అప్పుడే ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయి అయిదు రోజులు అయింది.. వాళ్ళు లేరని ఇంకా నమ్మబుధ్ధేయడం లేదు.. నేను చూసిందంతా కల అయితే ఎంత బావుండో అనిపిస్తోంది.. నిజాన్ని నిజం అని నమ్మాలంటే చాలా ధైర్యం ఉండాలేమో.. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో..
ఇంకా ఆంటీ ఇంట్లో తిరుగుతున్నట్లే.. మమ్మల్నందరినీ పలకరిస్తున్నట్లే ఉంది.. మొన్న ఈ కళ్ళతో జరిగిన కార్యక్రమాలన్నీ చూశా.. అయినా నిన్న ఊళ్ళో బస్ దిగుతుంటే, భోజనం వేళకి వెళుతున్నాను, ఆంటీ ఏదో ఒకటి పెట్టకుండా ఊరుకోరు.. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తోంది మనసు.. ఏమని చెప్పి ఊరుకోపెట్టగలను...
నేను ఆ ఊరెళ్ళి అయిదు సంవత్సరాలవుతోంది.. ఆంటీ వాళ్ళే విజయవాడ వచ్చేస్తున్నారు.. ఇక నేను ఆ ఊరు వెళ్ళనేమో అని మొన్నటి వరకూ అనుకున్నా.. అలాంటిది ఇలాంటి కారణంతో, ఊళ్ళో అడుగుపెడుతుంటే కాళ్ళు వణుకుతున్నాయి..
కాలం దేన్నైనా మరుపు తెస్తుందంటారే.. మరి వెళ్ళి ఇన్నేళ్ళైనా ఇంకా అన్ని జ్ఞాపకాలు అలానే ఉన్నాయే.. ఇంట్లో అడుగుపెట్టగానే ఏరా! ఎప్పుడొచ్చావు.. ఇదేనా రావడం రారా.. లోపలికి రా అంటూ పలకరింపులు.. అలా కూర్చున్నామో లేదో, ఇదిగో మాట్లాడుతూ ఇవి నోట్లో వేసుకోండి అని ప్లేటు చేతిలో పెట్టడం.. కరెంట్ పోయింది, బయట కాస్త గాలి వస్తుందేమో అని వెళితే, ఎంతసేపు నించుంటారు కూర్చోండి అంటూ మంచం వేయడం.. ఇల్లంతా తిరుగుతూ మధ్య మధ్య మాతో కలిసి కామెంట్స్ చేయడం.. ఇంకా ఎన్నెన్నో.. ఇవన్నీ నిన్నా-మొన్నా జరిగినవి కాదు.. పోనీ నేను వందసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళానా అంటే ఉహూ.. అయినా ఇంకా ఆ ఊసుల తడి ఆరలేదే...
ఇప్పట్లో ఇండియాకి రాను.. ఇక్కడ అంత బాలేదు కదా.. కుదిరితే వచ్చే సంవత్సరం వస్తాను.. నువ్వు అప్పటికి ఇండియాలోనే ఉంటావు కదా.. తప్పకుండా కలుద్దాం అన్న స్నేహితురాలిని ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు... ఏం మాట్లాడగలను.. ఏం చెప్పి మరపించగలను.. ఏం చేసి బాధ తగ్గించగలను...
వాళ్ళని చూస్తుంటే నిద్ర పోతున్నట్లే ఉన్నారు.. ఆంటీ పెట్టుకున్న బొట్టు అలానే ఉంది.. అంకుల్ మొహం చూస్తే నిద్రలో నవ్వుతున్నట్లుంది.. అలాంటిది లేదు ఇక ఇదే ఆఖరి చూపు.. ఇంకెప్పటికీ చూడలేవు అంటుంటే... ఇక చూడలేక మొహం తిప్పేసుకున్నా.. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.. అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది.. కానీ మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు ఉండరు.. కళ్ళు తుడుచుకుని, ఇంకోసారి.. ఇదే చివరిసారి అని చూస్తుంటే వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది.. ఎందుకు అంత తొందర.. ఏమంత కాలం మించిపోయిందని వెళ్ళిపోయారు... అసలు ఎవరినడిగి వెళ్ళిపోయారు.. కనీసం ఆఖరి మాటలు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు..
పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువంటారే.. నాదీ, అమ్మది కలిసి ఒక్క ఫొటో కూడా లేదు, ఇప్పుడు తీయి అని చెప్పి మరీ తేజుతో ఫొటో తీయించుకుని పదిరోజులు కూడా గడవకముందే ఇక మమ్మల్ని ఫొటోలోనే చూసుకోండి అని వెళ్ళిపోయిన అంకుల్ ముందుచూపుని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు...
పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నవాళ్ళు వాళ్ళ తీయని గురుతులు అన్నాడో సినీ కవి.. అది అక్షరాలా నిజం.. తేజు అచ్చం ఆంటీలా ఉంటుంది.. తనని చూస్తే ఆంటీని చూడక్కర్లేదు అని ఎన్నిసార్లు అనుకున్నామో.. పోయిన వారం ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి కూడా చూపించా తేజు - ఆంటీ ఒకేలా ఉంటారని.. అలాంటిది ఇక తేజులోనే ఆంటీని చూసుకోవాలంటే...
నా చదువు గురించి కనుక్కోవడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు అని తేజు ఒకటే ఏడుస్తోంది.. ఏమని సర్ది చెప్పగలం తనకి.. జీవితంలో మర్చిపోగలదా తను ఈ విషయం...
అటు పండుటాకులా ఇద్దరు పెద్దవాళ్ళు.. ఇటు ఇంకా చదువుకుంటున్న పిల్లలు... చిన్నా కి మాత్రం ఏమంత వయసుందని.. వచ్చిన వాళ్ళందరూ నువ్వే ధైర్యం గా ఉండాలి అని చెప్పేవాళ్ళే.. ఎలా ఉంటుంది ధైర్యం.. ఎక్కడ నుండి వస్తుంది..
నేను తన కూతురి స్నేహితురాలిని.. నాకే ఇవన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయే.. పుట్టినప్పటినుండి ఇప్పటివరకూ నిమిషం కూడా అమ్మని వదిలిపెట్టి ఉండని తేజు.. రోజూ ఆఫీసుకి వెళ్ళేముందు, వచ్చిన తరువాత చేసే ప్రతి పనీ పూసగుచ్చినట్లు మాట్లాడుతుందే చిన్నా.. చదివేది MBBS అయినా, అమ్మకూచే అయిన మమ్ము.. వీళ్ళ పరిస్థితి ఏంటి.. చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, చూసే ప్రతి చోట.. అన్నీ అమ్మ గుర్తులే.. మరపురాని, మరువలేని తీయని గుర్తులు... ఎంత సర్ది చెప్పుకుందామన్నా, చిన్నదాన్ని చూస్తే అమ్మ గుర్తొస్తుంది.. ఏం చేస్తే తీరుతుంది ఆ బాధ... పోనీ నాన్నలోనే అమ్మని చూసుకుందామంటే... అమ్మలేని చోట నేను ఎందుకు అని నాన్న కూడా వెళ్ళిపోయారు..
కాలం చాలా గొప్పది.. ఎంత పెద్ద గాయన్నైనా మానుస్తుంది అంటారే.. కానీ అసలు కాలమే గడవకపోతే... గాయం మానేదెలా....
రోడ్డు ప్రమాదంలో వెళ్ళిపోయిన ఆంటీ, అంకుల్ కి శాంతి కలగాలని కోరుకుంటూ....
skip to main |
skip to sidebar
17 comments:
Im very sorry. I loved one of my school days friend's mom just like this. However after that we lost touch. I came to know abt her death after 5 years. I couldnt explain the feeling. I cursed lord. I remembered all that now. I am sorry.
:( :(
May God keep the blessed souls in his lap and give the family strength to deal with.
-Karthik
ఏం రాయాలో కూడా అర్ధం కావడం లేదండి... ఎంతటి బాధనైనా మరపించే శక్తి కాలానికి ఉంది..
"అసలు కాలమే గడవకపోతే... గాయం మానేదెలా...." నిజమే.
వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటూ
chaduvutuntene manssu tarukku poetoendi.
talli tandrulu anni amrchi pedutuntene pillalaki kashtamgaa vundi. vaalle lekapote ? adii ardhaantaramgaa iddruu okesaari .emanaaloe kudaa telinata gaa gunde baruvekkindi.
very sorry
ప్చ్ ...ఏం రాయాలో కూడా అర్ధం కావడం లేదు .వారుభౌతికంగా దూరమైనా మీ అందరి జ్ఞాపకాల్లో జీవించే ఉంటారు .
మనసుని కదిలించేలా చెప్పేరు. నాఅనుభవంలో కాలం మనని మరిచిపోయేలా చేసేది చిన్నవిషయాలనే. కానీ ఇలాటి బాధ మాత్రం అలాగే వుంటుంది ఎంతకాలమయినా. కాకపోతే అది అలా మనసులో దాచుకుని బతకడం నేర్చుకుంటాం, మేధా. మీకు కూడా క్రమంగా మనశ్శాంతి కలగగలదని ఆశిస్తూ..
చాలా బాగా రాసారు మేధ గారు, ఇద్దరు ఒకే సారి వెళ్ళిపోయారంటే ఆ పిల్లల గురించి ఆలోచిస్తే హృదయం ద్రవించి పోతుంది. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని. పిల్లలు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకోడం తప్ప ఎవరైనా ఏమీ చేయగలం.
April lo US lo jarigina oka accidentlo chanipoyina vallalo na frnd kuda undi.
I culdn't concentrate on anything after losing her.I even stopped updating blog.After going thru ur post I decided to start writing again.
Iam very sorry.. Even i had same experience ;(
ఏం చెప్పాలో తెలీట్లేదండీ :(
వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
hmm I hear you.
కాలమే పూర్తి గా బాధ ను నయం చేస్తుందని చెప్పలేను కాని తప్పకుండా దాని తీవ్రత ను తగ్గిస్తుంది... వాళ్ళ ఆత్మ కు శాంతి కలగాలని మనస్పూర్తి గా కోరుకుందాము...
hello really nice blog . i am very glad to comment on it thanks for share such a nice blog with us really great
____________
manishfusion
seo jaipur---seo jaipur
నిజంగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన వారిని మరిచిపోవడం అంత తేలికైన విషయం కాదు.కానీ దైనందిన జీవితంలో తప్పదుకదా? పిల్లలకు ధైర్యం చెప్పక తప్పదు....
Iam sorry....వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మేధ గారూ ఎందుకండి మమ్మల్ని ఇంత బాధపెట్టారు...
చూడండి ఈ కర్ఖసత్వపు కన్నీరు ఆగనంటొంది ....
కదిలి పోయే కాలంలో అందరూ కరిగి పొవాల్సందే కదా
అయినా ఇలా హఠర్తుగా జరగడం మన హ్రుదయాలను మదించి
దిగమింగ లేని హాలాహలాన్ని వెలితీస్థుంది...
ఆంటీ , అంకుల్ గార్ల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను ..
అంతకన్న మనం ఎం చెయగలం చెప్పండి....
Post a Comment