Thursday, July 24, 2008

ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు.....

మొత్తానికి నా కొరియా ట్రిప్ లో ఆఖరి అంకానికి వచ్చేశాను.. ఇంకొద్ది గంటల్లో భారతానికి బయలుదేరబోతున్నాను.. :-)

ఏంటో ఇక్కడకి వచ్చి మూడు నెలలే అయినా, చాలా రోజులుగా (కొన్ని ఏళ్ళుగా!) అనిపిస్తోంది.. బహుశా ఇంటికి దూరంగా ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి అవడం వల్లనేమో...?!

ఇంటికి వచ్చేస్తున్నాను అంటేనే, తెలియని ఆనందం, ఆత్రుత, ఉత్సాహం.. నిద్ర పట్టట్లేదు.. ఆకలి వేయట్లేదు.. ఏ పని చేయబుధ్ధవట్లేదు... ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎగిరి వెళ్ళి విమానంలో కూర్చుందామా అనిపిస్తోంది...!

ఈ మూడు నెలలు ప్రతి క్షణం, ప్రతి క్షణం అనుభవించాను.. బాధలు అని చెప్పను, ఎందుకంటే అది అనుభవించేటప్పుడు బాధలాగా అనిపించచ్చు కానీ తరువాత గుర్తొచ్చినప్పుడు అదొక జ్ఞాపకం అంతే.. ఆనందంఐతేనేమి, బాధైతేనేమి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను...

ఒక ప్రక్కన ఇండియా వచ్చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నా, కొరియా వదిలి వచ్చేస్తున్నందుకు బాధగా కూడా ఉంది... అర్ధరాత్రి ఆ చల్లగాలిలో రావడం, పగలు -రాత్రి తేడా లేకుండా పని చేయడం, ఎక్కడా కాలుష్యం లేని పరిసరాలు, ఏ టైమ్ కి వెళ్ళినా అప్పటికప్పుడు వేడి వేడి చపాతీలు చేసిపెట్టే ఆంటీ-అంకుల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి... వీటన్నిటినీ మిస్స్ అవుతున్నాను...


ఈ ట్రిప్ లో చాలా నేర్చుకున్నాను.. అటు వర్క్ పరంగా, ఇటు పర్సనల్ గా చాలా విషయాలు తెలుసుకున్నాను... ముఖ్యంగా చెప్పాలి అంటే ఓపిక, సహనం లాంటివి ఎక్కువయ్యాయి...! మనం చేసే పనినే ప్రపంచంగా ఎలా భావించాలి, అలానే పని(అఫీషియల్) ఎంత ముఖ్యమైనది అయినా దాని గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా ఆనందంగా ఎలా ఉండాలి... ఇలా విభిన్నమైన అనుభవాలు...

మరీ సెంటిమెంట్ ఎక్కువైనట్లుంది..!

హమ్మయ్య కొరియా నుండి వచ్చేస్తుంది ఇక మనకి ఆ కొరియా కబుర్ల గోల నుండి విముక్తి అనుకుంటున్నారా...?! అలా ఏమీ కాదు.. ఇంకా రాయాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి.. అవన్నీ తీరికగా ఇంటికి వెళ్ళిన తరువాత ఒక్కోటి వ్రాస్తాను...!

P.S. చివరిలో గమనించాను.. ఈ టపాతో నా బ్లాగులో టపాలు అర్ధ-శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్నాయి..

19 comments:

విహారి said...

శుభం.
ఈ 'అర్ధ' లు దిన దిన ప్రవర్ధ మానమై ఎన్నో శతకాలు అవ్వాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ మాతృ భూమికి స్వాగతం.

-- విహారి

MURALI said...

అర్ధ శతకాలదేముంది సచిన్ లా శతకాలు కొట్టండి. ఈ సారి కి అభినందనలు.

కొత్త పాళీ said...

Very good observations .. and some life lessons too.
Congratulations on the 50th as well as successful completion of your duty tour.

వేణూ శ్రీకాంత్ said...

Oh very Nice, Have a safe trip to home. ఇంకా బోలెడు కొరియా కబుర్లు వినడానికి నేను రెడీ... ఆపకుండా ఇంకా పోస్ట్ చేయండి.

వేణూ శ్రీకాంత్ said...

అర్ధ శతకం చేరుకున్నందుకు అభినందనలు.

Niranjan Pulipati said...

Congrats on 50 :)

నాగరాజా said...

నెనర్లు. కొరియా టపాలు నాకు బాగా నచ్చాయి.

ప్రపుల్ల చంద్ర said...

అర్ధ శతకం చేరుకున్నందుకు అభినందనలు,
క్షేమంగా వెళ్ళండి !!

క్రాంతి కుమార్ మలినేని said...

happy journey.tondaraga vachheyandi mee kabulakosam maa kaburlato waiting

karthik said...

congrats for half century. have a safe and happy journey. and
bharatha desaniki swagatam!!

ప్రతాప్ said...

స్వాగతం, సుస్వాగతం,
జన్మనిచ్చిన కన్నా తల్లికి పాదాభివందనం..
జన్మంతా మోసే పుడమితల్లికి మనసార అభినందనం..
అంటూ ఇండియాకి వచ్చెయ్యండి.
మీ కబుర్లకోసం ఎదురు చుస్తూ ఉంటాము.

ప్రవీణ్ గార్లపాటి said...

కూల్... వెనక్కి వచ్చేస్తున్నారన్నమాట. ఉద్యాననగరికి స్వాగతం (బాంబు బ్లాస్టులతో...)
మరిన్ని కబుర్లు వచ్చిన తరువాత చెబుదురుగాని.

అర్థ శతకానికి శుభాకాంక్షలు.

Purnima said...

Welcome back!! and Congratulations as well.

Keep blogging.

విహారి(KBL) said...

rakhi wishes to you

Falling Angel said...
This comment has been removed by the author.
కత్తి మహేష్ కుమార్ said...

అర్థశతానికి అభినందనలు. మీనుంచీ మరిన్నిటపాలు ఆశిస్తున్నాను.

Falling Angel said...

కొరియాలో ఉన్నప్పుడే కాస్త తరచుగా రసేవారు, తిరిగొచ్చాక రాయట్లేదేంటి చెప్మా???

Falling Angel said...

కొరియాలో ఉన్నప్పుడే కాస్త తరచుగా రసేవారు, తిరిగొచ్చాక రాయట్లేదేంటి చెప్మా???

మేధ said...

వ్యాఖ్యాతలందరికీ నెనర్లు... ఈ మద్య పని వత్తిడి ఎక్కువగా ఉండడంచేత బ్లాగు ఓపెన్ చేయడానికి కూడా కుదరలేదు.. ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు అన్యధా భావించద్దని ప్రార్ధన...