Monday, December 31, 2007

ఆత్మావలోకనం

hmm.. 2007 కూడా అయిపోతోంది.. కాలచక్రం చాలా వేగంగా తిరిగిపోతోంది.. నాకు ఇంకా, 2006 Dec 31 గుర్తుంది.. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అనిపిస్తోంది.. ఒక సామెత గుర్తొస్తోంది నాకు.. .. “Time and Tide wait for none” అని..! దాని అర్ధం ప్రాక్టికల్ గా నాకు ప్రతి సంవత్సరం డిసెంబరు 31న తెలుస్తూ ఉంటుంది....

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ సంవత్సరం లో ఉపయోగపడే(నాకు) పనులు కాస్త ఎక్కువే చేశాను అనిపిస్తోంది..

(1) GATE రాంక్ సాధించాను
(2) కంపెనీ మారాలి అనుకున్నాను మారాను..
(3) సంగీతం నేర్చుకోవాలి అనుకున్నాను, నేర్చుకోలేకపోయినా, అసలు సాధన అంటూ కొద్దిగా మొదలుపెట్టాను.. ఈ మాత్రం దానికే అంత సంతోషమా అంటారా, ఏమి చేస్తాం నేను చాలా అల్ప సంతోషిని..
(4) కొన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో, మొదటి అంకాన్ని దాటగలిగాను

hmm.. ఇంతకంటే నేను సాధించినవి ఏమీ గుర్తు రావట్లేదు.. కానీ, కనీసం ఇవన్నీ సాధించాను అని ఆనందంగా ఉంది.. ఎందుకంటే, 2006లో కనీసం ఇవి కూడా లేవు.. పైన చెప్పాను కదా, నేను అల్ప సంతోషిని అని..!

అయితే పైన చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయేది ఇంకొక ఎత్తు.. నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను…!! నేను బ్లాగ్ మొదలు పెడదామని ఒక సంవత్సర కాలం నుండి అనుకుంటున్నాను.. అది ఇప్పటికి కుడిరింది.. కాబట్టి ఇది కూడా నా achievements లో కి వస్తుంది..!!!

నా చుట్టూ ఉన్న ప్రపంచం లో కూడా, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి…

(1) మనిషి జన్యుపటాన్ని ఆవిష్కరించారు
(2) i-phone వచ్చింది
(3) నానో టెక్నాలజీ బాగా అభివృధ్ధి చెందింది
(4) మన భారతీయునికి నోబెల్ బహుమతి వచ్చింది

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి.. అయితే మంచి ఎంతగా జరిగిందో, చెడు కూడా అంతే జరిగింది.. 2006ని, సద్దాం ఉరితీత తో ముగించాల్సి వస్తే, 2007కి బేనజీర్ హత్య తో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తోంది..

కనీసం ఈ క్రొత్త సంవత్సరంలో అయినా, మనుష్యుల మధ్య ఉన్న వైషమ్యాలు తగ్గి, ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ, 2007కి వీడ్కోలు పలుకుతూ, 2008కి ఆహ్వానం పలుకుతున్నాను...

16 comments:

కొత్త పాళీ said...

సంతోషమండీ. మరి ఉద్యోగం మానేసి ఎంటెక్ చెయ్యబోతున్నారా?

Unknown said...

అన్ని సాధించినందుకు అభినందనలు...
ఈ సంవత్సరం మీరు ఇంతకంటే ఎక్కువ సాధించగలరని ఆశిస్తున్నాను.

మేధ said...

@కొత్తపాళీ గారు: actualగా చేద్దామనుకున్నాను.. కానీ కొన్ని problems వల్ల కుదరలేదు.. ఈ సంవత్సరం చేద్దాం అని అనుకుంటున్నాను.. చూద్దాం ఏమవుతుందో..

@ప్రవీణ్ గారు: Thanks అండీ..

అనిర్విన్ said...

All the best అండీ.

netizen నెటిజన్ said...

ఎవరా భారతీయుడు, "నొబెల్" బహుమతి గ్రహీత?

మేధ said...

@చాలా బావుంది గారు: చాలా Thanks అండీ..
@నెటిజెన్ గారు: ఆర్.కె.పచౌరీ గారికి...

netizen నెటిజన్ said...

పచౌరి గారు, ఆల్ గోర్‌తో పంచుకున్నాడండి!
మొన్న ఎవరో, "వారణాసి దుర్గాప్రసాద్" అనే తెలుగువాడికి "నొబెల్" బహుమతి ఇచ్చారంటేను..

మేధ said...

@నెటిజెన్ గారు: పంచుకున్నంత మాత్రాన, ఆయనకి రాలేదు అని అనలేము కదండీ...!!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఔరా ! ఎవరా దుర్గాప్రసాద్ ? ఏమా కథ ? తెలిసినవారు చెప్పగలరని ప్రార్థన.

వీవెన్ said...

2007 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా IPCC (Intergovernmental Panel on Climate Change) మరియు ఆల్ గోర్ లకు ప్రధానం చేసారు.

ఇకపోతే, రాంజేంద్ర పరచూరి అన్నతను IPCCకి చైర్. IPCC తరపున ఆయన బహుమతి అందుకున్నారు. అంతమాత్రాన బహుమతి ఆయనకు వచ్చినట్టుకాదు. పైనిచ్చిన నోబెల్ సైటు పేజీలో ఆయన పేరు కూడా లేదు.

వారణాసి దుర్గా ప్రసాద్ అన్న తెలుగాయన IPCCలో పరిశోధకులు. నేను ఇక్కడ కూడా వివరణ ఇచ్చా.

@మేధ, @నెటిజన్
సమాచార యుగంలో, అందునా తేలికగా నిర్ధారించుకోగలిగిన విషయాల్లో కూడా, మూలాలు సరిచూసుకోసుండా, చెప్పుడు మాటలు విని రాస్తే బ్లాగులకి, వ్యాఖ్యలకి విలువేముంటుంది. వాస్తవాలని నిర్ధారించుకుని రాస్తే బాగు. బ్లాగుర్లు ఇప్పుడు అల్లాటప్పా కాదు, పౌర జర్నలిస్టులు. ఈ టపా దృష్టిలో ప్రాముఖ్యం కాకపోయినా, చెప్పకుండా ఉండలేక పోతున్నా.

వీవెన్ said...

పైన నోబెల్ సైటు లింకు తప్పుగా వచ్చింది. ఇదీ లింకు: http://nobelprize.org/nobel_prizes/peace/laureates/2007/

netizen నెటిజన్ said...

@ వీవెన్ గారికి: జవాబు ఇక్కడ చూడండి:
మీమాట కూడ ఇక్కడ ఉంది.
http://tinyurl.com/2ls8r7

వీవెన్ said...

మీ టపా లింకుని పైన నా వ్యాఖ్యలోనే ఇచ్చా.
అక్కడ చర్చ తరువాత కూడా మీ పచౌరి గారు, ఆల్ గోర్‌తో పంచుకున్నాడండి! అన్న వ్యాఖ్య వాస్తవాన్ని చెప్పట్లేదు కదా. అందుకే మీకూ రాసా.

మేధ said...

@వీవెన్ గారు: నాకు తెలుసండీ.. పచౌరీ గారు ఆ సంస్థకి ఛైర్మన్ గారి హోదాలో అది తీసుకున్నారు.. అయితే, ఆయన మన భారతీయుడు అనే ఉద్దేశ్యంతో అలా ప్రస్తావించాను..! అంతే తప్ప వాస్తవాలని వక్రీకరించాలనో, లేక సగం తెలిసి సగం తెలియకుండా ప్రస్తావించలేదు..

netizen నెటిజన్ said...

@వీవెన్: శుక్రవారం - నవంబర్ ౨, ౨౦౦౭ న TV5 వారి కధనం ప్రకారం వారణాసి దుర్గాప్రసాద్‌కి "నొబెల్" బహుమతి వచ్చింది.
(ఆ వార్తని వారి సంపాదకులకి పంపడంకూడా జరిగింది. దురదృష్టవశాత్తు దాని ప్రతిని అవసరం ఉండదేమో నని తొలగించడంమైనది).

ఆ వార్త చూసినతరువాతే మీరు "వివరణ" ఇచ్చిన బ్లాగు ప్రచురించడమైనది.

తెలుగువాడికి "నొబెల్" అన్న వార్తలో అపోహ పోగొట్టాలనే ఆ బ్లాగు వెలువడింది.

అందుకే ఈ బ్లాగులో కూడా, "ఎవరా భారతీయుడు, "నొబెల్" బహుమతి గ్రహీత?" ప్రశ్న ఉదయించింది.

మీరన్నట్టు,"సమాచార యుగంలో, అందునా తేలికగా నిర్ధారించుకోగలిగిన విషయాల్లో కూడా, మూలాలు సరిచూసుకోసుండా, చెప్పుడు మాటలు విని రాస్తే బ్లాగులకి, వ్యాఖ్యలకి విలువేముంటుంది. వాస్తవాలని నిర్ధారించుకుని రాస్తే బాగు".

మీ అభిప్రాయంతో ఏకిభవించడం మూలంగానే ఆనాడు ఆ బ్లాగు వెలువడింది.

ఇక ఇంకా వివరంగా వివరించకపోవడానికి కారణం, మీరన్నట్టు -"బ్లాగుర్లు ఇప్పుడు అల్లాటప్పా కాదు, పౌర జర్నలిస్టులు", ఒకటైతే, "ఈ టపా దృష్టిలో ప్రాముఖ్యం కాకపోయినా," ఎవరికి వారు తెలుసుకో గలుగుతారు అని అనుకోవడం. బహుశ అదే తప్పిదమేమో!

వీవెన్ said...

@నెటిజన్
మంచిది. నాకు ఆ వెనక సంగతులు తెలియవు.