ఇక్కడకి వచ్చిన మొదటి వారం ఎక్కడికి వెళ్ళలేదు.. రూమ్ లోనే సరిపోయింది... రెండో ఆదివారం బయటికి వెళ్ళాము..
ముందు కెమెరా కొనాలి అని బయలుదేరాము.. యోంగ్ సాన్ అనే ప్లేస్ లో కాస్త తక్కువ ధరకి దొరుకుతాయి అని తెలిసి అక్కడకి వెళ్ళాము. సువాన్ నుండి అక్కడకి 40నిమిషాలు ప్రయాణం, సబ్ వేలో. మొదట అక్కడ ఊరులోకి వెళ్ళాలేమో అని అనుకున్నాము. కానీ అసలు స్టేషన్ లోనే చాలా షాప్స్ ఉన్నాయి. సో, ఇక అక్కడే కొనేద్దామని డిసైడ్ అయ్యాము.
ఇక కెమెరా వెతుకులాట లో పడ్డాము. ఒక్కోచోట ఒక్కో రకంగా చెప్పారు. సరే అన్నిటి కంటే, తక్కువ చెప్పిన అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళాము. మొత్తనికి ఇండియాలో కంటే, ఒక 5వేలు తక్కువగానే వచ్చింది. పోన్లే తక్కువలోనే వచ్చింది అని ఆనందపడ్డాము. ఇంతలో మా ఫ్రెండ్, చార్జింగ్ బాటరీస్ కావాలి అంటే, ఇంకో షాప్ కి వెళ్ళాము, తీరా చూస్తే, మేము పెట్టిన దానికంటే సగం చెప్పాడు, అప్పుడు కానీ మా కాళ్ళు భూమి మీద నిలవలేదు..!! కాకపోతే, కెమెరా రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు, పోన్లే, కనీసం ఒక దాంట్లో ఎక్కువ తీసుకున్నా, ఇంకో దాంట్లో తగ్గించాడు కదా అని సర్ది చెప్పుకున్నాము... :)
అప్పటికే, బేరాలు ఆడి ఆడి అలసిపోవడంతో, ఇక రెస్టారెంట్స్ మీద పడ్డాము. ఎక్కడా వెజిటేరియన్ కనిపించదే..!!! చివరికి ఒకచోట పిజ్జా ఉంది అన్నాడు. అది వెజిటేరియన్ అని అంటాడు, మాకేమో డౌట్.. మేము అడిగే ప్రశ్నలు వాళ్ళకి అర్ధమవవు.. సరే ఇక ఏదైతే అది అయ్యింది అని అదే తీసుకున్నాము. మా అదృష్టం కొద్దీ దాంట్లో కేవలం వెజిటబుల్సే ఉన్నాయి. హమ్మయ్య పోన్లే అని అనుకుని కాస్త తృప్తిగా తిన్నాము.
ఇక ఆ పని అయిపోయిన తరువాత మళ్ళీ తిరుగు టపా. సువాన్ కి వచ్చేసరికి 6:30 అయ్యింది. సరే రూమ్ కి వెళ్ళినా చేసేదేముంది అని, దగ్గర్లో ఒక కోట ఉంది.. దానికి వెళ్ళాము.. ఆ కోట పేరు - Hwaseong Fortress.
ఈ కోట King Jing Joe the Great అనే రాజు కట్టించారు. పూర్వం, సువాన్ అనేది ఒక చిన్న ఊరు. ఈ రాజు దీన్ని తన ప్రధాన పరిపాలనా కేంద్రంగా చేసుకోవడంతో అభివృధ్ధి మొదలయ్యింది. అప్పట్లోనే ఎన్నో రకాల ఆర్కిటెక్చర్లు మేళవించి కట్టారట దీన్ని. ప్రస్తుతానికి చాలా శిధిలావస్థలో ఉంది. UNESCO వాళ్ళు దీన్ని హెరిటేజ్ ప్లేస్ గా హోదా ఇచ్చి, సంరక్షిస్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ చూడడానికి మిగిలింది, కోట గోడలు, మెట్లు అంతే.. కోట ప్రారంభంలో రాజు గారిది, పెద్ద విగ్రహం ఉంది. ఇక లోపలికి వెళుతూ ఉంటే, అన్ని శిధిలాలు కనిపిస్తూ ఉంటాయి. పైకి ఎక్కితే, కమాండ్ పోస్ట్లు కనిపిస్తాయి. అన్నిటికంటే పైన ఒకటి ఉంది.. అక్కడి నుండి చూస్తే, సువాన్ మొత్తం కనిపిస్తుంది. ఆ view చాలా బావుంది. కోట పైకి నడవాలంటే దగ్గర దగ్గర గంట పైనే పడుతుంది. వాకింగ్ కి చాలా బావుంటుంది.. కాకపోతే, మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యింది, దానితో పైన ఎక్కువసేపు ఉండలేకపోయాము. కానీ మేము తిరిగి వస్తుంటే, చాలా మంది కొరియన్స్ పైకి వెళుతున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏమి చేస్తారు అని అడిగితే వాకింగ్ అట.. రాత్రి పదింటికి, కోట పైకి వాకింగ్ అంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు!!!
Seojangdae - Western Command Post - Highest point of the Fortress
City View from Fort
City View from Fort
Fort Wall - It surrounds most part of the Old City!
ఈ ఫొటో లో ఉన్నది, Paldalmun Gate - South gate of Fort. ఇక్కడ లోకల్ మార్కెట్లో, వస్తువులు కాస్త తక్కువకి దొరుకుతాయి.
ఇవి ఇంతకుముందు వ్రాసిన టపాలో చెప్పిన ఫెస్టివల్ ఫొటోస్
అలా ఒక ఆదివారాన్ని King Jing Joe కి అంకితం చేసేసి ఇంటికి వచ్చి హాయిగా పడుకున్నాము..
skip to main |
skip to sidebar
10 comments:
బాగుంది. చక్కగా కొరియా చక్కర్లు కొట్టిస్తున్నారు.
మీరు వెళ్ళే ప్రదేశాల హిస్టరీ కూడా రాయండి. బాగుంటుంది...
Photos,kaburlu bagunnayandi.
బాగున్నాయి కబుర్లు... ఏంటి ఈసారి జై భారత్ లేదు, అప్పుడే మర్చిపోయారా!!!!!
Yours is becoming a good travel blog. Do put in more info about the places and their history.
And enjoy ur trip!!
మొత్తానికి కేమరా కొని "క్లిక్కు" మనిపించారు.మీ వివరణే బాగుంటే ఇప్పుడు చిత్రాలు తోడై బ్లాగు మరింత రంగులమయమైంది. బాగా కొరియా చుట్టి, మమ్మల్నీ మీతో తిప్పండి.
పప్పులో కాలేసారు. గసాన్ డిజిటల్ కామ్ప్లెక్స్ అనే చోటకి వెళ్ళాల్సింది. కెమెరాలు బాగా చీప్ గా దొరకుతాయి అక్కడ.
వచ్చే టపాలో డోక్సుగున్గు పాలస్, నామ్ దేమోన్ మార్కెట్...ఏమంటారు ?
ఇన్కొకటి మిస్ అయారు...జై జై జై జై భారత్ !
@ప్రవీణ్ గారు, @ పూర్ణిమ గారు: :).. తప్పకుండా, ఈ సారి రాసేటప్పుడు ఆయా ప్రదేశాల చరిత్ర కూడా రాస్తాను. తెలియకపోతే, తెలుసుకుని మరీ రాస్తాను!
@విహారి గారు, మహేష్ గారు: నెనర్లు.. ఇంకా వీలైనన్ని ఎక్కువ కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను...
@ప్రపుల్ల చంద్ర గారు, రవి గారు:
మీరు టపాలని x-ray కళ్ళతో చూస్తున్నారా...?!!!
అసలు జరిగింది ఏంటంటే, నేను ముందు టపా, ఈ టపా కలిపి రాసేశాను, కానీ పెద్దదిగా ఉంది అని తరువాత డివైడ్ చేశాను.. సో, ఆ డివిజన్ లో, copy-paste మిస్టేక్!
రవి గారు, డిజిటల్ కాంప్లెక్స్ కే వెళదామనుకున్నాము కానీ, మా ఫ్రెండ్స్ కి యోంగ్ సాన్ లో కొంతమంది షాపు వాళ్ళతో పరిచయముంది(వాళ్ళు సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నారు!), అందుకని అక్కడికి వెళ్ళాము..
నాందేమున్ మార్కెట్టంటారా, సరే అలాగే!
బాగుంది మీ బ్లాగు. నేను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడే వుంటున్నా ఎప్పటికప్పుడు కొరియా గురించి బ్లాగులు రాద్దాము అని అనుకోవడము తప్పితే ఒక్కసారి కూడా దానిని ఆచరణలో పెట్టలేకపొయ్యాను. మీకు Seoul లో Indian Restaurants సమాచారము కావలసినచో నాకు ఒక టపా వేయండి.
KKG గారు, ముందుగా బ్లాగ్ నచ్చినందుకు నెనర్లు...
మీరు ఇక్కడే ఉంటున్నారా, అదీనూ రెండేళ్ళ నుండి...!!! ప్రస్తుతానికి ఐతే నేను సువాన్ లో ఉంటున్నాను.. సియోల్ వచ్చేటట్లైతే ముందు మీకు మెయిల్ చేసి వస్తాను! Thank you...
Post a Comment