Saturday, April 4, 2015

Ignite (A burning desire) !

దేని గురించో వెతుకుతుంటే, మరేదో దొరికినట్లు, నేను RA Positions గురించి వెతుకుతుంటే, Ignite Program గురించి తెలిసింది. ఏంటా ఈ కార్యక్రమం అని వివరాలు చూస్తే, భలే అనిపించింది. ఒక మంచి ఆలోచన రావడం కష్టం, వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడం మరింత కష్టం. అక్కడే, ఈ Ignite Program సహాయ పడుతుంది.

ఆర్ధిక వ్యవస్థలో మార్పులు కానివ్వండి, విద్యా ప్రమాణాలు పెరగడం వల్ల కానీ, ఆలోచనా పరిధి విస్తృతమవడం వల్ల కానీ, మన దేశంలో Start-up సంస్కృతి యేటికేడు పెరుగుతోంది. మన Idea మనకెప్పుడూ నచ్చుతుంది. కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో అవరోధాలు ఎన్నో. ఎక్కడ మొదలుపెట్టాలి, funding ఎలా దొరుకుతుంది, ఎలాంటి features తో product ని మార్కెట్ చేయాలి, అసలు మన target segment ఎవరు ఇలాంటి వాటికి సమాధానాలు ఏ కొద్ది Start-ups దగ్గరో ఉంటాయి. ఆ ఖాళీని పూరించడమే, ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం.

మన దేశంలో కూడా, Boot Camps, Incubator Challenges, Startup Saturdays వంటివి విరివిగా జరుగుతున్నాయి, మరి Ignite ప్రత్యేకత ఏంటి?

మొదటిది  - Brand Value: Stanford Stamp on our career graph
రెండవది    - Chance to interact with world renowned professors
మూడవది - మిగతావాటిలా కాకుండా, focused on end-to-end. మనం ఒక raw ideaని తీసుకుని, minimum viable product గా commercialize చేసి, Investors కి present చేయడం and we get lot of nurturning from professors before reaching the final step

పైవన్నీ ఒకెత్తు, ఈ కార్యక్రమం బెంగళూరులో జరగడం మరొకెత్తు. ఇక్కడే ఉండి, మనం నేర్చుకోగలగడం అనేది much more interesting!

Ignite గురించిన కొన్ని వివరాలు: మరిన్ని వివరాలు ఇక్కడ
- సంవత్సరానికి ఒకసారి, బెంగళూరులో, మార్చ్/ఏప్రిల్ నెలల్లో
- మూడు నెలల కోర్సు
- వారాంతాల్లో [శుక్ర, శని, ఆదివారాలు]
- అడ్మిషన్స్ : సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో [ముందు సంవత్సరం]
- కొంతమంది లెక్చరర్లు, బెంగళూరుకి వస్తారు, మరికొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
- ఫీజ్: 8450 USD

అన్నీ బానే ఉన్నాయి కానీ, మరీ ఖర్చెక్కువేమో అనిపిస్తోంది కదా! దాదాపు అందరికీ కొంత partial scholarship [25%] దొరుకుతుంది. మనం వ్రాసిన essays ని బట్టి, మన background ని బట్టి, మరింత ఎక్కువ scholarship లభించే అవకాశం ఉంది.

నా అడ్మిషన్ లెటర్ వచ్చినప్పుడు, చాలా సార్లు ఆలోచించాను. ఇప్పుడు అవసరమా, దీని తరువాత ఏం సాధిస్తాను, నేను సొంతంగా కంపెనీ పెట్టేస్తానా ఇలా ఎన్నో ఆలోచనలు. 

దాదాపు ఒక నెల, క్లాసులు వెళ్ళిన తరువాత, I can confidently say, it is worth each penny. I may not start something on my own right immediately. But the lessons I learnt will be always with me, be it in designing my next project, product management, for that matter in shaping my life better. All in all I can say, a transformational experience!


0 comments: