Sunday, June 29, 2008

మిస్టీరియస్ నవ్వు వెనక ఉన్న మిస్టరీ…

రావుగోపాల్ రావుది ఒక రకమైన నవ్వు.. ప్రకాష్ రాజ్ ది ప్రత్యేకమైన నవ్వు... రఘువరన్ ది మరొక రకమైన నవ్వు.. నాగభూషణానిది నాగుపాము లాంటి నవ్వు.. యస్వీ రంగారావుది అరివీర భయంకరమైన నవ్వు.. కైకాల సత్యన్నారయణది కర్కోటకపు నవ్వు...

ఈ రకరకాల నవ్వుల కంటే విభిన్నమైన, విలక్షణమైన, విచిత్రమైన, విభ్రాంతికరమైన (ఈ విశేషణాలు చాలా చాలా తక్కువ!) నవ్వు మా TLది...


అది ఏప్రిల్, 2007… xxx కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతోంది. ఎదురుగ్గా ఉన్న అర్భకురాలిని (ఎవరో కాదు నేనే!) ఇంటర్వ్యూయర్స్ ఇద్దరూ వాయించేస్తున్నారు, తమ ప్రశ్నలతో. ఆ ఇద్దరిలో ఒకతను క్యాజువల్ గా ఉంటే, ఇంకొకతను మాత్రం తెగ సీరియస్ గా ఫోజ్ పెట్టి కూర్చున్నాడు!. అతనికి ఇది మొదటి ఇంటర్వ్యూ ఏమో లో పాపం పిల్లవాడు భయపడుతున్నట్లున్నాడు, అనుకున్నా!!

ఎలాగైతేనేమి, ఇంటర్వ్యూ అయిపొయింది.. నేను సెలెక్ట్ అని చెప్పారు. ఆ విషయం ఈ రెండో అతను వచ్చి చెప్పాడు. థ్యాంక్స్ అని పలకరింపుగా నవ్వా.. అప్పుడు కూడా నవ్వలేదు అతను. అయినా ఇతనితో నాకెందుకు, రేపు ఇక్కడ జాయిన్ అయినా ఇతనేమీ కనిపించడు కదా అని లైట్ తీసుకున్నా..


ఇక్కడ సీన్ కట్ చేస్తే, జూన్, 2007.. ఆ రోజే కంపెనీలో జాయినింగ్…ఎవరబ్బా లీడ్ అనుకుంటుండగా, నన్ను ఇంటర్వ్యూ చేసినతనే కనబడ్డారు.. అప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ ని నేనే లీడ్ చేస్తున్నాను అని!.. సరే, ఇక చేసేది ఏముంది అనుకుంటూ, మనస్సు ఎందుకో కీడు శంకిస్తుండగా, లోపలికి అడుగుపెట్టాను. నేను ఏదైతే కాకూడదు భగవంతుడా అని అనుకుంటున్నానో, అదే జరిగింది. మనHR (హిమ్మేష్ రేషమ్యా) అక్కడ TL!!!. అయిపోయానురా బాబోయి అనుకుని చేసేది ఏమీ లేక, ఒక వెర్రి నవ్వు నవ్వాను. దానికి కూడా అతను నవ్వలేదు. సర్లే, ఇప్పుడు ఇతను నవ్వకపోతే, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని వదిలేశాను.

ఆ మరుసటి రోజు టీమ్ మీటింగ్. మా ప్రాజెక్ట్లో ఒక కీలకమైన పనిని నాకు అప్పగించారు. అప్పటివరకూ వీరుడైన మా TL గారు దాన్ని పర్యవేక్షించేవారట! సరే అప్పటినుండి, దాని బరువు-బాధ్యతలని (బరువు – కోడింగ్, బాధ్యత – టెస్టింగ్) ధీరురాలైన నాకు అప్పగించారు. ఆ అప్పగింతల కార్యక్రమంలో కూడా, కనీసం చిరునవ్వు చిందించలేదు. ఇదేంట్రా బాబూ, ఈ ముని పుంగవుడు ఈ ఇండస్ట్రీలో ఎలా పని చేస్తున్నాడా అని తెగ ఆశ్చర్యపోయాను (అంటే ఇక్కడ, అవసరమైన దానికి కాని దానికి కూడా తెగ నవ్వుతుంటారు కదా!)

ఆ తరువాత రోజు, పని మొదలయింది. మధ్యలో ఏదో డౌట్ వచ్చింది. అది అడగడానికి, PL దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో, నాకు సరిగ్గా తెలియదు… xxx(TL) ని అడుగు అన్నారు. అబ్బా ఇప్పుడు వెళ్ళి తనని అడగాలా అనుకుంటూ వెళ్ళాను. ఏదో సీరియస్ గా లాప్ టాప్ లో కి తల దూర్చేసి పని చేసుకుంటున్నాడు. ఏంటా అని చూస్తే, orkut లో scrap లు ఇస్తున్నాడు. ఛా దీనికి ఇంత బిల్డప్పా అనుకుంటూ, నాకు వచ్చిన డౌట్ గురించి చెప్పాను. అది వినగానే, ఒక చిరు దరహాసం పెదవుల మీద అలా వచ్చి ఇలా మాయమైంది. ఆహా నా జన్మ ధన్యమైంది అనుకున్నా! అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ (ఈ కంపెనీ) వాతావరణానికి అలవాటు పడిపోయాను. మా HR కి అలవాటు పడిపోయాను. కాకపోతే, ఒక విషయం గమనించాను. HR ని ఎవరైనా ఏమైనా డౌట్ అడిగితే, ముందు నవ్వి తరువాత సమాధానమిస్తాడు.. ఆ నవ్వు మిస్టరీ ఏంటా అని అర్ధం కాలేదు. ఇంకొన్ని రోజులు గమనిద్దాం అని డిసైడ్ అయ్యాను.

చివరికి నాకు ఆ నవ్వు వెనకనున్న చిదంబర రహస్యం ఏంటో అర్ధమయింది.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఎవరు ఏది అడిగినా, మీకు ఇది కూడా తెలియదా, అది తెలియకపోతే ఎందుకు మీరు దండగ అనే వెక్కిరింత టైప్ నవ్వు!!! అదేదో సినిమాలో అన్నట్లు, ఆ ఒక్క నవ్వులో కనీసం లక్ష బూతులు వెతుక్కోవచ్చు.. కానీ నా అబ్జర్వేషన్ కరెక్టో, తప్పో తెలియలేదు అందుకని మిగతా టీమ్ మెంబెర్స్ ని అడిగాను. అందరూ ముక్త కంఠంతో ఇదే సమాధానమిచ్చారు.


హన్నన్నా… నీ నవ్వు వెనక పరమార్ధం ఇదా అని ముక్కు మీద వేలేసుకున్నాను. సరే, అయితే ఇక నుండి మనల్ని చూసి నవ్వే చాన్స్ ఇవ్వకూడదు అని గట్టిగా తీర్మానించుకున్నాను. కానీ అతను TL అవడం వల్ల, దాదాపు ప్రతి విషయానికి అతని దగ్గరికే వెళ్ళాల్సి రావడం, అతను నవ్వడం… ఇలా రోజులు భారంగా బాధతో నడుస్తూ ఉన్నాయి. మనస్సు రాయి చేసుకుని అలా అలా ఉన్నాను.

ఇంతలో మా ప్రాజెక్ట్ గురించి మా డివిజన్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది...అప్పుడు PL లీవ్ లో ఉండడంతో, TL ఉరఫ్ HR గారు ఇవ్వాల్సి వచ్చింది... మొత్తానికి తన తెలివితేటలన్నీ బానే ప్రదర్శించారు... ఇక ఆఖరి అంకానికి వచ్చింది.. ప్రశ్నలు-జవాబులు!.. మేమందరేమో ఆ బకరా ఎవరా అని యాంక్సైటీ తో ఎదురుచూస్తూ ఉన్నాం.. ఇంతలో మా PM గొంతు సవరించుకుని ఏదో అడిగారు.. అసలే ఆయనకి టెక్నికల్ గా ఏమీ తెలియదు.. అలాంటి ప్రశ్నలు అడిగితే నేనే నవ్వుతాను, అలాంటిది మా HR ఊరుకుంటారా...! నవ్వాడు నవ్వాడు చాలాసేపు నవ్వి చివరికి ఆన్సర్ చెప్పాడు... పాపం మా పిచ్చి PM కి ఏమీ అర్ధం కాలేదు, ఎందుకలా నవ్వాడో! ఊరికే నవ్వాడేమో అనుకున్నాడు.. ఆయనకి ఏమి తెలుసు దీని వెనక ఉన్న పరమార్ధం...

ఇలా పెద్ద, చిన్న అని తేడా లేకుండా, అందరూ తన నవ్వుకి బలి అవుతున్న తరుణంలో మా మొహల మీదకి నవ్వొచ్చే వార్త ఒకటి తెలిసింది... HR మూడు నెలలపాటు జపాన్ కి వెళుతున్నారు అని.. మేమందరమూ హమ్మయ్య అని తెగ ఆనందపడిపోయాము...


కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు, తను జపాన్ కి వెళ్ళినా ఇండియాలో ఉన్న మాకు ఆ నవ్వు తగులుతూ ఉండేది ఛాట్ రూపంలో!!.. సర్లే ఎదురుగ్గాలేడు కదా అని సరిపెట్టుకున్నాం... కానీ ఇంతలో ఇంకో పిడుగులాంటి వార్త తెలిసింది.. మూడు రోజుల్లో మేమందరమూ కొరియా కి వెళుతున్నామని, అంతే కాక HR అక్కడ ఉండి మా అందరినీ రిసీవ్ చేసుకుంటాడు అని.. అలా అప్పటినుండి మా మొహల్లో నవ్వు లేకుండాపోయింది...

hmm... మళ్ళీ మొదలు... కొరియాలో ఆఫీసుకి రాగానే ఎదురొచ్చి ఒక నవ్వు మా మొహాన పారేశాడు.. మా అందరికీ అయితే, మీరు కూడా onsiteకి వచ్చే మొహాలేనా అని చూసినట్లు అనిపించింది.. అయినా ఇక్కడ ఒకడి భాష ఇంకొకళ్ళకి అర్ధం కాదు..ఇక ఈ నవ్వు గోల ఎవరికి తెలుస్తుంది....?!

ఇలా మా జీవితాలు మూడు నవ్వులు, ఆరు వెక్కిరింతలతో సాగిపోతుండగా, ఈ మధ్యే విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక సమాచారం తెలిసింది... అదేంటి అంటే, HR కున్న తెలివితేటలు, తను చేసిన సేవల కారణంగా తనని ఈ చిన్న వయసులోనే PLగా ప్రమోట్ చేస్తున్నారనీ మా ప్రాజెక్ట్ ఇక తనే హ్యాండిల్ చేయబోతున్నాడనీ!!!!!

16 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మీ TL లాంటి నవ్వుతో...బాగుంది.

చైతన్య said...

మొత్తానికి మాంచి TL దొరికాడు మీకు. నిజమే మీరు అన్నట్టు కొంతమంది నవ్వితే లక్ష బూతులు వెతుకొవచ్చు.

బొల్లోజు బాబా said...

పెద్ద పోష్టు. అయినా చదివించింది మీ కధనం
సాహితీ యానం

Purnima said...

ఐ.టిలో బిక్కు బిక్కుమంటూ దిక్కు తోచక తిరిగే నాకు.. మీరే "దారి చూపు దేవత" వలె కనిపిస్తున్నావు. నా "గాడ్ మదర్" పోస్ట్ కి ఇక మిమల్నే అప్పాంయిట్ చెద్దామని డిసైడ్ అయ్యిపోయాను.

హెచ్. ఆర్ వరకూ ఎందుకు గాని నాకు.. అసలు ఆఫీసు బాయ్ ఎందుకు నవ్వుతాడు అర్ధమై చావదు నాకు. నేనికి కొరియా రావలసిందే!! ;-)

ప్రవీణ్ గార్లపాటి said...

భలే TL దొరికాడే మీకు!
తొందర్లోనే మీరు TL అయి వికటాట్టహాసం చేస్తారని ఆశిస్తున్నాను. :-)

వేణూ శ్రీకాంత్ said...

హ హ నవ్వుల గురించి భలే రాసారండి ఇక్కడ అవసరమున్నా లేకపోయినా నవ్వుతారంటూ.. ఈ సారి నుండీ మీరూ ఓ నవ్వు నవ్వేయండి తను అర్ధం కాక మానేస్తాడేమో.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నేనొక తెలుగుమీడియంగాడిని పైగా చదువుకుంది,ఎందుకొచ్చిన ఆర్ట్సు గ్రూపులని గతంలొ చంద్రబాబు అన్నాడే ఆ కోర్సు..ఇక్కడ TL అంటే టీం లీడరని,
pl అంటే ప్రాజక్టు లీడరని,
hr అంటే హ్యూమన్ రీసొర్స్ అనుకుంటున్నాను నిజమేనా?కాకపోతే సరిదిద్దండి,

చదువరి said...

బాగా రాసారు. మొదటి పేరాలో అందరి నవ్వులను స్మరించుకున్నారుగానీ, వాళ్ళ నవ్వులకు బాబులాంటి నవ్వు నవ్వే మరో మహన్నబావుణ్ణి విస్మరించారు. :)

కొత్త పాళీ said...

"ఆ ఒక్క నవ్వులో కనీసం లక్ష బూతులు వెతుక్కోవచ్చు.. "
sebash!

మేధ said...

@మహేష్ గారు: ఇక్కడ ఒక్కళ్ళ నవ్వునే భరించలేకపోతున్నాం! మళ్ళీ మీరు కూడానా!!

@చైతన్య గారు: ఏమి చేస్తాం చెప్పండి.. ఇలాంటి కష్టాలు అన్నీ మనలాంటి మంచివాళ్ళకే వస్తుంటాయి!

@బాబా గారు: ఇప్పటివరకు మీరు నా బ్లాగ్ లో కామెంటలేదు.. ఇప్పటికి వీలు చూసుకుని కామెంటినందుకు, టపా నచ్చినందుకు నెనర్లు..

@పూర్ణిమ గారు: అలాగంటారా.. సరే అయితే మీరు అంత పెద్ద పోస్ట్ ఇస్తానంటే కాదనడమెందుకు!!.. సరే అయితే వెంటనే కొరియాకి వచ్చెయండి.. :)
ఒక చిన్న సవరణ.. ఈ టపా లో HR అంటే హిమ్మేష్ రేషమ్యా!.. మొదట్లో నవ్వలేదని ఆ నిక్ నేమ్ పెట్టం మా TLకి!

@ప్రవీణ్ గారు: ఏంటండీ నేనంటే ఎందుకు మీకంత కక్ష!! నా టీమ్ మెంబర్స్ అందరూ నా గురించి వాళ్ళ బ్లాగుల్లో ఇంతకంటే దారుణంగా కామెంటాలనా?! Just Kidding.. :)

@వేణు శ్రీకాంత్ గారు: అది కూడా అయిపోయిందండీ.. చెప్పాను కదా మొదట్లో అస్సలు నవ్వలేదు.. కానీ తరువాత తరువాత ఇలాంటి నవ్వులతో మమ్మల్ని ఆడేసుకుంటున్నాడు... నేను అంతకంటే విలనీ నవ్వు నవ్వుదామన్నా, తను దాన్ని మించిపోతున్నాడు..! ఏమి చేస్తాం అంతే...

@రాజేంద్ర గారు: మీరు చెప్పినవన్నీ కరెక్టే... కాకపోతే ఈ టపాలో HRమాత్రం వేరే అర్ధం... HR -హిమ్మేష్ రేషమ్యా! అది మొదట్లో మా TLకి పెట్టిన నిక్ నేమ్...

@చదువరి గారు: నెనర్లు... ఎవరు మన యై.యస్సార్ గారా....?!

@కొత్తపాళీ గారు: ఇంతకీ ఎవరు శెభాష్..?! మా TL లేక ఆ నవ్వులు భరించుతున్న మేమా...?!

సుజాత said...

బాగుంది మేథా, నవ్వుల ప్రహసనం! లక్ష బూతులు...టాప్!

Vamsi Krishna said...

medhagaaru,
eduti vaaru navvuni artham chesukovalani try cheyyadam saahasamee avuthundi sumaa!!!

ednukante naa smilenu kooda choosi naa friends 'ఆ ఒక్క నవ్వులో కనీసం లక్ష బూతులు వెతుక్కోవచ్చు..' ani antoo vuntaaru..
ala anukovademee kaakundaa aa laksha boothuluni kooda vethakadaaniki try chesthaaru...
akkade problem anthaa!!!

basically mana mind kaastha corrupted andi..edo manchigaa navvinaa kooda edo paadu vuddesyamtho navvaadu anukune janaalandi...

-- Vamsi

శ్రీ said...

బాగుందండీ మీ TL నవ్వులు!తొందరగా మీరు "రివర్స్" నవ్వు ఇవ్వండి.

మేధ said...

@సుజాత గారు: నెనర్లు.. :)

@వంశీ కృష్ణ గారు: కొంపతీసి మీరు కూడా ఏమైనా TL/PL..? ఒకవేళ కాకపోతే, లైట్ తీసుకోండి... మీ నవ్వు గురించి నాకు తెలియదు కానీ, మా TLమాత్రం ఖచ్చితంగా ఇదే అర్ధంలో నవ్వుతారు!

@శ్రీ గారు: చెప్పాను కదండీ మనం ఎంత నవ్వినా, డామినేట్ చేసే నవ్వు ఆయనది.. ఇక ఈ ప్రాజెక్ట్ కి ఇంతే!

Vamsi Krishna said...

Nenu Tl/Pl kaadu kaani, for a change maa mundu TL (ippati TL manchi vaade lendi:)... so vaadiki no smiles...) and PM ki nenee smile isthaanu...

-- Vamsi

మేధ said...

@వంశీ కృష్ణ గారు: :) అయితే మీ PM కూడా మీ గురించి ఇలానే అనుకుంటున్నారేమో...!