Saturday, June 21, 2008

కొరియా కబుర్లు - 5

అర్ధరాత్రి 12కి, స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళగలిగితే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీగారనేవారట!.. భారతదేశం గురించి ఇప్పుడు ఎందుకులెండి కానీ, కొరియా వాళ్ళకి మాత్రం ఆ స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చినట్లుంది... నేను రోజూ అంతకంటే లేట్ అయినా కూడా ఒక్కదాన్నే వెళుతూ ఉన్నాను..!!

ఏంటో ఇక్కడకి వచ్చినప్పటినుండీ, క్యాలెండర్ లో తేదీ మారితే తప్ప ఆఫీసు నుండి బయటపడడానికి కుదరడం లేదు... అప్పటివరకూ ఎన్ని చిరాకులు, పరాకులు ఉన్నా బయటకి రాగానే ఆ నిశ్శబ్దాన్ని చూసి అన్నీ మర్చిపోతాను. ముందు బయటకి రాగానే చంద్రుడు హాయిగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు.. అలా చంద్రుడిని చూస్తూ మెట్లు దిగుతూ ఉంటే, పిల్లగాలి నేను కూడా ఉన్నానంటూ వచ్చి పలకరిస్తుంది... అలా నడుస్తుంటే, నిజంగానే గాల్లో తేలినట్లుందే అనిపిస్తూ ఉంటుంది!!.. అలా వెన్నెల్లో నడుస్తూ ఉంటే, చిన్నప్పుడు తమ్ముడితో చూడు చంద్రుడు నేను ఎటు వెళితే అటు వస్తున్నాడు, నావైపే వస్తున్నాడు, నీ వైపు రాడు అని దెబ్బలాడిన సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి....

అలా వెన్నెల్లో నడుస్తూ, వెన్నెల మీద, చీకటి మీద, ఏకాంతం మీద, తారల మీద గుర్తొచ్చిన పాటలు పాడుకుంటూ, ఊహల్లో ఊగుతుండగా, మెయిన్ గేట్ వచ్చేస్తుంది... అప్పుడు మాత్రం భలే చిరాకు వస్తుంది.. అక్కడ మళ్ళీ స్వైప్ చేయాలి, బ్యాగ్ స్కానర్ లో పెట్టాలి... అలా ఆలోచనలకి బ్రేక్ పడుతుంది... మళ్ళీ రోడ్ దాటగానే ఆలోచనలు మొదలు... చెప్పాను కదా వెళ్ళేదారంతా పార్క్ లే అని.. ఇప్పుడు పూల మీద ప్రత్యేకించి గులాబీల మీద పాటలు పాడుకుంటూ వస్తుంటే రూమ్ వచ్చేస్తుంది....

hmm.. వచ్చేశామా అని నీరసపడుతూ వెళ్ళి పడుకోవడమే.... మొదట్లో ఇలా లేట్ అవుతున్నందుకు బాగా బాధ పడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు అలా లేదు.. బాధ లేదు అని కాదు కానీ అలా ఆ టైమ్ లో ఒక్కదాన్ని అలా నడుస్తూ రావడం వల్ల అప్పటివరకూ ఉన్న చిరాకులన్నీ పోతున్నాయి!.. మనస్సుకి చాలా హాయిగా ఉంటుంది..

సరే ఇక కబుర్ల విషయానికి వస్తే పోయిన వారం ఇక్కడ ఒక లేక్ కి వెళ్ళాము... అసలు సాయంత్రం వరకూ ఏమీ అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వెళ్ళాము... మాకు లేక్ లాంటిది ఒకటి ఉంది అని తెలుసు కానీ, దాని కధా కమామిషు ఏంటో తెలియదు.. సరే Let's explore అనుకుని బయలుదేరాము... కొంచెం దూరం నడవగానే ఒక బస్ స్టాప్ వచ్చింది.. అక్కడ ఇద్దరు కొరియన్స్ ఉంటే, వాళ్ళని అడుగుదామని వెళ్ళాము.. మొదట వాళ్ళకి ఏమీ అర్ధం కాలేదు.. మేము కాసేపు వాటర్ అదీ ఇదీ అని కష్టపడుతూ ఉండగా, వాళ్ళలో ఒకతను సడెన్ గా LAKE ఆ అన్నాడు. హమ్మయ్య స్పెల్లింగ్ సరిగ్గా చెప్పి L.K.G లో సీట్ సంపాదించేశాడు అని హా అదే కన్నా, అది ఎక్కడుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకో బాబూ అనగానే, నేరుగా వెళ్ళండి, ప్రక్కకి చూడద్దు... రోడ్ చివర మీకు కనిపిస్తుంది చెరువు అన్నాడు...! పది నిమిషాల్లో అక్కడ ఉంటారు, టాక్సీ దండగ డబ్బులు ఎక్కువవుతాయి అని నీతిబోధ కూడా చేశాడు.. సర్లే పాపం మన గురించి శ్రధ్ధ తీసుకుని మరీ చెప్పాడు కదా, అదీ కాక ఆ రోజు బత్తీ బంద్ కూడాను... ఇలా కార్ ఎక్కకుండా కాసింత వేడిదనం తగ్గిద్దామని నడక ప్రారంభించాము.. ఆ రోజు వాతావరణం కూడా చాలా బావుంది, సో ఇక మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నాం... అతను చెప్పిన పది నిమిషాలయిపోయాయి, చెరువు కనుచూపు మేరలో కనిపించడం లేదు... అతనికి మేము చెప్పింది అర్ధమయ్యిందా లేదా అని అనుకుంటూ ఉండగా అల్లంత దూరాన లీలగా ఒక చెరువులాంటిది కనిపించింది.. ఓహ్.. వచ్చేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళాం... తీరా చూస్తే అది డ్రైనేజ్ వాటర్!!!! అప్పుడు చూడాలి మా మొహాలు.. ఆహా, దీనికోసమా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము అని అనుకుని సర్లే ఇంకా కొంచెం ముందుకి వెళదాము అసలుది తగలకపోతుందా అని వెళ్తూ ఉన్నాం.. దగ్గర దగ్గర 3కిలోమీటర్స్ వెళ్ళాము... ఇక సువాన్ ఎండ్ వచ్చేస్తుందేమో, అనుకుంటూ వెళుతుండగా, ఒక ఆపద్బాంధవుడు కనిపించాడు.. అతనికి మళ్ళీ సైగలతో, చేతలతో ఏదేదో చెప్పాము.. అతనికి ఏమి అర్ధమయ్యిందో తెలియదు కానీ, అటు వైపు వెళ్ళండి వస్తుంది అన్నాడు, ఎందుకైనా మంచిది ఎంత దూరం ఉంటుంది అని అడిగితే, 1000km అన్నాడు!!!!!... అమ్మ బాబోయి ఇదేంటి ఇప్పుడు జపాన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలా అనుకుంటూ ఉండగా, ఇంకొకతను వచ్చి లేదు ఆ ప్రక్కనే ఉంది, చాలా దగ్గర అని చెప్పి బ్రతికించాడు.. హు.. అలా మొత్తానికి దగ్గర దగ్గర ఒక 5km ప్రయాణించి చివరికి చెరువు ని చేరుకున్నాం.... అక్కడకి చేరగానే మాత్రం చాలా హాయిగా అనిపించింది.. బోటింగ్ కి వెళ్ళాము.. Its a gud Experience....

లేక్ ఫొటోస్...ఇక ఇక్కడ పని విషయానికి వస్తే, కొరియన్స్ పని చేసే విధానం గురించి జోక్ లాంటి సీరియస్ విషయం ఒకటుంది... మనం ఎంత రాత్రి దాకా ఉండి పని చేసినా, వెళ్ళేటప్పుడు మొదట మనమే Gud Night చెప్పి వెళ్ళిపోతాము.. ప్రొద్దున్న ఎంత తొందరగా వచ్చినా అతను ఎదురొచ్చి Gud Morning చెబుతాడు..!!! అలా పని చేస్తారు వీళ్ళు... నేను కూడా నెమ్మది నెమ్మదిగా వీళ్ళ పనికి అలవాటు పడుతున్నట్లున్నాను.. మొన్న అంత పని లేదని 11:30pm కల్లా వెళ్ళిపోయాను.. కానీ రూమ్ కి వెళ్ళిన దగ్గరనుండి ఏంటో 7 కల్లా వచ్చేసిన ఫీలింగ్!, నిద్ర పట్టేసరికి కూడా చాలా లేట్ అయింది!!!


పైన కొరియాని ఎంత పొగిడినా, ఇక్కడ వాతావరణం ఎంత నచ్చినా నా మనసు మాత్రం జై భారత్ అనే అంటోంది!!!

సో ఫ్రెండ్స్ అదీ సంగతి... మరొక్కసారి జైజైజైజై భారత్!!!

10 comments:

విహారి(KBL) said...

కొరియాలో కష్టపడుతూ ఆనందిస్తున్నరన్నామాట

Chandu said...

మీ కొరియ విషయాలు బాగున్నాయై!

కత్తి మహేష్ కుమార్ said...

అంత కష్టంలోనూ ఈ సారి "జై" లు మర్చిపోలేదన్నమాట. లేక్ ఫోటొలు బాగున్నాయ్. మొత్తానికి కొరియాకి నిజమైన స్వతంత్ర్యం వచ్చేసిందంటారు!

ప్రవీణ్ గార్లపాటి said...

అయ్యో రాత్రింబవళ్ళూ పని చేస్తున్నారా‌?
పోనీలెండి అయినా సరే ప్రదేశాలు చూస్తున్నారుగా. మంచిది.

అబ్రకదబ్ర said...

మీ కొరియా అనుభవాలు చాలా వివరంగా రాస్తున్నారు. ఉ. కొరియా కూడా చూసే ఆలోచనలేమన్నా ఉన్నాయా? ఉ. మరియు ద. కొరియన్ల మధ్య మన భారత-పాకిస్తానీ ల లాంటి సంబంధం కదా. ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటారో మీకేమన్నా ఐడియా ఉంటే తరువాతి టపాలో రాయగలరు.

అన్నట్లు, కొరియా ట్రావెలాగులో దేశభక్తి మసాలా ఎందుకండీ? :-)

మేధ said...

@విహారి గారు: ఒక రకంగా అంతేనండీ... :)
@చందు గారు: మీకు టపా నచ్చినందుకు నెనర్లు...
@మహేష్ గారు: కష్టకాలంలోనే కదండీ అలాంటివి ఇంకా గుర్తొచ్చేది! ఫొటోలు నచ్చినందుకు నెనర్లు.. అవును కొరియాకి స్వాతంత్ర్యం వచ్చేసింది!!!

@ప్రవీణ్ గారు:అవునండీ, మనం పని చేయకపోయినా మెడలు వంచి మరీ పని చేయిస్తున్నారు.. :( ఇక ప్రదేశాలంటారా, రూమ్ లో చేసేది ఏమీ లేకపోవడంతో వెళ్తున్నాం... ఇక అది కూడా లేకపోతే ఇక్కడ ఉండడం చాలా కష్టం(నాలాంటి వాళ్ళకి!)

@అబ్రకదబ్ర గారు: మీకు టపా నచ్చినందుకు నెనర్లు...
ఉత్తరకొరియా చూసే ఆలోచనలు అయితే ఏమీ లేవు.. కాకపోతే, ఇక్కడ మన వాఘా సరిహద్దు లాగా, వార్ మెమోరియల్ ఉంది.. కుదిరితే దానికి వెళ్ళాలి...
ఇక వీళ్ళ మధ్య సంబంధాల గురించి అంటారా, నాకు చాలా కొద్దిగా తెలుసు.. వివరంగా తెలుసుకుని వ్రాస్తాను...

ఇది ఒక్క ట్రావెలాగే కాదు... నాకు కలిగిన అనుభవాలన్నీ వ్రాస్తున్నాను.. అలానే దేశభక్తి కూడా.. అంతే కానీ అదేదో మసాలా లాగ యాడ్ చేయలేదు! నిజంగానే నాకు ఇక్కడకి వచ్చిన తరువాత ఎప్పుడెప్పుడు ఇంటికి(ఇండియా కి) వెళ్ళిపోదామా అని ఉంది.. అందుకే ప్రతి టపాలో అది ఉంటుంది..

వేణూ శ్రీకాంత్ said...

ఋతురాగాల పై మీ వ్యాఖ్యకి నెనర్లు మేధ గారు, లేదంటే మీ కొరియా కబుర్లు మిస్ అయి ఉండే వాడ్ని, కబుర్లు ఫోటో లు బావున్నాయి. ఇంకా మీరు అక్టోబరు లో వ్రాసిన రాజు పేద నాటకం గురించి కూడా ఇప్పుడే చదివి చాలా నవ్వుకున్నాను. నేను చాలా ఆలస్యం గా బ్లాగ్లోకం లోకి వచ్చానేమో ఖజానాలలో ఉన్న టపాలు చదవడానికే టైము సరిపోడం లేదు :-)

మేధ said...

@వేణూ శ్రీకాంత్ గారు: ముందుగా బ్లాగ్లోకానికి స్వాగతం.. నా టపాలు నచ్చినందుకు నెనర్లు.. :) Lateగా వస్తే ఏమి Latestగా వచ్చారు కదా..!

రవి said...

కొరియాలో అలా నడుచుకుంటూ వెళ్లడం ఓ అందమైన అనుభవం. మేమక్కడ ఉన్నప్పుడు (డోక్సన్ అనే చోట) మా అపార్ట్మెంట్ పక్క ఓ చిన్న నది (కాలువ అనుకోండి). దాని పక్క ఓ దారి, దారి వెంట పూల తోటలు. పొద్దున అలా నడిచి వెళుతుంటే స్వర్గం కనిపించేది. ఐతే ఎందుకో ఎమో తెలీదు, అక్కడ ఉన్నన్నాళ్ళు మన దేశమే గుర్తొచ్చేది.

ఈ కొరియా (ఉత్తర దక్షిణాలు) ఎందుకిలా తగలడ్డారు అన్న దానికి కారణం వాళ్ళ ఐడియల్స్. వాటికి ఆద్యుడు కంఫ్యూషియస్ అనే ఓ మహానుభావుడు (మన మనువు కి కవుంటరుపార్టు). నాకు ఆయన మీద బ్లాగాలని ఎప్పటి నుండో ఓ ఆలోచన.

మేధ said...

@రవి గారు: నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను... నిజంగా నడిచి వెళుతూ ఉంటే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది...! But still mera bharath mahan!!
అయితే మీరు మొదట వ్రాయండి ఆ మహానుభావుడి గురించి.. నాకు ఇంకా సమయం పట్టచ్చు...