అప్పుడే B.Tech అయిపోయి మూడేళ్ళు అయిపోయింది.. ఈ మూడేళ్ళలో ఏమి సాధించామా అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించడం లేదు ఒక్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వెలగబెట్టడం తప్ప..!
కాలేజీ లో ఉన్నప్పుడు ఈ పరీక్షలు ఎప్పుడు అయిపోతాయా ఈ చదువు ఎప్పుడు పూర్తి చేస్తామా ఉద్యోగం లో ఎప్పుడు జాయిన్ అవుతామా అనే ఆలోచిస్తాం… ఎలాగోలాగా కష్టపడి చదువు అయిపోయింది అని అనిపించేస్తాం. ఇక అక్కడ కట్ చేస్తే జాబ్ లో ఉంటాం.. చేరిన క్రొత్తలో చాలా బావుంటుంది.. క్రొత్త ఆఫీస్, క్రొత్త మనుషులు, చేతిలో డబ్బులు... జాం జాం అని సాగిపోతుంది…… తరువాత మొదలు అవుతుంది జీవితం లో బోర్..! కాలేజీ రోజులు గుర్తొస్తూ ఉంటాయి. ఆఫీస్ కి బస్ లో వెళుతున్నప్పుడు బస్టాప్ లో నిలబడ్డ కాలేజీ పిల్లలని చూసినప్పుడల్లా మనం కూడా మళ్ళీ కాలేజీ కి వెళ్ళిపోదామా అని లాగుతూ ఉంటుంది మనసు… అయ్యొ B.Tech తో ఆపకుండా ఏ M.Tech/MBA చేసి ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆనందంగా గడిపే వాళ్ళం కదా అని అనిపిస్తుంది.. ఒకసారి ఇదే తమ్ముడి తో అన్నాను.. వాడు అప్పటికే చాలా టెన్షన్స్ లో ఉన్నాడు.. ఒక ప్రక్క చూస్తే B.Arch ఫైనల్ ఇయర్ M.Arch చేయాలో M.S చేయాలో అర్థం కావట్లేదు.. ముందు ప్రాజెక్టు చేయాలి అదేమో తెలుగు ఆర్కిటెక్చర్ మీద కానీ ఆ విషయాలన్నీ వేరే రాష్ట్రాలలో తప్ప ఇక్కడ దొరకవు.. ఉన్నది చాలా తక్కువ టైమ్.. ఇలా వాడి కష్టాలలో వాడు ఉంటే నేనేమో కాలేజీ లో హాయి గా ఉంటుంది కదా అని అన్నాను అంతే వాడు నా మీద ఇంతెత్తున లేచాడు… నీకు జాబ్ లో ఎంజాయ్ చేయడం రాదు అసలు నేనే ఉద్యోగం లో ఉంటే ఎంత హాయిగా ఉండేవాడినో అని అన్నాడు.. అప్పుడు నాకు రెండు సామెతలు గుర్తుకు వచ్చాయి.. (1)పీత కష్టాలు పీతవి (2)దూరపు కొండలు నునుపు … కాదంటారా ??
skip to main |
skip to sidebar
6 comments:
baaga chepparu
naadi oka rakamga mee lanti paristitae
Medha Garu.........
Medha Garu............
Meerrrrrrrru Chinchesthunnaru andi..Blog lo........he he
Hows life ?
Akki
Correct ga chepparu...Nadi kuda same abhiprayam...
ee situation lo kuda present ni enjoy cheyamu.... Future inka baguntundemo anukuntam...Theera akkadiki vasthe gani teledu mana previous life bagundi ani... Chinnapudu school velle time lo Nanna vallani chusi happy ga udyogam chesthe bagundu anipisthu untundi.... kani ipudu telusthundi endulo unde badalu andulo untay ani... so ika nundi manam ee kashtalne enjoy cheyadam nerchukundam...Inka next stage ela untundo kada....
మేధ గారు, చాలా బాగా చెప్పారు. నాది అదే ఫీలింగ్. అందరు MS చేయటానికి వస్తుంటే, ఏంటి వీళ్ళ పిచ్చి, హాయిగా ఏదైనా జాబ్ చూస్కుని హాపీగా సెటిల్ అవక ఇంకా ఏం చదవటం అని అనుకొన్నాను.కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇంకొన్ని రోజులు కాలేజ్ ఉన్నా లేదా MS చేసుంటే బాగుండేది అని. మీ బ్లాగ్ చాలా బాగుంది
chaala nijam raasaru alane anipistundi
ananymous baaga chepparu.........
Post a Comment