బ్లాగులో full fledged టపా వ్రాసి చాలాకాలమైంది... పని మరీ ఎక్కువగా ఉంది... ఎప్పుడైనా కాస్త తీరిక దొరికి బ్రెయిన్ idle లో కి వెళ్ళగానే, మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది... కొత్తపాళీ గారు ఇచ్చిన కధ long time pending.. విష్ణువుని ఆన్సైట్ కి ఎలా పంపాలో ఆలోచిస్తుండగా, నా ఆన్సైట్ ప్రయాణం గుర్తొస్తుంది... సరే అని ఛానల్ మారిస్తే చిరు/బిరు/కిరు ల యాత్రలు కనిపిస్తున్నాయి.. పోనీ చదువరి గారి లాగా రాజకీయాలు రాద్దామా అనుకుంటే, ఇంతలో ఏవేవో ఊహలు..... సరే పూర్ణిమలాగా ఊహలన్నింటినీ ఊసులు చేసేద్దాం అనుకునేలోపు అవి తెల్లవారు ఝామున రూమ్ కి వస్తూ వేసుకున్న జోకుల దగ్గర నుండి, చిన్నప్పుడు దీపావళి చేసుకున్న రోజుల వరకూ వెళ్ళిపోతున్నాయి... ఎటూ ఇక్కడ వరకూ వచ్చాం కదా, ప్రవీణ్ లాగా వాటినే రాసేస్తే పోలా అని కలం కదిలించబోతే, ప్రక్కనే 300 B.C. మీద చర్చ వినిపిస్తోంది... ఇంకెందుకాలస్యం, మహేష్ గారి లాగా సినిమాల మీద వ్రాసేద్దాం అని పేపర్ తీసుకునేసరికి, సినిమా చూసి దాదాపు ఆరు నెలలు దాటింది అనే సంగతి గుర్తొచ్చి, నీరసం గా ప్రక్కన పెట్టేయబోతోంటే, ఎదురుగ్గా ఉన్న చివరికి మిగిలేది కనిపించి సౌమ్య లాగా పుస్తకాలని ఒక పట్టు బడదాం అనిపించి, శీర్షిక మొదలెట్టేసరికి పుస్తకం చదవడం కాదు కదా, కనీసం పట్టుకుని ఎన్నో రోజులయ్యింది అని జ్ఞాపకం వస్తోంది... సరే రొటీన్ కి భిన్నంగా రాధిక గారిలాగా కవితలు రాద్దామా అని మొదలుపెడితే, మన తెలివితేటలు ప్యారడీలవరకే వచ్చి ఆగిపోతున్నాయి.. ఫర్లేదులే, ప్రపుల్ల చంద్ర జపాన్ కబుర్ల లాగా, కొరియా కబుర్లు చెబుదామా అంటే, ఈ నెలలో ఆఫీసు, రూమ్ తప్పించి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళనే లేదు...
ఇలా ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతుండగా, మా మానేజర్ వచ్చి ఒక వెధవ నవ్వు నవ్వారు.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనేదానికి, నిలువెత్తు ఉదాహరణ!!!! Bug రావడం ఆలస్యం, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు.... చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా వెళ్ళు అన్నా కూడా వినిపించుకోకుండా దాన్ని చూసేవరకు అక్కడనుండి అంగుళం కూడా కదలరు.. సరే అని చేసే పని వదిలేసి, అది చూడడం మొదలుపెట్టాను.. ఇంతలో కొరియన్ మానేజర్ తయారు... మేమందరం(ఇండియన్స్ అందరూ) పనికి ఆహార పధకం క్రింద ఇక్కడ పని చేస్తున్నారు అనే చెత్త ఫీలింగ్ ఈయనకి... సరే వచ్చిన పని ఏంటి అంటే, ఆయన పదింటికల్లా వెళ్ళిపోతాడట, ఏవో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ check-in చేయాలట -- అర్ధరాత్రి 2:00 - 3:00 check-in టైం.. అప్పటివరకు ఉండి నేను చేసి వెళ్ళాలట!!!! ఏమి చేస్తాం... ఏమి అనలేం కదా.. సరే బాబూ నేను చేస్తాను, నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పా... మళ్ళీ నా పనిలో మునిగిపోయా.. ఇంతలో ఎక్కడో భయంకరమైన అరుపులు.. ఏంటా అని చూస్తే చైనీస్ మానేజర్ --- ఆడ పులి... ఆమె క్రింద పని చేసామంటే, చేరిన రోజే జీవితం మీద విరక్తి కలిగి ఒక గ్లాస్ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందామనిపిస్తుంది... ఎంతైనా ఈ కొరియన్స్ గట్టిపిండాలు, ఆమె క్రింద దాదాపు అయిదేళ్ళుగా పని చేస్తున్నారు!!!! ఈ కాకిగోల ఎప్పుడూ ఉండేదే అని పని చేసుకోవడం మొదలుపెట్టాను... ఇంతలో సూర్యుడు కనిపించాడు.. సూర్యుడు అంటే సూర్య భగవానుడు కాదు, ఇంకొక కొరియన్ మేనేజర్... ఎంత వేడిగా ఉంటాడు అంటే, మాకు A.C పని చేస్తుందని కూడా ఎప్పుడూ అనిపించలేదు.. బయట మైనస్ డెగ్రీలున్నా, లోపల మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్లుంటుంది.. ఈయన దృష్టిలో ఇండియన్స్ అందరూ, వలస వచ్చిన కార్మికులు! ఏదో ఇంత పడేసి, అడ్డమైన పనులు చేయించుకోవచ్చు అనే ఇదిలో ఉంటారు ఈయన... ఎలాగో ఈయన తాకిడి నుండి తప్పించుకుని, పని చేసుకుంటూ ఉంటే సీనియర్ V.P వచ్చి అటూ -- ఇటూ రౌండ్స్ వేస్తూ కనిపించారు.. మా కంపెనీ మొత్తంలో పనీ-పాట లేని వ్యక్తి ఎవరంటే ఈయనే... చివరికి ఈయన కూడా మా కోడ్ టెస్టింగ్ చేస్తాడు... మనం బిజీగా ఉండి ఏదో పని చేస్తూ ఉంటే మధ్యలో సుడిగాలిలా వచ్చి, ఇదుగో నీ కోడ్ క్రాష్ అవుతోంది... Fix it అని ప్రక్కనే నించుంటారు... ఈ కొరియన్స్ అందరిలోను ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా ఇష్యూ వస్తే వచ్చి ప్రక్కనే కూర్చుంటారు, మనల్నీ, సిస్టమ్ ని మార్చి చూస్తూ ఉంటారు... సరే ఎలాగో ఆయన్ని ప్రక్కకి పంపించేసరికి, Conf-Chat మొదలయ్యింది... మేము ప్రొద్దున్న ఆఫీసుకి వచ్చిన దగ్గరనుండి, రాత్రి వెళ్ళిపోయే వరకూ, ఇది open అయ్యి ఉంటుంది... పనికి వచ్చే డిస్కషన్ ఒక్కటి కూడా ఉండదు... సరే దాంట్లో పోట్లాట అయిపోయేసరికి, లంచ్ టైం అయ్యింది.. తినడానికి వెళ్ళాం.. అక్కడ మా ఇండియా బ్రాంచ్ V.P కనిపించారు... మధ్యాహ్న భోజన పధకం ఈయన కోసమే పెట్టారేమో అనిపిస్తుంది చూసినప్పుడల్లా... కొరియాలో రూమ్ క్లీన్ చేసేవాళ్ళకి కూడా వంగి వంగి దణ్ణాలు పెడతారు కానీ, మన మానేజర్లని కనీసం కూర్చోమని కూడా చెప్పరు! అంత గొప్పాయన... ఈయనకి మేము పెట్టిన ముద్దు పేరు - డిప్స్... అంతకుముందు మనిషా, మోహన్ బాబా అనేవాళ్ళం... ఈ మధ్య అది కాస్త మార్చి, మనిషివా, డిప్స్ వా అని అంటున్నాం...
hmm... అదుగో మళ్ళీ బ్రెయిన్ idle లోకి వెళ్ళిపోతోంది... మళ్ళీ అన్ని వరసగా మొదలవుతాయి... ఇదొక while(1) without any break!!!!
Finally what i can say is,
Head is breaking, Eyes are burning, Body is Trembling.... Next is Whatttttttttttttttt??????????????
P.S. అందరికీ దీపావళి శుభాకాంక్షలు...
skip to main |
skip to sidebar
17 comments:
బాగుంది. ఇలా విరక్తి పుట్టినప్పుడే నిజాలు బయటకొచ్చేస్తాయ్. :-)
చైనీస్ మానేజర్ --- ఆడ పులి...
100% అగ్రీడ్.
hahahaaaa..చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా వెళ్ళు ..vaallaki telugu vachiunte...!!???
Keep your chin up.
మరీ దీపావళిక్కూడా ఇంటికెళ్ళలేకపోవడం గోరుచుట్టైతే, ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళాల్సి రావడం దాణి మీద రోకటిపోటు.
ఏం చెప్పను.
I feel your pain.
I knew it.. I knew it !!! :P
>>చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా వెళ్ళు అన్నా ...
మీకు మాత్రమే సాధ్యమయ్యే హాస్య చతురత! :-)
ఇలాంటి అతి వృష్టులు, అనావృష్టులు మనబోటి వారికి తప్పవేమో! ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని ఆశగా ఎదురుచూడాలి!
Be brave gal, nothing lasts long! మీకూ దీపావళి శుభాకాంక్షలు!
"కొత్త బిచ్చగాడు పొద్దెరగడు"
"చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా"
"మధ్యాహ్న భోజన పధకం"
బాగా పేలాయి...
ఈ దీపావళికి నిజంగా టపాసులు కాల్చకపోయినా, ఇవి మాత్రం బాగానే పేల్చావు !!
దీపావళి శుభాకాంక్షలు....
పనికి ఆహార పధకం... ఒక్కొక్కప్పుడు అది నిజమేమో అనిపిస్తుంది.
అంతే అంతే :-)
మనిషి వా. మోహన్ బాబు వా.. :)) మేమూ ఇది ఇంకా మనిషి వా వై యెస్సువా అని అనే వాళ్ళము..
మీకూ దీపావళి శుభాకాంక్షలు
Hahah good one :)
బాగా అర్థం అయ్యింది. నేను అలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నా కాబట్టి :-) ... ఇలాంటివి పడక నేను క్రితం సంవత్సరం కొరియా కు వెళ్ళినప్పుడే, ఇకపై అలా బానిస బతుకు బతకను అని మా డామేజరు ని బెదిరించి మరీ వచ్చేసాను. కొరియా వాళ్ళను మనజోలికి రాకుండా ఓ ఉపాయం చెప్పనా , వాళ్ళను అదే పని గా ఏదో ఒకటి (వాళ్ళ మీద డెపెండెన్సీ వున్నదాన్ని గురించి) అడుగుతూ ఉండండి. అప్పుడప్పుడూ వాళ్ళను కాస్త ఉతికి ఆరెయ్యండి. లేకపోతే, వాళ్ళతో ఎక్కువకాలం వేగలేరు.
బాగుంది, టపా. "చెయ్యి ఖాళీ లేదు వెళ్ళవయ్యా వెళ్ళు" హైలైటు!
>> ఇదొక while(1) without any break!!!!
బాగుంది.
@వికటకవి గారు: చైనీస్ మేనేజర్ మీకు కూడా తగిలారా..? :)
@సుజ్జీ గారు: హ్హహ్హ ఏముందండీ, ఇంకోసారి నా దగ్గరికి రారు.. ;-)
@కొత్తపాళీ గారు: అర్ధం చేసుకున్నారు... :((
@Motorolan గారు: ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు!!!
@పూర్ణిమ: మీరు చెప్పింది నిజమే..
Nothing lasts for ever... Neither bugs nor fixes!!!
@ప్రపుల్లచంద్ర: ఏమి చేస్తాం ప్రపుల్లా.... స్వల్ప adjust మాడుతున్నా... :)
@కృష్ణారావు గారు: మా కంపెనీ లో మాత్రం ఎప్పుడూ అనిపించలేదండీ..
@ప్రవీణ్: అంతే అంటారా....?!
@నిరంజన్ గారు: Y.S.R అయినా మోహన్ బాబు అయినా, డిప్స్ కంటే చాలా బెటర్! మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు..
@రిషి గారు: టపా నచ్చినందుకు నెనర్లు.. మీరు ఇండియాలో ఉన్నప్పుడు లీడ్ అనుకుంటా, మిమ్మల్ని కూడా ఇలానే అనుకున్నారా మీ టీమ్ మేట్స్!!!!! Just Kidding.. :)
@రవి గారు: చాలా కరెక్ట్ గా చెప్పారండీ... నిజమైన బానిస బ్రతుకు.. నేను టపాలో ఆ పదం వ్రాయకపోయినా పట్టేసారు..
అలా వాళ్ళని అడగడం కూడా అయిపోయింది.. వాళ్ళకేమో రోజులు, రోజులు టైం ఇస్తారు.. మాకు మాత్రం నిమిషాల్లో అయిపోవాలి.. ఎందుకులెండి, మళ్ళీ ఆ గొడవలు తలుచుకోవడం...
నేను పోయినసారే మళ్ళీ కొరియాకి వెళ్ళను అని.. కానీ ఎవరూ నా మాట వినలేదు.. ఈ సారి మాత్రం వెనక్కి తగ్గేది లేదు.. :)
@చదువరి గారు: అలా చెప్పినా కూడా అర్ధం చేసుకోరూరూరూరూ.. :)
@బ్రహ్మీ గారు: అవునండీ.. that too without sleep()...!
nEnoo konnaaLLu "Next is Whattttt" ani edicha lendi... anduke :)
మీకు దీపావళి శుభాకాంక్షలు.
చాలా బావుంది
Post a Comment