Monday, August 6, 2007

బెంగళూరు లోని ఆటోలు

ప్రపంచంలో ఇన్ని వేల టాపిక్స్ ఉండగా, ఈ ఆటో టాపిక్ అదీ కేవలం బెంగళూరు లోని ఆటోలు అని అంత స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానో అని సందేహం రావచ్చు. రోజూ ఆఫీసుకి ఆటో లో వెళ్ళడం వాళ్ళు చెప్పే కండీషన్స్ వినీ వినీ వీళ్ళ గురించి రాయాలి అని అనిపించింది. నా డైరీ లో రాసుకుంటే ఏమి లాభం అదే బ్లాగ్ లో అతే మిగతావాళ్ళకి తెలుస్తుంది అలానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవచ్చు కదా అని ఈ టాపిక్ తో నా బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాను...!!!

నా చిన్నప్పుడు ఆటో లో వెళ్ళడం అంటే, చాలా గొప్పగా ఉండేది. పట్టణాలలో తప్ప పల్లెటూరు లో ఎక్కడ కనిపించేవి కాదు.. అలాంటిది ఈ గ్లోబలైజేషన్ పుణ్యమ్ వల్ల కానీ, రూపాయి డెవలప్మ్0ట్ వల్ల కానీ కారణ0 ఏదైతీనేమి, ఆటో లేకుండా ఏ ఊరు కనిపించదు...!

జనరల్ గా ఎపి లో మనకి చాలా చోట్ల సర్వీస్/షేర్ ఆటో అ0టే తెలుసు కదా.. కాస్త ఖాళీ ఆటో చూసుకుని ఎక్కి కూర్చుకు0టే మనకి కావాల్సిన చోటికి అతి తక్కువ ఖర్చుతొ చేరతాము కానీ, కాస్మోపాలిటన్ సిటీ గా పేరున్న బె0గళూరు లో మాత్రమ్ తద్విరుద్ధ0. ఇక్కడ ఆటో అని పిలుస్తున్నా ఏ ఆటో వాళ్ళు రారు. ఇక చేసేది లేక ఆటో స్టా0డ్ కి వెళితే వాళ్ళు హాయి గా కాలు మీద కాలు వేసుకుని ఏ వి0టూ ఉ0టారు. మనం పిలిస్తే వాళ్ళని డిస్టర్బె చేసినట్లు ఫీల్ అవుతూ చిరాగ్గా మొహం పెడతారు. మనం ఏదన్నా ప్లేస్ చెప్పామే అనుకోండి, కనీసం 50/- అన్నా వస్తాయి అని అనుకుంటే తప్ప కదలరు. బేరాలైనా లేకుండా ఖాళీ గా కూర్చుంటారు కానీ కదలరు. వాళ్ళలో ఎవరైనా కాస్త మంచి వాళ్ళుంటే వస్తాం అని అంటారు. అక్కడే పెద్ద మతలబు ఉంది. మనం one and half కానీ double మీటర్ కానీ ఇవ్వాలి. బెంగళూరు వచ్చిన క్రొత్తలో ఇది ఏంటా అని తెగ ఆశ్చర్య పోయాను ఇప్పుడేమో తప్పక అలవాటు పడిపోయాను.... మన దురద్రుష్టవశాత్తూ రాత్రి అయిందంటే ఇక అంతే ఆటో వాళ్ళకి పండగే పండగ..!! ఒకసారి మా ఫామిలీ మొత్తం మైసూర్ వెళ్ళాము. బెంగళూరు చేరేసరికి 12 అయింది. ఆ టైమ్ లో బస్టాండ్ నుండి మా ఇంటికి (10-12Km) 400/- తీసుకున్నారు. ఫర్ 4 మెంబర్స్..!! ఏమి చేస్తామ్ ఉన్న డబ్బులు మొత్తమ్ క్షవరం చేయించుకుని బాధతో బయటపడ్డాం. ఇవండీ బెంగళూరు లో నా ఆటో అనుభవాలు.. నాకు తెలిసి బెంగళూరు లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంచుమించు ఇలాంటివే జరిగి ఉంటాయని ఊహిస్తూ………!

- మేధ

3 comments:

జాలయ్య said...

మీ బ్లాగు బాగుందండి. దీనిని జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com

Anonymous said...

అవునండి నాకు మొన్న ఎలాంటి అనుభవమే అయింది. మెజెస్టిక్ నుంది మడివాల కి 180 రూపాయలు తీసుకున్నడు ఇద్దరికి ఒక అటో వాలా

sujata said...

నాకు హైదరాబాద్ లో ఆటోలు మరీ అన్యాయం అనిపించాయి. న్యూఢిల్లీ లో కూడా దూర ప్రయాణాలు అంత ప్రియంగా వుండవు. మీటర్ టాంపరింగ్ చేస్తారు మెహదీపట్నం లో మా ఇంటి దగ్గర. రోజూ కొన్ని వందల ఆటోలు Q లో నించుంటాయి రింగ్ రోడ్ లో. ఎవరూ పెద్దగా నిరసించరు. పబ్లిక్ గా మన దోపిడీ ని మనమే అనుమతిస్తామన్నమాట.