively suman “ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. తనంటే ఎంతో అభిమానం చూపిస్తున్న వారికి తన జన్మదిన కానుకగా ఏమి ఇవ్వాలా అని తన వందిమాధిగలతో ఆలోచిస్తూ ఉండగా, ఈ చిత్రం ఆలోచన వచ్చింది (ఎవరికి వచ్చింది అని మాత్రం అడగకండి, ఎందుకంటే కొన్ని అంతే, సినిమా చూడాలనుకోవచ్చు, కానీ ఆ సినిమా వెనుక ఉన్న సూత్రధారిని చూడాలనుకోవడం మాత్రం తప్పు.!).

సరే ఏ సినిమా తీయలా అని విస్త్రుతమైన చర్చ మొదలైంది. సుమన్ గారికి శ్రీకృష్ణుడు అంటే ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనకి సంబంధించిన చిత్రం చేయాలని సంకల్పించారు. శ్రీకృష్ణుడి కధల్లో, “శ్రీకృష్ణ పాండవీయం”, “శ్రీకృష్ణ తులాభారం”, “శ్రీకృష్ణార్జునుల యుధ్ధం” ఇంకా భారతం లాంటివి ఉన్నాయి. కానీ ఆయనకి అన్నగారైన బలరాముడికి జరిగిన(జరగబోయిన) యుధ్ధం గురించి తక్కువ కధలు ప్రచారంలో ఉన్నట్లున్నాయి(ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఈ సినిమా చూసే వరకు, నేనైతే ఈ కధ వినలేదు నా పరిజ్ఞానం తక్కువ కావచ్చు). కాబట్టి రొటీన్ కి భిన్నంగా ఈ కధ బావుంటుంది అన్న సన్నిహితుల సలహా మేరకు, ఈ అంశాన్ని కధా వస్తువుగా ఎంచుకున్నారు. ఈ అంశాన్నే కధగా ఎంచుకోవడం వలన రెండు లాభాలున్నాయి. (1) అప్పటికే భాగవతం సీరియల్ వస్తోంది కదా కాబట్టి దుస్తులు, సెట్టింగ్స్ లాంటివన్నీ అవే వాడుకోవచ్చు (2) భాగవతం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలంటే తాను కూడ ఏదైనా పౌరాణిక నాటకం/సినిమా తీసి ఉండగలగాలి. పుణ్యం, పురుషార్ధం కలిసి రావడంతో హీరో గారు(హీరో అంటే కేవలం నటనలోనే కాదు, అన్ని విభాగలని సమన్వయించడం లో కూడా) ఈ కధకి సరే చెప్పేశారు.

కధ సిధ్ధమైంది. ఇక నటీ నటుల కోసం వెతులాట ప్రారంభమయింది. మామూలు మనుష్యులకైతే, వేరేవాళ్ళని వెతకాలి కానీ, మన సుమన్ గారికి ఆ ఖర్మ ఎందుకు..?! భట్రాజుల గుంపు ఉంది కదా. ఆడవాళ్ళు, మగవాళ్ళలో ఉన్న ఉత్తమమైన భట్రాజులని వెతికి నటీ నటులుగా ఎంపిక చేశారు.

ఇక ఇప్పుడు చిత్రీకరణ మొదలయ్యింది.బహుముఖ ప్రజ్ఞాశాలియైన సుమన్ గారు దర్శకత్వాన్ని మొదలు పెట్టారు. నటీ నటులకి సరియైన సూచనలు ఇస్తూ, మధ్యలో తను నటిస్తూ మొత్తానికి చిత్రాన్ని విడుదల చేశారు.

సరే, పాత్రల నటన గురించి మాట్లాడుకుందాం. ముందుగా, ప్రధాన పాత్రధారి గురించి మాట్లాడుకుందాం. సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుండి, చివరి వరకు కృష్ణుడు ఒకే మాల(పూల హారం) ధరించి ఉంటాడు. పాపం, అంత పేదవాడా కనీసం ఇది కూడా మార్చుకోలేడా అనిపిస్తుంది.! అలానే సినిమాలో, ఎక్కడ కూడా కృష్ణుడు పాద రక్షలు ధరించడు..!!! చుట్టూ ఉన్న పండితులు, భటులు అందరు ధరిస్తారు, మరి అది సుమన్ గారికి కృష్ణుడి మీద ఉన్న భక్తి భావం కావచ్చు..!

సుమన్ గారి నటన గురించి చెప్పుకోబోయే ముందు, ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి అని చెప్పుకున్నాం కదా, వాటి గురించి ఇంకొక్కసారి విశదంగా తెలుసుకుందాం. ఆయన సాహిత్యం చాలా బాగా వ్రాస్తారు, ఎంత బాగా అంటే సిరివెన్నెల గారి కంటే కూడ, ఏంటి నమ్మబుధ్ధి కావట్లేదా, ఐతే 2005/6/7 ఈ.టి.వి అవార్డ్స్ చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఒక్కటి చాలు ఆయన సాహిత్యం గురించి వివరించడానికి. ఈయన పాటలు రాయడమే కాదు, అంతే రాగయుక్తం గా వాటిని ఆలపించగలరు కూడా. ఎంత రాగయుక్తం గా అంటే, మనో గారి కన్నా వీనుల విందుగా…! డౌటా ఐతే, ఇంకోసారి అవార్డ్స్ చూడండి. వీటితో పాటు, ఆయన నయనానందకరంగా చిత్రాలని గీయగలరు, ఆ గీయడం కూడా మామూలుగా కాదు, బాపు గారి కంటే గొప్పగా. సందేహం అయితే, మళ్ళీ పైన చెప్పిన ఉదాహరణనే పరిశీలించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈయన సామర్ధ్యాల చిట్టా చేంతాడంత అవుతుంది. డాన్ సినిమాలో, లారెన్స్ బహుముఖ పాత్రలని పోషించాడు అంటున్నారు కానీ, సుమన్ గారి ముందు వీరెవరూ సాటి రారు…!!! ఇన్ని విశేషణాలు కలిగిన వ్యక్తి నటిస్తున్నాడు అంటే, ఇక దాని గురించి చెప్పేదేముంది, అది కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.


ఆయన కృష్ణుడి నటనని ఎవరితోనూ సరిపోల్చలేము (పోల్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు). సాధారణం గా కృష్ణుడు అంటే, పైకి అమాయకం గా నటిస్తూ అన్ని పనులు చేసే వాడు. ఆ అమాయకత్వం నటనలో ఉండాలి కానీ, తాను పలికే మాటలలో కాదు. కానీ సుమన్ గారు సరిగ్గా అదే చేశారు, అసలు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారో..! చిన్నపిల్లలు కూడా అలా మాట్లా డరేమో అనిపిస్తుంది వింటుంటే. కృష్ణుడికి ఉన్న మరియొక అలవాటు, జరుగుతున్న వాటన్నిటినీ చిరునవ్వుతో తిలకిస్తూ వాటిని పరిష్కరించడం. చిరునవ్వుతో తిలకించమన్నారు కదా అని, ఎప్పుడు ఒక వెధవ నవ్వు నవ్వుతూ, నిమిషం లో తలని వందసార్లు తిప్పడం నటన అనిపించుకోదు. కృష్ణుడిగా నటించి, ఆయన చేసిన రెండు పనులు ఇవే. (1) ముద్దు ముద్దు గా మాట్లాడడం (2) అవసరం ఉన్నా లేకపోయినా తల ఒక వందసార్లు ముందుకి వెనక్కి ఆడించడం చూసేవాళ్ళకి, తల మీద ఉన్న కిరీటం ఎప్పుడు ఊడిపోతుందా అని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది..! నాకు అర్ధమైనంత వరకూ, నేను గమనించినంత వరకూ, ఇది తప్ప ఇక వేరే నటన లేదు.

ఇక భట్రాజుల దగ్గరికి వద్దాం. అందరూ తమ వంతు సాయం తాము చేశారు. మాములుగా అందారూ బానే నటిస్తూ ఉంటారు, మరి ఈ సినిమాలో ఏమయిందో, అందరూ చాలా over action చేసారు.. అంతే సహవాస దోషం…!

అందరిలోకి ముఖ్యంగా, సుమన్ గారి ప్రియ సఖుడు, నెచ్చెలి అయిన ప్రభాకర్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఎంత ఇష్టుడు, మరి అంత చిన్న పాత్రలో ఎలా నటించాడో నాకు అర్ధం కాలేదు, తక్కువలో తక్కువ కనీసం కుచేలుడు లాగా అన్నా నటిస్తాడేమో అనుకున్నాను కానీ, అప్రాధాన్యమైన ఒక పేద బ్రాహ్మణుడి పాత్రలో అది కూడా ఎక్కువ నిడివి లేని పాత్రలో నటించాడు. అది అలా ఎందుకు జరిగింది అని వారిద్దరికే తెలియాలి. తల్లిగా సన కూడా తన వంతు సహాయం తాను చేసింది.

ఈ సినిమాలో చాలా విచిత్రాలు ఉన్నాయి. వాటిల్లో రెండు చెప్పుకోదగినవి (1)నిద్ర పోయేటప్పుడు కూడా పాత్రధారులందరూ, ఆ భారీ డ్రస్సులతోనూ, ఆ బండ కంఠహారాలతోనూ నిద్ర పోతుంటారు..! అసలు అది ఎలా సాధ్యమో వాళ్ళకే తెలియాలి..!! (2)సినిమా మొత్తం, ఎప్పుడు కృష్ణుడిని చూపిస్త్తున్నా, ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది.. అది కూడా సుమన్ గారు తన స్వహస్తాలతో, తాను రచించిన పాటే..! (గసదప, … శివుని ప్రాణేశ్వరీ.. అని సాగే పాట). ఒక్కసారి, రెండు సార్లు అంటే సరే కానీ సినిమా మొత్తం అదే వస్తూ ఉంటే వినే వాళ్ళకి ఎంత చిరాకు గా ఉంటుందో తీసిన వాళ్ళకి తెలియకపోవడం శోచనీయం.

మొత్తానికి ఏదైతేనేమి, ఈ.టి.వి ప్రేక్షకుల చిరకాల కోరిక తీరింది. ఆయనకి ఎంత మంది అభిమానులు ఉన్నారు అంటే, పోయిన సంవత్సరమే కాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రసారం చేశారు దీన్ని. ఈ సినిమా ఒక్కటే కాకుండా, సుమన్ గారివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ప్రముఖం గా చెప్పుకోవల్సింది, "సుమనోహరాలు". ఇది వారంతంలోనే కాకుండా, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తూ ఉంటుంది. దీంట్లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఇచ్చే అడ్వర్టైస్ మెంట్ కూడా చిన్నపాటి కార్యక్రమం లానే చూపిస్తూ ఉంటారు..! అదీ కాక, ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లోనే కాక, ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన వాటిల్లోని సన్నివేశాలని కూడా ప్రసారం చేయమని అడుగుతూ ఉంటారు వీరాభిమానులు..!! ఇంత ఓర్పుతో, నేర్పుగా సుమన్ గారిని ప్రేమిస్తున్న(భరిస్తున్న!) ఈ.టి.వి ప్రేక్షకులందరికీ నా జోహార్లు. ఏది ఏమైనప్పటికీ సినీ హీరోల స్థాయిలో, ఇంకా చెప్పాలంటే వారికన్నా మించి అభిమానులని కలిగి ఉన్న సుమన్ గారికి అభినందనలు. అలానే, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ సినిమాని కేవలం ఈ.టి.వి ప్రేక్షకులకి మాత్రమే పరిమితం చేసినందుకు వేల వేల నెనర్లు..!

P.S. ఇది అంతా చూసి నేను ఈ.టి.వి హార్డ్ కోర్ ఫంకా ని అనుకోకండి. ఆ రోజు నా టైమ్ బాలేక, టీ.వి. లో ఏ చానల్స్ రాకుండా కేవలం ఈ.టి.వి. మాత్రమే వచ్చింది. అసలే మధ్యాహ్నం నిద్ర పట్టలేదు, కాబట్టి తప్పనిసరి నాకు దీన్ని వీక్షించే అదృష్టం కలిగింది.

19 comments:

vennela said...

thank god..meeru kooda aa badhithulena..aayanaki vunna following chusi nenu okkate different anukunna..

ఏకాంతపు దిలీప్ said...

Evaru kaadandi Suman bhaadhitulu... adento asalu tanaki evaraina feedback istaaro ledo koodaa teliyadu... Konchem athi takkuva undi,sampradaaya baddhamgaa untundi kadaa ani appudappudu ETV pedite, Suman hadavudito rotha pudutundi... oka manchi channel atani obsessionto ala paadaipovadam nijamgaa bhaadhaakaram...

రాధిక said...

kevvu...keka

కార్తీక్ పవన్‌ గాదె said...

Oh my mad..!! :P

He is really mad..!!!

Sudhakar said...

LOL

శ్రీనివాసమౌళి said...

ఉషాకిరణ్ సినిమాలకి ఈయన ఎందుకు తన ప్రజ్ఞని ఉపయోగించటం లేదా అనుకుంటూ ఉంటా.... ఎంతైనా రామోజీరావు గారు తెలివైన నిర్మాత...
:P :P :P

అసలు నాకు ఈటీవీ లో వచ్చే సీరియల్స్ కన్నా సీరియల్స్ మధ్యలో వచ్చే సూపర్ హిట్ సీరియల్స్ ప్రకటనలు ఇష్టం ....వాటికి ఇచ్చే 'వెనక ప్రదేశ ' సంగీతం వింటే చెవులకే కాదు ఒళ్ళంతా ఒకలాంటి అనుభూతి... అసలు ఎడిటర్ అనేవాడిని గనక పెట్టుకుంటే ... రీల్స్ అన్నీ కొసేస్తాడు.. ఈకాలం ఫాక్షన్ సినెమాల్లో మన పరుచూరి వారి ధీరోదాత్త హీరో పీకలు కోసినట్టు...

karyampudi said...

ఈయన గారు శ్రీకృష్ణుడిగా నటించిన చిత్రం నేనెప్పుడో 2005 లో చూసిన గుర్తు.నిజంగా ఓవర్ యాక్షన్ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే ఆ సినిమా చూయించొచ్చు అలానే యాక్టింగు స్కూల్ వాల్లెవరైనా నటన ఇలా చెయ్యకూడదు అని ఎక్షాంపుల్ గా ఇలాంటి సినిమాని చూపించ వచ్చు .

కొత్త పాళీ said...

టైటిలు దగర్నించీ శుభందాకా .. మీ సుమన్ సినిమా సూపర్ హిట్!

చదువరి said...

సుమన్ ఈటీవీలోకి రాకముందు, ఇంట్లో ఖాళీగా ఉండి ఏమీ తోచక ఏకపాత్రాభినయాలు వెయ్యడం, ఇంట్లో చెంబులూ తప్పేలాలతో సంగీత సాధన చెయ్యడం, తానే పాటలు కట్టి పాట్టం, ఇలాంటివి చేసేవాడంట. రామోజీరావు ఆ తలనెప్పి భరించలేక ఈటీవీ అప్పజెప్పి, నీ వేషాలు అక్కడ వేసుకో పొమ్మమన్నాడట! ఆ విధంగా సుమన్నొదిలించుకున్నాక, (ఈటీవీపై ఆశలొదిలేసుకున్నాక,) తాను ఈటీవీ జోలికి పోవడం మానుకున్నాడు. ఆ తరవాత, ఈటీవీ2 పెట్టి, సుమన్ ఆ ప్రాంతాల్లోకి రాకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. మరో సంగతి.. రామోజీరావు మీద రాజశేఖరరెడ్డికి కోపమెందుకో తెలుసా? ఈనాడు గురించి కాదట.. సుమనోత్సాహాన్ని భరించలేకేనట.. 'మీవాణ్ణి అదుపులో పెట్టకపోతే నీ అంతు చూస్తాన'ని రాజశేఖరరెడ్డి బెదిరిస్తే.., 'మావాడితో పెట్టుకునేకంటే నీతో గొడవపట్టమే తేలిక'ని రామోజీరావు అన్నాడట. రాజశేఖరరెడ్డిక్కూడా సుమను జోలికెళ్ళడానికి భయమేసి, ఆ కోపాన్ని మార్గదర్శి మీద చూపిస్తున్నాడట. రాజశేఖరరెడ్డి, రామోజీరావు లంతటి వాళ్ళే భరించలేకపోయారు, ఇక మనమనగా ఎంత?

రమ్య శ్వెత బూదరాజు said...

ha ha
nijam ga sooper
meeru raasina vidhaanamu battE arthamaindi mEru elaa baadhapaDDarO

Rajendra Devarapalli said...

అయ్యా చదువరి గారూ. మీకు license to kill ఏమన్నా ఉందా? ఇలా నవ్వించి?

Unknown said...

అయ్యో నే మిస్సయిపోయా...
నాకిలాంటివి భలే ఇష్టం. రెండో భాగం తీస్తే తప్పకుండా చూస్తా :)

Unknown said...

సుమన్ కార్యక్రమాలను భరించే ఓపిక నాకు లేదు కానీ ఒక విషయంలో తన చిత్తశుద్ది నచ్చుతుంది. మీడియాలో వ్యక్తుల ద్వారా నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమన్ కొన్నేళ్లుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని నాకు ఐదారు నెలల క్రితం తెలిసింది. ఆ పరిస్థితుల్లోనూ తను అంత ఏక్టివ్ గా పనిచేస్తున్నారంటే గొప్పదనమే అన్పిస్తుంది నాకు! ఆ ఒక్క విషయం నాకు ఆయనలో నచ్చుతుంది.

- నల్లమోతు శ్రీధర్

మేధ said...

@వెన్నెల గారు, @దీపు గారు, @కార్తీక్ గారు, @సుధాకర్ గారు: చాలా బాధితుల సంఘాలు ఉన్నాయి కదా, మనం కూడా "సుమన్ బాధిత సంఘం పెడదాం". ఏమంటారు..?!!

@రాధిక గారు: మీ కామెంట్ కత్తి..!

@శ్రీనివాస మౌళి గారు: మరి ఎంతైనా రామోజీ రావు గారు పెద్ద వ్యాపార వేత్త కదండీ. బంధుత్వం ఎక్కడైనా కానీ, వ్యాపారం లో కాధంటారు కదా..!!

@వరప్రసాద్ గారు: 2005లో కూడా వచ్చిందేమో నాకు తెలియదండీ, నేను మాత్రమ్ 2006లో చూశాను. మీరు ఇచ్చిన సలహా చాలా బావుంది.. :)

@కొత్తపాళీ గారు: నా మొదటి సినిమాని విజయవంతం చేసినందుకు నెనర్లు.

@చదువరి గారు: నేను వ్రాసిన దాని కంటే, మీరు వ్రాసింది చదువుతుంటే ఎక్కువ నవ్వు వచ్చింది..

@రాజేంద్ర కుమార్ గారు: అది చదువరి గారికి వెన్నతో పెట్టిన విద్య!

@ప్రవీణ్ గారు: రెండో భాగం గురించి తెలియదండీ.. బహుశా వచ్చే సంవత్సరం చేయాలని అనుకుంటున్నారేమో...

@శ్రీధర్ గారు: మీరు చెప్పిన విషయం నేనూ విన్నానండీ. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అదే నిజమయితే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత ఓపికగా చేయగలగడం great..

Nagaraju Pappu said...

కొత్తపాళిగారు చెప్తే ఇప్పుడే చూసాను ఈ టపా - వచ్చే సంవత్సరం నరక చతుర్దశినాడు ఈ టపాకాయనే పేల్చుకొని సంబరాలు చేసుకోవచ్చు - చాలా బాగా రాసారు - మతాబులా, చుచ్చిబుడ్డీలా నవ్వుల వెలుగులు చిమ్ముతోంది. నరకాసురుడి గురించి చదవటమేగాని, ఇప్పుడు ఈ టీవి చూస్తే, ఆ బాధలు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు.

సుమన్ స్వాములవారికి సిరివెన్నెల, మనో, బాపులు ఓ లెక్కటండీ - ఆయన ఏకంగా, పదకవితాపితామహుడితోనే పోటీ పడుతుంటే?!!

ఏకంగా వెయ్యిపాటలు రాసెస్తాట్ట, ఆ తర్వాత ఆయనే పాడేస్తాడు కూడా. మన అధృష్టవసాత్తూ ఆయనకి రాని విద్య నాట్యం ఒక్కటే, లేకపోతే గజ్జెకట్టి ఆడేవాడేమో కూడా.

Ravindra Prasad said...

Usha and I could not stop laughing. keep it going.
Regards,
Ravi

Naga Pochiraju said...

అమ్మో ఎంత మంది భాధితులు ఉన్నారో(బ కి వత్తు,బాధ యొక్క తీవ్ర రూపం కోసం వాడాను )
ఇంత కాలం నేను ఒక్క దాన్నే అనుకున్నాను
నాకు ఈటీవీ చానెల్ అంకె నొక్కాలి అన్నా భయమే
కాస్త మంచి సినిమాలు వేస్తాడు అని పొరాబాటున పెడితే ఈ సుమన్ దర్శనం తో మనసు వికలం అవుతుంది

మొదట్లో భక్తుడిగా కింద కూర్చుని పాటలు పాడేవాడు,ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పక్కన చేరి ఆయన్ని ఊయలలూపాడు,ఆ తరువాత ఆయన్ని పక్కకి తోసేసి ఆయన స్థానాన్ని ఆక్రమించుకున్నాడు

సత్యసాయి కొవ్వలి Satyasai said...

సుమన్ గారికి లాస్టు నోబెల్ లిటరేచర్ ప్రైజ్, ప్రభాకర్ కి కడసారి అకాడెమీ ప్రైజ్ ఇచ్చి ఆపురస్కారాల గౌరవం నిలబెట్టాలని మాగృహవర్గసభ్యులందరం ఏకgrieve0గా నిర్ణయించాం. సుమనోహరమైన నాటపా చూడగలరు.
http://satyasodhana.blogspot.com/2007/07/blog-post_28.html

మురళి said...

గ్రేట్ మేధ గారూ... మీరు 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' ప్రివ్యూ చూసి ఉండరు.. అది కూడా ఈటీవీ లోనే వచ్చింది లెండి.. ఎస్వీ కృష్ణా రెడ్డి లాంటి సినిమా వాళ్ళంతా వచ్చి ఎన్టీఆర్ తర్వాత సుమనే అని పొగడడం.. చూసి ఉంటే తప్పకుండా ఇంకో టపా రాసేవాళ్ళు.. నాకేమో అప్పుడు బ్లాగు లేదు.. ప్చ్..