Wednesday, December 31, 2008

చూస్తూనే వత్సరం వెళ్ళిపోతోంది...

2008 రానూ వచ్చింది.. పోనూ పోతోంది!!! ఏంటో పోయిన సంవత్సరం కూడా ఇదే అనుకున్నా.. ఇప్పుడూ అంతే అనుకుంటున్నా.. కాలం గడుస్తుంటే, అభిప్రాయాలు మారుతూ ఉంటాయంటారు కానీ, డిసెంబరు 31 మీద మాత్రం నాకు చిన్నప్పటి నుండీ ఇదే అభిప్రాయం!

అయితే ఈ వత్సరం మాత్రం 64x స్పీడ్ తో అయిపోయిందనిపించింది.. అసలు ఎలా గడిచిందో కూడా ఎంత ఆలోచించినా అర్ధం అవడం లేదు! కనీసం ఏమి సాధించానా అని చూస్తే, అది చూసుకోకపోవడమే బెటర్ అనుకుంటా!

ఈ సంవత్సరమంతా బిజీ ఎప్పుడూ లేను (అంటే ప్రతీ సారి అలానే అనుకుంటా :) ) వ్యక్తి గతం గా చూస్తే ఏమీ చేయలేదు.. కనీసం నా బ్లాగు మొదటి పుట్టిన రోజు కూడా గుర్తు లేదు!! పాపం.. ఎన్ని తిట్టుకుందో నన్ను నా బ్లాగ్! పోనీ వృత్తిపరంగా ఏమైనా చేశానా అని చూసుకుంటే అది కూడా డౌటే! సాధించానా లేదా అనేది ప్రక్కన పెడితే, అక్కడ కనీసం ప్రయత్నమైతే చేశాను!

ఒక పేటెంట్ తృటిలో వచ్చి తప్పిపోయింది.. అలానే ఒక ప్రొడక్ట్ మొదటి నుండి, చివరి వరకు పని చేయగలిగాను అనే సంతృప్తి ఉంది... అలానే పర్సనల్ గా, చాలా చేయాలనుకున్నా.. కానీ ఏదీ చేయలేకపోయా.. అయితే చేయాలనుకోకుండా, చేసింది మాత్రం ఒకటుంది.. TT నేర్చుకోవడం... కొరియాలో సరదాగా నేర్చుకున్నా.. కానీ అక్కడ నుండి వచ్చేసే రోజు మాత్రం మాకు నేర్పించినతన్ని కూడా ఓడించేశా!!! అది తలుచుకుంటే నవ్వొస్తుంది.. ఆ రోజు లక్ మొత్తం నా వైపే.. ఎంతలా అంటే నేను ఎంత పిచ్చి గా కొట్టినా, అదొక అద్భుతమైన షాట్ గా మారడం.. చివరికి నేను కొట్టిన ఒక షాట్ గాల్లోకి చాలా పైకి లేచి, చివరికి టేబుల్ మీద సరిగ్గ పడడం!!!... అలా అతన్ని నాలుగు సెట్లలోనూ క్లీన్ స్వీప్ చేసి పారేశా!!! అంటే నాకు ఎంతవరకు వచ్చో నాకు తెలుసు, కానీ ఆ రోజు అలా జరిగిపోయింది!!!

ఇంకా చాలా చాలా రాయాలనిపిస్తోంది.. మనసులో మెదిలే ఆలోచనలన్నింటికీ రూపం ఇవ్వగలిగితే ఎంత బావుండు.. కానీ, ఏంటో అక్కడి వరకే వచ్చి ఆగిపోతున్నాయి.. చేరువైనా, దూరమైనా ఆనందమే....



రాబోయే వత్సరం అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

17 comments:

రవి said...

మీ బ్లాగు ఎప్పుడు మొదలయ్యిందో నాకు బాగా గుర్తుంది, మీకు గుర్తు లేకపోయినా. నేనూ దాదాపు అప్పట్లోనే బ్లాగింగు మొదలెట్టాను కాబట్టి, పైగా మీరు, నేను ఇద్దరం కొరియా బాధితులమే కాబట్టి.

2009 లో మీకు పేటెంట్లు రావాలని, కొరియా (వాళ్ళ) పీడ తగ్గాలని, TT లో ఇరగదీయాలని, మనస్స్ఫూర్తిగా కోరుతూ, నూతన వర్ష శుభాభినందనలు.

krishna rao jallipalli said...

2008 రానూ వచ్చింది.. పోనూ పోతోంది!!! ఏంటో పోయిన సంవత్సరం కూడా ఇదే అనుకున్నా..
అవును. నిజం. dec 31 & jan 01 రోజులని కూడా కేలండర్ లో మిగతా రోజులుగా అనుకుంటే ఏ బాదా ఉండదు. నిజానికి ఈ రెండు రోజులు మామూలు రోజులే కదా. అంతా మనలోను, మన మనసులోనే ఉంది. కానివ్వండి. ఈ రెండు రోజులైనా ఎంజాయ్ చేద్దాం ఏదో ఒక పేరుతొ. FINALLY... ADV WSHS FR N.Y.09

Purnima said...

హహహ.. నేను దీన్ని నిరభ్యంతరంగా కాపీ పేస్టు చేసేసుకోవచ్చు. ఒక్క పేటెంట్ తప్పించి మిగితావన్నీ ఉన్నాయి. may be, i missed a foreign trip by a whisker.

కాకపోతే నా టిటి ప్రాక్టీసంతా మన ఇండియన్స్ తోనే జరిగింది. సో స్పిన్ అంటే కాస్త కష్టపడతా! కొరియన్లూ, చైనీయూలూ విరగదీస్తారని విన్నాను. వాళ్ళనే ఓడించారంటే.. లాభం లేదు, మీతో ఒక ఆట వేసుకోవాల్సింది. Lets meet sometime ;-)

Wish you a very happy and successful new year ahead!

చిలమకూరు విజయమోహన్ said...

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

vrdarla said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సుజ్జి said...

Happy new year

Niranjan Pulipati said...

Happy New year :)

ఆత్రేయ కొండూరు said...

ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా

asha said...

ఇంచుమించు ఇలాంటివే నాకూ జరిగాయి.
anyways,మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. రాబోయే రోజులు మీకు మరిన్ని శుభాలను తీసుకు రావాలి అని ఆశిస్తున్నాను.

విహారి(KBL) said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు మేధగారు.

విహారి(KBL) said...

Medhagaru ela vunnaru.
Blogulu chadivi chala rojulu avutundi.
Chala manchi post lu miss ayyanu.
mottaniki ee roju kudirindi.
Bloging lo chala edigipoyaru.

మేధ said...

@రవి గారు: నిజమేనండీ, సుఖాల కంటే కష్టాలు మనుష్యులని దగ్గర చేస్తాయంటారు!
హ్హహ్హ.. మీకు కూడా ఈ సంవత్సరం కొరియా కాకుండా, ఐరోపాలోని మంచి టూరిస్ట్ ప్రదేశాలకి ఆన్సైట్ రావాలని కోరుకుంటున్నా... :)

@కృష్ణారావు గారు: నిజమే అంతా మన మనసులోనే ఉంది.. పేరు ఏదైతేనేమి, ఆనందంగా ఉండడం కావాలి.. అది చాలు...

@పూర్ణిమ: ఆ రోజు నేను ఇండియన్స్ స్పిన్ వేసేవాళ్ళని కూడా ఓడించాను!!! హ్హహ్హ చెప్పాను కదా, ఏదో అలా అయిపోయింది.. అంతే తప్ప, అక్కడ నాకు ఆట వచ్చి కాదు ;)
తప్పకుండా, ఈ సారి కలిసినప్పుడు, ఆడదాం!

@విజయమోహన్ గారు, వి.ఆర్.దార్ల గారు, sujji, బాబా గారు, నిరంజన్, ఆత్రేయ గారు, వేణూ శ్రీకాంత్: అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను..

@విహారి గారు: చాలా రోజులకి కనిపించారు.. ఈ సంవత్సరం(2008) చాలా తక్కువ టపాలు వ్రాసినట్లున్నారు... మీరు చాలా టపాలు బాకీ ఉన్నారు.. ఇక నుండైన రెగ్యులర్ గా వ్రాస్తారని ఆశిస్తూ..

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...

wish you a very happy new year 2009

Unknown said...

అవును! చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ప్చ్...

ఓ పేటెంటుకి దగ్గరగా వెళ్ళారంటే మంచి పురోగతే. ఈ సంవత్సరం మరింత ప్రగతి సాధించుగాక.

చైతన్య said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
~ చైతన్య

విహారి(KBL) said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు