Monday, October 6, 2014

'జయ'హో...


చెన్నపట్నం
---
తమిళనాడు అసెంబ్లీ: సమయం: మధ్యాహ్నం మూడు గంటలు

హిందీ పేరు, మాట, పలుకు ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అని శాసనసభ తీర్మానం

ఈ వార్త విన్న కేంద్ర ప్రభుత్వం వారు మనతోనే ఢీనా, చూస్తాం, చూస్తాం అంటూ తీవ్రమైన సమాలోచనలు
---
కలైంగర్ నివాసం : సమయం: సాయంత్రం ఆరు గంటలు

వాడిగా వేడిగా డి.యమ్.కె  సర్వసభ్య సమావేశం. అప్పా, మన పరిస్థితేం బాలేదు అమ్మ క్యాంటీన్, అమ్మ టి.వి., అమ్మ సిమెంట్ ఏ రంగం చూసినా "అమ్మ..  అమ్మ.. " . ఏం చేయాలో దిక్కు  తోచట్లేదు అంటూ బావురుమన్నాడు స్టాలిన్. ఏం సమాధానం చెప్పాలో తెలియక నిట్టూర్చాడు కరుణానిధి. "MOM" ని మార్స్ దాకా పంపించారు మన శాస్త్రవేత్తలు కానీ మనం 'అమ్మ'ని అంగుళం కూడా కదిలించలేకపోతున్నాము అని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇద్దరూ. ఇలా అయితే మనం మరుగునపడిపోవడం ఖాయం, ఆ అక్రమాస్తుల కేస్ ఒకటి జరుగుతోంది కదా, మనం ఏమైనా చెయ్యి వేయగలమేమో చూద్దాం అని అప్పటికి ఆ సమావేశాన్ని ముగించారు
---

పన్నీర్ సెల్వం నివాసం : సమయం: తెల్లవారుఝాము మూడు గంటలు

గాఢ నిద్రలో ఉన్న సెల్వంకు ఏదో కనిపిస్తోంది.. స్టేజ్ ఎక్కుతున్నట్లు, వెక్కుతున్నట్లు, అస్పాస్పష్టమైన ప్రమాణాలు .. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు - కొంచెం భయంగా అనిపించింది, మళ్ళీ ఆ రోజులు రావడం లేదు కదా అని కలవరపడ్డాడు. ధైర్యం కోసం ప్రక్కనే ఉన్న అమ్మ ఫొటో కి దణ్ణం పెట్టుకుని పడుకున్నాడు

---
పురచ్చితలైవి నివాసం: సమయం: ఉదయం ఏడు గంటలు

తనని తాను స్మరించుకుంది, నించోబెట్టి నిలేసిన నాయకులని గుర్తు తెచ్చుకుంది, ఏరి పారేసిన పార్టీలని పునశ్చరణ చేసుకుంది. అంతా తాను అనుకుంటున్నట్లే జరుగబోతుందని విశ్వసించి బెంగళూరు బయలుదేరింది.అభిమానులు, అనుచరగణం దిష్టి తీసి సాగనంపారు

---

బెంగళూరు:
---
సెషన్స్ కోర్ట్: సమయం: మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట

పొందుపరిచిన సాక్ష్యాలని బట్టి, న్యాయమూర్తి నేరం రుజువైందని తీర్పు ఇచ్చి శిక్ష ఖరారు చేశారు.

****
రెండు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. పోయిన ప్రాణాలు, వినిపిస్తున్న ఆక్రందనలకు లెక్కే లేదు. రాజ్యాంగం ప్రకారం క్రొత్త ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఇంత జరుగుతున్నా అమ్మ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. ఎదుటి పక్షం వారు మనం గెలిచేం అని మిఠాయిలు పంచుకున్నారు. అమ్మ సంగతి తెలిసిన వారు, ఇదేమి వింత అని ఆశ్చర్యపడ్డారు.

పది రోజులు గడిచాయి. పదకొండో రోజు ఏమి జరుగుతుందా అని అందరి ఆత్రుత .. ఇంతలో  ప్రక్క రాష్ట్రం వారు కేసుని స్వరాష్ట్రానికి బదిలీ చేయబోతున్నట్లు లీకులు వదిలారు.

ఇవేవి పట్టనట్లు టి.వి. చూస్తున్న అమ్మ, దాంట్లో వస్తున్న ప్రకటనలని చూసి నవ్వుకుంటోంది, ఆ ప్రకటన : "మరక మంచిదే!!!"

5 comments:

వేణూశ్రీకాంత్ said...

మీరు ధైర్యం చేసి పోస్ట్ రాసేశారు కానీ నాకు కామెంట్ రాయడానికి కూడా చేతులు రావడం లేదండీ "'జయ'హో..." :-))

మేధ said...

హ్హహ్హ వేణూ, అలా అంటారా... చూద్దాం :)

karthik said...

ఈ విషయం మొత్తానికి కన్నడిగా వర్సెస్ తమిళియన్ రంగు పులుముకునేలా ఉంది. కొట్టుకోవాడానికి కారణాలు తక్కువైనట్లు మళ్ళీ ఇంకొకటి.. చూద్దాం ఎక్కడికి దాకా లాగుతారో..

between, ఆ కోర్ట్ బెంగళూరు సెషన్స్ కోర్ట్, జైలు పరప్పన అగ్రహార జైలు.. గమనించగలరు.

hari.S.babu said...

అమ్మకు బెయిల్ దొరకలేదు!రాం జఠల్మానీ కూడా ఫెయిలయ్యాడు, పాపం!!

మేధ said...

@కార్తీక్: అవునండీ, ఉన్నవి చాలక ఇంకా క్రొత్తవి... చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెన్ని మాయలు చేస్తారో

@కోర్ట్: సరి చేసాను. అయితే ఏదో చోట, జైలు, కోర్ట్ ఒకే ఆవరణలో అని చదివాను, అందుకే కలిపి రాసేసా

@హరిబాబు గారు: ఎవరి పాపం వాళ్ళు అనుభవించక తప్పదు కదండీ :)