Thursday, May 14, 2009

మొబైల్ టి.వి.

టెక్నాలజీ శరవేగంతో మారిపోతోంది.. ఈ రోజున్న పధ్ధతులు రేపటికి ఉండడం లేదు.. మొదట్లో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించే, మొబైల్ ఫోన్ ఇప్పుడు కంప్యూటర్ ని replace చేసింది.. మినీ కంప్యూటర్ అయిపోయింది.. అంతటితో సెల్-ఫోన్ ప్రస్థానం ఆగిపోలేదు.. ఇడియట్ బాక్స్ అని మనం ముద్దుగా పిలుచుకునే టి.వి. కూడా ఫోన్ లో ఒదిగిపోతోంది...

ఇప్పటికే జపాన్, కొరియాలాంటి చోట్ల మొబైల్ టి.వి. ప్రసారాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.. మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది, అయితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదు..

మొబైల్ టి.వి అంటే?
మొబైల్ టి.వి. అంటే మనం ఇంట్లో లేకపోయినా, టి.వి లొ వచ్చే కార్యక్రమాలన్నీ మన మొబైల్ ఫోన్ లో రావడం... ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా టి.వి. చూడచ్చనమాట... అయ్యో, TV9 నిరంతర వార్తా స్రవంతి మిస్స్ అవుతున్నామని లేకపోతే, Etv2 ఘంటారావం గంటలు వినలేకపోతున్నామని అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు!!

ఏ టెక్నాలజీనో...?
ఈ మొబైల్ టి.వి. ప్రసారాలకి ఒక్కో దేశంలో ఒక్కో టెక్నాలజీ వాడుతున్నారు.. ఉదాహరణకి, జపాన్/కొరియా లో ISDB-T, యూరోప్ లో అయితే DVB-H, మన దేశంలో IPTV ఉపయోగిస్తున్నారు..

మొబైల్ టి.వి. వాడకంలో జపాన్/కొరియా అన్నింటికంటే ముందున్నాయి. అక్కడ విడుదల చేసే, ప్రతి మొబైల్ ఫోన్ (ఒక్క low end models తప్పించి) లో టి.వి. తప్పని సరి. అక్కడ వాడే Standard - ISDB-T -- OneSeg.. మామూలు టి.వి ప్రసారాలకి వాడే బ్యాండ్ విడ్త్ ని 13 సెగ్మెంట్స్ చేసి, దాంట్లో 13వ సెగ్మెంట్ ని కేవలం మొబైల్ ప్రసారాలకి ఉపయోగిస్తారు.. ఒక్క సెగ్మెంట్ లోని frequency ని మాత్రమే వాడడం వల్ల, దీన్ని OneSeg అంటారు..

సీరియల్స్, సినిమాలు తప్ప ఏమీ ఉండవా..?!
మొబైల్ టి.వి. అంటే కేవలం టి.వి. ప్రసారాలు మాత్రమే కాదు.. దీంట్లో ఇంకా చాలా సమాచారం అందుబాటులో ఉంటుంది.. ఈ రోజు మనమున్న ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో ఇత్యాది వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. అసలే జపాన్ లో భూకంపాలు అవీ ఎక్కువ.. ఎక్కడైనా, ఏమైనా జరిగినా emergency messages టెలీకాస్ట్ చేయడానికి, ప్రజలని అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.. ఈ సమాచారం అంతా పంపించడానికి ఉపయోగించే టెక్నాలజీని, BML- Broadcast Markup Language.. కేవలం సమాచారం మాత్రమే కాకుండా, Internet links, కంపెనీలు ప్రకటనలు పంపించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు..

Any Additional Features..??

ఎంతసేపూ టి.వి. చూడడమేనా, వేరే పనులేమీ లేవా అంటారా..?! కేవలం చూడడమే కాదు, ఆ కార్యక్రమాలని రికార్డ్ చేసుకుని mp3player/DVD కి transfer చేసుకోవచ్చు.. ఎటూ ఫోన్స్ లో ఇప్పుడు 32GB In-built memory మెమరీ ఉంటోంది.. అలానే ఇంకో 32GB SD Card Support కూడా ఉంది.. కాబట్టి ఎన్ని ప్రోగ్రాములనైనా రికార్డ్ చేసుకోవచ్చు..

ఇప్పుడు Set-top-box లో అందుబాటులో ఉన్న reserve-recording/reminder సదుపాయం కూడా మొబైల్ టి.వి. లో ఉంది.. మనము తేదీ, సమయం ముందే సెట్ చేసి ఉంచితే, ఆ కార్యక్రమం వచ్చే టైం కి ఆటోమాటిక్ గా, టి.వి power-on అవుతుంది, రికార్డింగ్ మోడ్ కూడా పెట్టి ఉంటే, రికార్డింగ్ కూడా మొదలవుతుంది..

ఇంకా దీంట్లో advanced features చాలా ఉన్నాయి. మనకి టి.వి. చూస్తున్నప్పుడు ఏదైనా సీన్ నచ్చితే, దాన్ని క్యాప్ట్చర్ చేసుకోవచ్చు.. మనం రికార్డింగ్ చేసిన ఫైల్స్ లో మార్కర్స్ కూడా పెట్టుకోవచ్చు.. ఉదాహరణకి, 20-20 మ్యాచ్ రికార్డ్ చేసాము.. దాంట్లో 4's 6's ఉన్న సీన్స్ మాత్రం వేరే ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు..

మరి ఖరీదు మాటో..

ప్రస్తుతానికి టి.వి ప్రసారాలకి కూడా డాటా ప్లాన్స్ తో కలిపి ఇస్తున్నారు.. అవి ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ ని బట్టి మారుతూ ఉంటుంది.. పోటీ ఎక్కువ ఉన్న చోట్ల ఉచితంగానే ఇస్తున్నారు, కొన్ని చోట్ల నామినల్ ఛార్జెస్..

ఎలాంటి ఫోన్ కావాలంటారు..?
టి.వి కావాలనుకుంటే, మొబైల్ సప్పోర్ట్ ఉండాలి.. ఇప్పుడు వచ్చే High-End Models అన్ని in-built TV Support తో వస్తున్నాయి.. కాబట్టి, అలాంటిది చూసి తీసుకోండి.. కాకపోతే, స్క్రీన్ పెద్దదిగా ఉంటే, మంచి ఎక్స్పీరియన్స్..

ప్రకటనల సంగతో..?
జపాన్/కొరియాలో మొబైల్ టి.వి ప్రసారాలకి ప్రత్యేకంగా బ్యాండ్ విడ్త్ ఉపయోగిస్తున్నారు కాబట్టి, అక్కడ కేవలం అరగంటకి ఒకసారి ఒక 5నిమిషాలు మాత్రమే వస్తుంటాయి ప్రకటనలు.. కాబట్టి ప్రస్తుతానికి అయితే, విసుగెత్తించే ప్రకటనల గొడవ లేదన్నట్లే...!

ఇలా చాలానే ఉన్నాయి.. త్వరలో మన భారతంలో కూడా, టి.వి ప్రసారాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి అందరూ టి.వి ప్రసారాలు ఆనందించాలని కోరుకుంటూ... :)

9 comments:

మురళి said...

ఆసక్తికరమైన సమాచారం..

నిషిగంధ said...

very interesting information!
అసలు ఈ టెక్నాలజీతో ఎక్కడ నించి ఎక్కడికి వెళ్తున్నామో!! ఈ మధ్య ఒక ఇన్వెన్షన్ కీ మరొక దానికీ మధ్య పెద్ద టైం గాప్ ఉండటంలేదు..

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
Padmarpita said...

Its an interesting and informative too.

మేధ said...

@మురళి గారు, పద్మప్రిత గారు: నెనర్లు
@నిషిగంధ గారు: నిజమే.. కళ్ళు తెరిచి చూసేలోపు, మారిపోతోంది.. :)
@వినయ్ చక్రవర్తి గారు:
Frequency range for ISDB-T OneSeg:
470Mhz ~ 770Mhz (UHF)

And the major problem with OneSeg is, we cannot watch TV in sub-ways and moving vehicles.. To overcome all these issues, they are coming with 3Seg...

>>mobile tv= mobile +set top box

I dnt understand it clearly..
Basically mobile TV works also in similar lines of Digital TV except that, they have a seperate band of frequencies - (13th segment of Digital TV Frequencies)

If this is not your point, please be more clear..

వేణూశ్రీకాంత్ said...

ఆసక్తికరమైన సమాచారం అందించారండీ.. నెనర్లు.. మీరు మొబైల్స్ మీద భలే రీసెర్చ్ చేస్తుంటారు అనుకుంటా :)

రవి said...

మొబైల్ ఫోనుకు డిస్ ప్లే డివైసు ను అనుసంధానించడం, ఈ మధ్య జరుగుతున్న మరో రీసెర్చి. ఉదాహరణకు, సాధారణ మొబయిలుకు ఎల్ సీ డీ ని తగిలించడం. ఇక ఎల్ సీ డీ లు కూడా ముదురుతున్నాయి. మడత పెట్టి, పుస్తకంలా వాడుకునే ఎల్ సీ డీ లు, రెండు మూడు ఎల్ సీ డీ లకు ఒకే ఇన్ పుట్ డివైసు వగైరా.. ఇలా.. ఇది హార్డ్ వేర్ లో సాగుతున్న భాగోతం.

మేధ said...

@వేణూ శ్రీకాంత్ గారు: నెనర్లు
నేను పని చేసేది మొబైల్ ఫోన్స్ మీదే :)

@రవి గారు:
అవును .. నేను చూశాను.. అదే కాకుండా, అసెంబుల్డ్ పి.సి. ల మాదిరి అసెంబుల్డ్ ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా..

$h@nK@R ! said...

వెరీ ఇన్నొవేటివ్...