Note: ఇవి చూసి మీకు
కోపం -- నాకు ఇష్టమైన పాటలని ఇంత భయంకరంగా మార్చేసిందేంటీ ఈ అమ్మాయి అని!
చిరాకు -- ఛా, ఇంత దారుణంగా మార్చాలా...
వీటిలో ఏ భావాలు కలిగినా, అది కేవలం మీ మానసిక ఫీలింగ్ తప్ప, నా టపా కి, నాకు - మీ మనోభావాలతో సంబంధం లేదు అని తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా!
ముందుగా అర్చన...
కోడర్, డెవలపర్, టెస్టరార్చిత సిస్టం...
అష్ట దరిద్ర కారక సిస్టం...
నష్ట భయంకరశోభిత సిస్టం..
సిస్టమాష్టకమిదం పుణ్యం యః పఠేత్ పున్నామ నరక మవాప్నోతి!
ఇప్పుడు - పల్లవి
పల్లవించు తొలి బగ్గే సూర్యోదయం...
పరవశించు తొలి ఫిక్సింగే చంద్రోదయం...
సరికొత్తగా సాగు ఈ టెస్టింగ్.. మా జీవితాలతో ఆడు సయ్యాట!
నాలుగు దిక్కుల(మాకు 4 టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి!) నా కోడ్ క్రాష్ లు తెలిసిపోయే వేళ..
అనుపల్లవి...
సిస్టం మూగది.. కోడింగ్ రానిది.. టెస్టింగ్ ఒకటే అది నేర్చినది... అదే నా కొంప ముంచుతున్నది..
చివారఖరుది...
జాలిగా కంప్యూటరమ్మ Shutdown అవలేదు ఎందుచేత...
code left-right-centre crash అవుతోంది...
ఆటుపోటు ఘటనలివి, ఆటవిడుపు నటనలివి...
కంచి కెళ్ళిపోయేవే రిలీజ్ లన్నీ!!!
skip to main |
skip to sidebar
17 comments:
Super [:)]
టపామిదం పుణ్యం యః పఠేత్ హాసం లబతి.
:):):):):):)
భలే ఉంది...
Hilarious!! Nice parody!
హహహహ... భలే కామెడీగా రాశారు. వండర్ ఫుల్!
cool
వండర్ ఫుల్!
హ హ హ.
nee status messages lannitini tala tannela vundi ee tapa.. ;) very good one..
నేను చెప్పకదా నీ టాలెంట్ చాలా పెరిగిపోయింది ( పాపం టెస్టింగ్ చేసీ చేసీ :( ),
సిస్టమాస్టకం బాగుంది...
ఇంకా కొన్ని మంచివి వ్రాసావు కదా, అవి చేరిస్తే బాగుండేది !!!
హ హ హ భలే వ్రాసారు మేధా.. :-)
:))))
hahahaha baagundi
ప్రాజెక్ట్ ఎండింగ్ లో టెస్టర్ కై ఎదురు చూసేనే బగ్గు
బగ్గు రాని చో ఆ రోజు టెస్టర్ కి జాతరే
బగ్గులన్నవే రాని వేళలో
సెలెబ్రేషన్స్ యే టెస్టర్ మదిలో
అయ్యో పాపం టెస్టరూ !! (yamuna tati lo )
కేకో కేకా!!! మేధా గారు
బాగుంది మీ సిస్టమాస్టకం
కోడింగ్ సంగతి ఏమో గానీ ఎంటేక్ చేసే రోజుల్లో అప్పటి హిట్ పాటలకి చాలా పేరడీలు కట్టేవాళ్ళం.
సీసీ టాపు మీదికి నువ్వు మెల్లమెల్లగా పాకిపాకి పోయావంటే ఫ్లాపీలుంటాయ్
ఫ్లాపీ తెచ్చి డ్రైవ్లో పెట్టి ఇంస్టాల్ నువ్వు చెయ్యబోతే సిస్టం కాస్తా క్రాష్ అయ్యే బంచికు బంచికు బంచికు బం!
(సీసీ = కంప్యూటర్ సెంటర్)
పంతొమ్మిది వందలా తొంభై వరకు ఇల్లాంటి సాఫ్ట్వేరు నాకంట పడలేదు, పడినా నే వెంట పడలేదు..ఓ డిబేస్ ఫైవు, రావే నా ఫ్లాపీలోకీ...
@అరుణ గారు, చైతన్య గారు, పసిగుడ్డు, పూర్ణిమ గారు, శ్రీధర్ గారు, సూర్యుడు గారు, నాగప్రసాద్ గారు, వేణూశ్రీకాంత్ గారు, శివ గారు, మహేష్ గారు, సందీప్ : టపా నచ్చినందుకు నెనర్లు..
@ప్రపుల్ల: మర్చిపోయాను ప్రపుల్ల.. ఏదో హడావిడిలో వ్రాశాను.. ఈసారి మళ్ళీ ఇలాంటి టపా వ్రాస్తే అప్పుడు పెడతా.. :)
@లచ్చిమి: మీ ప్యారడీ కూడా సూపర్ :)
@కొత్తపాళీ గారు: హ్హహ్హహ్హ... మీ ప్యారడీలు చాలా బావున్నాయి... మేము ఇంటర్ వరకు, ఇలాంటి ప్యారడీలు చాలా చేసేవాళ్ళం... మళ్ళీ ఉద్యోగం లో చేరిన తరువాత మొదలయ్యింది.. ఇక సువాన్ కి వచ్చిన తరువాత ఇంకా ఎక్కువయ్యింది...!
పేరడీలు బాగా పేలాయి :) పల్లవించు తొలి బగ్గే సూర్యోదయం.. పరవశించు తొలి ఫిక్సింగే చంద్రోదయం.. పేరడి అయితే మరీ బాగుంది..
Post a Comment