ప్రవీణ్ గారి టపా చదివిన తరువాత, నాకు తెలిసిన మరికొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ఈ టపా మొదలుపెట్టాను...
పదేళ్ళ క్రితం సెల్ల్ అంటే జనాలకి గుండె గుభిల్లుమనేది.. మనం చేసినా డబ్బులు కట్టాలి, అవతలి వాళ్ళు చేసినా మనమే కట్టాలి.. అలాంటిది ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నవాళ్ళతో కూడా చాలా చౌకగా మాట్లాడచ్చు...!
ఒక్క మాట్లాడడంతోనే సెల్ల్ ఆగిపోతే, ఇప్పుడు దీని గురించి ఇంత చర్చ అనవసరం! మారుతున్న కాలానికి తగినట్లుగా, ఎన్నో అదనపు హంగులు వచ్చి చేరుతున్నాయి. మొబైల్ మన చేతిలో ఉంటే, కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, పుస్తకం, మ్యాప్స్, టి.వి.. ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అన్నీ దాంట్లోనే లభిస్తున్నాయి.. రాన్రాను కంప్యూటర్ ని మించిపోతున్నాయి.. ఇప్పుడు వచ్చే క్రొత్త ఫోన్స్‌లో, 256MB RAM ఉంటోంది (మొన్న మొన్నటి వరకూ కూడా, మన కంప్యూటర్ RAM - 128MB!)
ఇప్పుడు మార్కెట్లో లభించే వాటిల్లో రకరకాల ఫోన్స్ ఉన్నాయి.. కొన్ని స్టైలిష్ గా ఉంటే, కొన్నిటిలో UI(User Interface) - Look n Feel మరికొన్నిటిలో, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్.. ఈ ఫీచర్స్ అన్నీ, వాటిని విడుదల చేసే మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి...
మన ఇండియా మార్కెట్ నే తీసుకుంటే రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి - క్రింద పడ్డా పాడవకపోవడం, బ్యాటరీ ఎక్కువ కాలం రావడం.. అలానే జపాన్/కొరియా మార్కెట్ లో తీసుకుంటే అక్కడ టెక్నాలజీకే పెద్ద పీట.. అమెరికా మార్కెట్ లో స్టైలిష్ నెస్ కి ప్రాముఖ్యత, ఇక యూరోప్ మార్కెట్ లో అయితే కొంచెం స్టైలిష్ నెస్ మరికొంచెం టెక్నాలజీ..
యూరోప్ లో చూస్తే GPS ని బాగా ఉపయోగిస్తారు.. మనం విజయవాడలో సాయంత్రం ట్రైన్ ఎక్కాం, బెంగళూరు కి వచ్చేసరికి ఏ తెల్లవారుఝామో అవుతుందనుకోండి, మామూలుగా అయితే ఆ టైం కి దగ్గర దగ్గర అలారం పెట్టుకుని లేచి ఉండడం - కానీ దీని వల్ల ఒక్కోసారి మన స్టాప్ మిస్స్ అవ్వచ్చు, లేదూ అంటే తొందరగా లేవాల్సి రావచ్చు.. ఇలా కాకుండా లొకేషన్ బేస్డ్ అలారం ఉంటే..? GPS తో అది కుదురుతుంది.. నేను వెళ్ళాల్సిన ప్రాంతానికి అలారం సెట్ చేస్తాను.. అది ఇంకొక 15నిమిషాల్లో(కావాలంటే ఈ టైమింగ్ ని మార్చుకోవచ్చు) వస్తుందనగా, అలారం మోగుతుంది..
జపాన్/కొరియా లో టెక్నాలజీ కి ఇంపార్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉండే కొన్ని ఫీచర్స్ ని చూస్తే, టెక్నాలజీ ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా అనిపిస్తుంది!. మనందరికీ మ్యాట్రిమోనియల్ సైట్స్ గురించి తెలుసు కదా.. అదే మొబైల్ ఫోన్స్ లో ఉంటే ఎలా ఉంటుంది..? మొదట నేను నా వివరాలన్నిటినీ, సర్వర్ (మొబైల్ కంపెనీ) లో లోడ్ చేసుకుంటాను, అలానే నాకు కావలసిన రిక్వైర్మెంట్స్ కూడా.. ఇప్పుడు నేను ఎక్కడన్నా వెళుతూ ఉంటే, నా requirements కి మ్యాచ్ అయ్యే వ్యక్తి ఒక 100/200మీ దూరంలో ఉంటే, My Mobile Starts Beeping..!!! ఒకవేళ ఆ అబ్బాయి కి కావలసిన లక్షణాలు నాలో ఉంటే, అతని మొబైల్ కూడా అరవడం మొదలు పెడుతుంది!! సో ఇక పరిచయ కార్యక్రమాలు, డేటింగ్, పెళ్ళి ఇవన్నీ షరా మామూలే... అక్కడ ఫోన్స్ లో ఉండే శతకోటి ఫీచర్స్‌లో ఇది ఒకటి మాత్రమే!
ఇక ఇండియా మార్కెట్ కే సొంతమైన అప్ప్లికేషన్స్ చూద్దాం.. ఇక్కడ రిలీజ్ చేసేవాటిల్లో పంచాంగం, God Pooja కే మొదటి వోటు...
పంచాంగం - ప్రతి రోజూ తిధి ఏంటి, వర్జ్యం ఎప్పుడు, రాహుకాలం ఎన్నింటికి..
God Pooja - మనకి ఇష్టమైన దేవుడికి, సెల్ల్ లో పూజ చేసెయ్యడమే! (కంప్యూటర్ లో ఈ అప్ప్లికేషన్ ని చూసే ఉంటారు.. అదే ఫీచర్ - మొబైల్ లో కూడా)
రకరకాల మార్కెట్లు, రకరకాల అప్ప్లికేషన్స్ ఉన్నట్లే మొబైల్ తయారీదారులు కూడా చాలా మందే ఉన్నారు... ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ప్రత్యేకత.. నోకియా ఫోన్స్ ని తీసుకుంటే లాంగ్ లివ్.. ఒక పది అంతస్తుల భవనం నుండి క్రింద పడేసినా ఏమీ అవదు! అలానే ఏ మాత్రం మొబైల్ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆపరేట్ చేయగల అవకాశం.. ఇక సోనీ-ఎరిక్సన్ విషయానికి వస్తే, కళ్ళు చెదిరే కలర్స్, చెవులు హోరెత్తించే మ్యూజిక్ దీని సొంతం.. మంచి Look and Feel ఉండాలి అంటే స్యాంసంగ్ వైపు చూడాల్సిందే.. చేతిలో ఉందా లేదా అనిపించే Ligh-Weight ఫోన్స్, వెంట్రుక కంటే కూడా సన్నగా అనిపించే స్లీక్ మోడల్స్‌లో దీనిదే గుత్తాధిపత్యం.. ఇక పైన చెప్పిన వాటన్నిటిలో అన్నీ ఫీచర్స్ కొంచెం-కొంచెం గా కలబోసి ఉన్నది మోటోరోలా ఫోన్...
ఇక High-End ఫోన్స్ విషయానికి వస్తే, విండోస్ మొబైల్ ఫోన్స్, సింబాయాన్ ఆధారిత OS తో పనిచేసే సెల్లులు.. అయితే వీటన్నిటినీ రూల్డ్ ఔట్ చేసింది మాత్రం బ్లాక్ బెర్రీ.. అది చేతిలో ఉంటే ఆఫీసు లో ఉన్నట్లే!
ఎన్నిరకాల ఫీచర్స్ అందుబాటులో కి వచ్చినా, ఒక మూస పధ్ధతిలో ఇంకా చెప్పాలంటే బండ పధ్ధతిలో వెళుతున్న మార్కెట్ ని ఊపు ఊపిన ఫోన్ మాత్రం Apple i-Phone. ఫోన్ ని ఇలా కూడా ఉపయోగించచ్చు అని చెప్పిన ఘనత వాళ్ళదే. క్రియేటివిటీలో Apple ని మించిన వాళ్ళు లేరనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ చూస్తుంటే!!
Apple వాళ్ళు డెమో ఇచ్చిన తరువాత మిగితా అన్ని కంపెనీస్ తమ తమ బుఱ్ఱలకి పదును పెట్టాయి.. మ్యూజిక్ ప్లేయర్స్ విపణి ని రూల్ చేసినట్లు మొబైల్స్ లో కూడా ఇదే రూల్ చేస్తుందేమో అని భయపడ్డాయి.. మొత్తానికి మిగతావాళ్ళు కూడా దానికి ధీటుగా ఉండే మోడల్స్ ని తీసుకు వచ్చాయి.. కానీ ఎన్ని వచ్చినా i-Phone సొగసు దానిదే.. ఫీచర్స్ విషయంలో మిగతా వాళ్ళు ముందుండచ్చేమో కానీ Look and Feel విషయంలో మాత్రం దీనికి ఏదీ సాటి రాదు.. మనకి కూడా ఈ ఆగస్ట్1న వస్తోంది కదా, Happy i-Phoning!
ఇప్పుడు చెప్పుకున్న ఫోన్స్ అన్నీ ఒక ఎత్తు, గూగుల్ వాళ్ళ ఫోన్ మరొక ఎత్తు.. వాళ్ళకి అందుబాటులో ఉన్న టెక్నాలజీని చూస్తే, ఈ మార్కెట్లోకి లేట్ గా ఎంటర్ అయ్యారేమో అనిపిస్తుంది.. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు! మొదట అందరూ i-Phone లాగా g-Phone కూడా వస్తుందేమో అనుకున్నారు.. కానీ అలా అందరూ ఊహించింది చేస్తే అది గూగుల్ ఎలా అవుతుంది?!!.. మేము ఫోన్లని తయారు చేయము, కానీ దానికి అవసరమైన SDK ఇస్తాము అని చెప్పారు.. పైన చెప్పిన ఫీచర్స్ అన్నిటి కంటే, రెండు-మూడింతలు ఎక్కువ ఫీచర్స్ తో ముస్తాబవుతోంది ఆండ్రాయిడ్.. అది మార్కెట్లో కి వస్తే, ఎన్ని విప్లవాలకి నాంది అవుతుందో...!!!
మార్కెట్ లో కి వచ్చే క్రొత్త ట్రెండ్స్ ని తెలుసుకోవాలంటే, NDTV లో వచ్చే Gadjet-Guru అనే కార్యక్రమం చూడండి.. మొత్తం డీటయిల్స్ ఇస్తారు అని చెప్పను కానీ, ఒక రఫ్ అయిడియా వస్తుంది..
skip to main |
skip to sidebar
22 comments:
నాకు i-phone కొనాలన్న ఆశని కలిగించారు. మొత్తానికి బావుంది మీ వ్యాసం.
కాని ఆగష్టులో i-phone రిలీజ్ అవుతుందా? కొందరేమో సెప్టెంబర్ అని అంటున్నారు. మొత్తానికి అది ఎప్పుడు వచ్చినా కోనేసెయ్యడమే.
బావుంది. i-phone 3జీ వర్షన్ రిలీజ్ అయ్యింది. ఇది మన దేశానికి రాలేదు. 3 రోజుల్లో మిలియన్ ఫోన్లు అమ్ముడయాయని వార్త.
నా బ్లాగు లంకె మీద ఓ లుక్కెయ్యండి, ఓ సారి. (పాత టపా)
http://blaagadistaa.blogspot.com/2008/05/blog-post_29.html
quite informative and a quick recap of current mobile models...
Thanks,
Vamsi
goor post medha garu.
http://srushti-myownworld.blogspot.com
sry good post medha garu and one more thing nice name(ur).
హమ్మో ఇన్ని వివరాలే! మనకుమాత్రం మొబైల్ అంటే పట్టుకుని తిరగ్గల ‘ఫోన్’ అని మాత్రమే ప్రస్తుతానికి. మరికొంత కాలానికీనూ.
నేను గత 6 నెలలుగా i-phone వాడుతున్నాను.ఈ-మెయిల్స్,గూగుల్ మాప్స్,ఆపిల్ ఐ-ట్యూన్స్,ఇంటర్నెట్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్న ఈ ఫోను ఒక అద్భుతం!ఇపుడు కొత్తగా 3 జి టెక్నాలజీ తో ఇంకా వేగం పెరిగి ఉంటుంది.
Good Post Medhaa..
మంచి టపా మేధ గారూ.. టూ లేట్ (నాకు) గానీ డేటింగ్ ఫీచరేదో భలే ఉంది :)
Gadjet-Guru నేను రెగ్యులర్ గా చూస్తాను.. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది!
బాగుంది. బాగా రాసారు మొబైళ్ళ గురించి.
నాకో ప్రమోషనొస్తే భారతంలో ఐఫోను కొంటా :P (ముప్ఫై వేలు మరి)
@కల గారు: :) అయితే ఇంకెందుకు ఆలస్యం రెడీగా ఉండండి.. వాళ్ళు రిలీజ్ చేయగానే, మొదట మీరే తీసేసుకోండి..!
@రవి గారు: 3g వర్షన్ రిలీజ్ అయింది అని చదివాను.. జనాలు అంతే ఆవేశంతో కొనేశారట కదా...!
మీ టపా చదివాను. బావుంది... మంచి Info.. but అప్పుడు ఎలా మిస్స్ అయ్యనబ్బా...?!
@వంశీ కృష్ణ గారు: టపా నచ్చినందుకు నెనర్లు..
@క్రాంతి గారు: మీ కామెంట్ కి, కాంప్లిమెంట్ కి నెనర్లు..!
@మహేష్ గారు: ఎన్ని ఫీచర్లు వచ్చినా మాట్లాడడం అనే ఫెసిలిటీ లేకపోతే సెల్ల్ వంక ఎవరూ చూడరు కదా..!
@శ్రీ గారు: అయితే త్వరలో i-Phone ఫీచర్స్ మీద ఒక టపా వ్రాసెయ్యండి.. 3g Vesionలో స్పీడ్ బాగానే ఉంది అంటున్నారు.. కానీ పాత వర్షన్ కి, క్రొత్త వర్షన్ కి(speed లో కాదు) పెద్ద తేడా లేదుట, expect చేసిన ఫీచర్స్ అన్నీ అందుబాటులోకి రాలేదు అని అంటున్నారు..
@వేణూ శ్రీకాంత్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు... :)
@నిషిగంధ గారు: హ్హహ్హహ్హ.. నాకూ ఆ ఫీచర్ భలే నచ్చింది.. కానీ ఇండియాలో అందుబాటులోకి వస్తే ఇంకేమైనా ఉందా..! గజానికి 10 సార్లు చొప్పున బీప్ అవుతుంది..!!
@ప్రవీణ్ గారు: మొదట మీ టపాలో కామెంట్ వ్రాసి చేతులు దులుపుకుందాంలే అనుకున్నా, కానీ ఆ రోజు మీ బ్లాగ్ లో ఎందుకో కామెంట్స్ రాలేదు.. ఇక సరే అని అప్పుడు వ్రాయడం మొదలుపెట్టాను!
నేను కూడా మీలానే ప్రమోషన్ కోసం, i-phone కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.......
ఇక మొబైల్ లో లేని ఫీచర్ ఏముందబ్బా? కోరుకున్న సినిమా చూడటమా? అంటే Call -Request for a movie - See the movie)
@cbrao గారు: ఈ ఫీచర్ కూడా ఆల్రెడీ ఉందండీ..దాన్ని Video On Demand అంటారు.. మన దగ్గర ఇప్పుడిప్పుడే వస్తోంది.. iptv ఫీచర్ ఉన్న మొబైల్స్ లో ఇది అందుబాటులో ఉంది(ఇండియా లో)...
టెక్నికల్ గా నేను కొంచెం వీకు అయినా సరే మీ పోష్టు అర్ధమయ్యింది. కొత్త విషయాలు తెలిసినయ్.
ఫోను రేటెక్కడా చెప్పలేదేమి?
బొల్లోజు బాబా
@బాబా గారు: టపా నచినందుకు నెనర్లు...
రేట్స్ అంటే, చాలా రకాలు ఉన్నాయి కదండీ, అందుకే ఏమి ఇవ్వలేదు...
Chala vishayalu telisindi andi.
Nenu meela techical ga strong kakapoyina but baga telisindi..
hmm enni features vachina dantlo bugglu matram common feature ayipoyindi.. :(
Apple nunchi sony varaku annitlo vunnayi.. Developers koddiga blogs lanti kalakeshapam meeda kakunda code meeda concentrate chesi work cheste avi ravu emo ani na uddesham...
Tappuga anipiste bloggers andariki sorry.. :P
@సరదా బుల్లోడు గారు: టపా నచ్చినందుకు నెనర్లు..
నేనేమీ టెక్నికల్ గా, స్ట్రాంగ్ కాదు!.. నాకు తెలిసిన కొన్ని విషయాలని చెప్పాను అంతే...
ఇక బగ్స్ అంటారా.. మొదట్లో ఒక జోక్ ఉండేది.. ఏది వర్క్ అవకపోయినా, Its a feature not a bug అని..!
మీరే అన్నారు కదా, బ్లాగులు వ్రాసేది కాలక్షేపం కోసం అని, అంటే పని వదిలేసి ఎవరూ వ్రాయట్లేదు కదా..!
ఒక ఉచిత సలహా: మీకు మరీ మొబైల్ లో బగ్స్ ఎక్కువగా కనిపిస్తే, Authorized Centre కి వెళ్ళి అక్కడ క్రొత్త డౌన్లోడ్ చేసుకోండి.. అన్నీ కాకపోయినా మెజారిటీ తగ్గుతాయి...
Medha garu.. eppude mee blog choosa. simply.. super!!! neenu kottaga blogatam modhalupettanu. title kooda naalo neenu ane. blog start chesaka telisindi aa peru tho maro blog undani. adi meede.. mari...
ee roje anni tappalu chadiva. chala baagunai. nijamga..
mee ramaayanam kadhalu inka baagunnai.
tension ga job chesthu, ela pagela koddi telugu tappalu rayatam.. really great.
mee health jaagartha. ok then takecare. bye
@సుజీ గారూ: అయితే మన ఇద్దరి బ్లాగుల పేర్లు ఒకటేననమాట..!
ముందుగా బ్లాగ్లోకానికి స్వాగతం...
మీ అభిమానానికి, నా టపాలు నచ్చినందుకు నెనర్లు...
every thing ok.........but ....... no clarity on 3g....without changing the network(or upgrading.....but we have to change alot in 2g)..how can u expect 3g services.........in india 3g not implemented.........i dont know y the people r buying iphones.......we implemented till edge(black berry)
Post a Comment