ఈ రోజుల్లో చాలామంది ట్రావెల్/onsite/MS/Job Search ల పేరు మీద అమెరికా కి అమలాపురం వెళ్ళి వచ్చినంత తేలిక గా వెళ్ళి వచ్చేస్తున్నారు.. (ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అమలాపురం వెళ్ళడం చాలా కష్టం..!) ఈ ఫీల్డ్ లో లేని వాళ్ళకి అదేదో చాలా గొప్పగా, వెళ్ళి వచ్చిన వాళ్ళందరిని ఏదో కింగ్ ల లాగా చూస్తూ ఉంటారు.. కానీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి అక్కడ ఉండే కష్టాలు, కన్నీళ్ళు…!!!
మొదటిసారి మేనేజర్ తన కాబిన్ కి పిలిచి మీరు చేస్తున్న పని వల్ల క్లైంట్ బాగా ఇంప్రెస్ అయ్యాడు (నిజం చెప్పాలి అంటే ఇలాంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి.. రిజైన్ చేస్తాను అని మేనేజర్ ని బెదిరించి ఆయనే బలవంతంగా క్లైంట్ ని ఒప్పించేటట్లు చేస్తారు..!!) సో, మీరు ఒక వీక్స్ లో బయలుడహెరాలి అని చెప్పగానే, మనసు మనసు లో ఉండదు అప్పుడే కి వెళ్ళినంత ఆనందపడిపోతాం.. కానీ ఆయనముందు అది కనిపించకుండా పెద్ద ఫోజ్ పెట్టి, నాకు రెండు రోజులు టైమ్ కావాలి అని వచ్చేస్తాం.. OK చెబుతామని ఆయనకి తెలుసు, మనకి తెలుసు… సరే మొత్తానికి ఏదో కంపెనీ కోసమో, మేనేజర్ కోసమో వెళుతున్నట్లు కాస్త build-up ఇచ్చి కన్ఫర్మ్ చేసేస్తాం. సో, ఇక వెంటనే అమెరికా లో ఉన్న ఫ్రెండ్స్ కి, రిలెటివ్స్ కి మెయిల్స్ వెళ్ళిపోతాయి.. షాపింగ్ మొదలవుతుంది.. ఇక్కడ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే వాళ్ళం కూడా, గబగబా పాంట్స్, జీన్స్, గ్లోవ్స్, షూ .. ఇలా పనికి వచ్చేవి, రానివి అన్నీ కొనేస్తాం.
కొంతమంది వంట సామాను కూడా తీసుకువెళ్ళాల్సి వస్తుంది (అది వాళ్ళ వాళ్ళ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది..). ఒక ప్రక్క వెళ్ళాల్సిన తేది దగ్గర పడుతూ ఉంటుంది.. షాపింగ్ అవదు, ఆఫీస్ లో, మేనేజర్ ఏమో ఇక్కడ పని మొత్తం పూర్తి చేస్తే తప్ప పంపించను అని భయపెడుతూ ఉంటాడు (మరి అంతే కదా ఫస్ట్ హాఫ్ లో మనం విలన్ ఐతే, ఇప్పుడు ఆయన టర్న్).. సరే ఎలాగోలాగ, అన్నీ పూర్తి చేసేసుకుని టికెట్ తీసేసుకుని అందరికీ వీడ్కోలు చెప్పేసి (సగం ఆనందంతో, సగం బాధతో) ఏదో విక్టోరియా మహారాణి (అబ్బాయిలు కరెస్పాండింగ్ గా ఊహించుకుంటారు) లా, ఫ్లైట్ లో కి అడుగుపెడతాం (ఇప్పుడంటే ఆల్రెడీ విమానం ఎక్కేస్తున్నం కానీ ఒకప్పుడు అడే మొదటి విమాన ప్రయాణం కాబట్టి ఇంకా exciting ఉంటుంది).
ఆ ఫ్లైట్ లో, వాడు పెట్టే అడ్డమైన చెత్తని ( నేను విన్నంతవరకు బావుండదు అని విన్నాను) అమితానందం తో తింటూ, గురించి కలలు కంటూ సరిగా నిద్ర కూడా పోము.. ఎట్టకేలకు, ఫ్లైట్ అమెరికా చేరుకుంటుంది .. ఇక అక్కడ కాలుపెట్టగానే, మనసు ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది… గాలిలో తేలిపోతూ ఉంటుంది.. ఒక్కసారి హుర్రే అని గట్టిగా అరిచి గంతులు వేయాలని అనిపిస్తుంది.. కానీ బావుండదు అని కంట్రోల్ చేసుకుంటాం.
మనకోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు… రూమ్ కి వెళ్తాం.. మొదటి రోజు కాబట్టి, వాళ్ళే అన్నీ చేసి పెడతారు.. హాయి గా తిని పడుకుంటాం.. సోమవారం వస్తుంది.. ఆఫీస్ కి వెళతాం.. ఇక్కడ అప్పుడప్పుడు కూడా ఫార్మల్స్ వేసుకోని వాళ్ళం కూడ, ఫస్ట్ రోజు, టక్ చేసుకుని, టై కట్టుకుని వెళతాం.. ఆఫీస్ కి వెళ్ళగానే క్లైంట్ రిసీవ్ చేసుకుంటాడు.. వాడు వాడి భాష లో, ఏదో మాట్లాడుతూ ఉంటాడు.. మనకి సగం అర్థమయి, సగం అర్థం కాక పిచ్చి నవ్వులు నవ్వుతూ మేనేజ్ చేస్తాం.. సరే ఆ రోజు మొత్తం మీటింగ్స్ తో కాలం గడిచిపోతుంది.. హమ్మయ్య మొదటి రోజు గట్టెక్కేశాం అనుకుని రూమ్ కి వచ్చేస్తాం.. వెళ్ళగానే రూమ్మేట్ చేతిలో కాఫీ కప్పు తో, ఎదురు వస్తుంది.. ఆహా .. అనుకుని తనివి తీరా తాగుతాం.. అప్పుడు చిన్నగా మొదలు పెడుతుంది మనం చేయాల్సిన పనుల లిస్ట్.. టైంటేబుల్ ప్రకారం ఆ రోజు గిన్నెలు కడిగి వంట చేయాల్సిన డ్యూటీ మనదే.. ఇక్కడ ఎప్పుడు కుక్కర్ లోది కూడా తీసిపెట్టుకునే అలవాటు లేని వాళ్ళం అక్కడ అవన్నీ ఎంతో ఆనందంగా (నటిస్తూ, మనసులో మేనేజర్ ని తిట్టుకుంటూ) చేస్తాం.. సెకండ్ డే ఆఫీస్ కి వెళతాం డబ్బాతో (అదేనండీ లంచ్) అది నిన్న రాత్రి మన స్వహస్తాలతో చేసింది, ఒవెన్ లో వేడి చేసుకుని మరీ….!!! ఆఫీస్ లో, వర్క్ షరా మామూలే.. అయిపోగానే ఉసూరుమంటూ రూమ్ కి వస్తాం.. అక్కడ మనకోసం రూమ్ ఆప్యాయంగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే, ఆ రోజు మన పని రూమ్ క్లీన్ చేయడం.. అది సర్దుతూ ఉంటే అనిపిస్తుంది వీళ్ళు మనకోసమే ఇన్ని రోజులు క్లీన్ చేయకుండా ఉంచారా అని.. సరే మొత్తానికి పూర్తి చేస్తాం.. ఇదంతా చేసేసరికి ఇల్లు గుర్తొస్తుంది.. ప్రొద్దున్నే లేవగానె కాఫీ ఇచ్చే అమ్మ, బయటకి వెళ్ళడానికి చెప్పులతో సహా అన్ని రెడీ చేసి ఉంచే నాన్న, బట్టలన్ని నీట్ గా ఇస్త్రీ చేసి తీసుకువచ్చే పనమ్మాయి, ఆఫీస్ లో టీ తాగుతూ, మేనేజర్ మీద వేసుకునే జోకులు, ఇలా అన్నీ వరుసగా గుర్తొస్తూ ఉంటాయి.. ఒక్కసారి గట్టిగా ఏడవాలి అనిపిస్తుంది (నిజంగా నిజమండీ బాబూ), అర్జెంట్ గా ఫ్లెట్ పైన ఎక్కైనా సరే ఇంటికి వెళ్ళిపోదామనిపిస్తుంది… సరే అరువు తీసుకున్న కాలింగ్ కార్డ్ తో, ఇంటికి కాల్ చేస్తాం.. అమ్మ, నాన్నగారు, తమ్ముడు/అక్క/చెల్లి/అన్నయ్య/బామ్మ/తాతాయ్య ఇలా అందరూ ఆపకుండా మాట్లాడేస్తూ ఉంటారు.. వాళ్ళ ఆనందం చూసి, ఇవన్నీ చెప్పి బాధ పెట్టాలనిపించదు.. సో, తరువాత కాల్ చేస్తా అని పెట్టేస్తాం.. ఫ్రెండ్స్ కి చేద్దామంటే, అహం అడ్డొస్తుంది… (అంటే, ఇక్కడకు వచ్చేటప్పుడు మనం కోసిన కోతలన్ని గుర్తొస్తాయి).. ఇక అలా మొహం వేలాడేసుకుని దిగాలుగా కూర్చుంటాం.. ఇంతలో, రూమ్మేట్స్ వస్తారు.. మన మొహం చూడగానే వాళ్ళకి సీన్ అర్థమవుతుంది (ఎందుకంటే, ఇలాంటి వన్నీ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి).. ధైర్యం చెబుతారు.. సరే మళ్ళీ ఆఫీస్, ఇంట్లో పనులు, ఇలా జరుగుతూ ఉంటుంది..
ఇంతలో, వీకెండ్ వచ్చేస్తుంది .. ఏదన్నా ప్లేస్ చూద్దామని బయలుదేరతాం.. అక్కడ బానే ఎంజాయ్ చేస్తాం.. అక్కడ దిగిన ఫొటోస్, ఫ్రెండ్స్ కి పంపిస్తాం.. ఇలా జీవితం సాగిపోతూ ఉంటుంది.. కానీ మనసులో ఏదో ఒక మూల బాధగానే ఉంటుంది.. చివరికి, మనం అక్కడ నుండి బయలుదేరాల్సిన రోజు రానే వస్తుంది.. మళ్ళీ షాపింగ్.. అందరికీ ఏదో ఒకటి తీసుకుంటాం… మొత్తానికి ఫ్లైట్ ఎక్కేస్తాం…. మాతృభూమి లో కాలు పెట్టగానే, మనసుకి చాలా హాయి గా ఉంటుంది (ఈ హాయి కి, అమెరికాలో దిగినప్పుడు అనిపించిన ఆనందానికి నక్కకి, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటుంది, కాదంటారా..??) ఇక ఎప్పుడూ, onsite కి వెళ్ళకూడదు అని మనసులో గట్టిగా అనుకుని, ఇంటికి వచ్చేస్తాం.. అక్కడ నుండి తెచ్చిన డాలర్స్ తో, బానే చేస్తాం.. సో, అందరూ, బాగా గొప్పగా చూస్తూ ఉంటారు… కాలం ఇలా గడిచిపోతూ ఉంటుంది.. వన్ fine డే, మేనేజర్ నుండి, మళ్ళీ కబురు వస్తుంది.. ఏముంది onsite గురించి.. మనసు డైలమాలో పడుతుంది.. అక్కడ వచ్చే డబ్బు చూసి మనసు ముందుకు లాగుతూ ఉంటుంది, కానీ అక్కడ కష్టాలు, ఇబ్బందులు వెనక్కి లాగుతూ ఉంటాయి.. ముందుదే జయిస్తుంది.. మళ్ళీ ప్రయాణం…. అంతా మళ్ళీ మామూలే.. ఇది అంతా చూస్తుంటే నాకు ఎక్కడో చదివినది గుర్తొస్తోంది.."What is this life full of care - no time to stand and stare"...
skip to main |
skip to sidebar
9 comments:
intaki idi mee anubavama leka generalga rasara.
edaitae nijalu rasaru.
మేధ గారూ,
మీ టపా బాగుంది. విహారి గారు అన్నట్టు ఇది మీ అనుభవమో లేక ఇతరుల అనుభవాలనుంచి రాసారో అర్ధం కాలేదు.
ఒక చిన్న సలహా. నక్కకు, నాగలోకానికి పోలిక చెప్తున్నప్పుడు మీరు పోల్చాలనుకొన్న వాటిని సరైన క్రమంలో ప్రస్తావిస్తే బావుంటుంది. ఈ టపా లో వాటిని వ్యతిరేక క్రమంలో ప్రస్తావించారు.
బాగా వ్రాసారండీ మేధా గారు, బ్లాగింగుకు స్వాగతం.
Chala baga raasaaru. looking for more.
ఒక పెద్దాయన ఎప్పుడో చెప్పాడు "మేమే ఇండియన్స్..మేమే ఇండియన్స్...పైసా కావాలంటాం,ప్రేమా కావాలంటాం..తిక్క తిక్క గా వుంటాం" .నూటికి తొంభై తొమ్మిది మంది మీరిచ్చిన ఎండింగ్ నే ఎంచుకుంటారు.మిగిలి పోయినా ఆ ఒక్క శాతం లో సగం మంది తరువాత తరువాత అయ్యో వెళ్ళుండాల్సింది అని ఎప్పుడో ఒకప్పుడు బాధపడతారు.[బాధ పడ్డారు.నేను చూసాను]
nice...
బాగుంది టపా. ఇండియాకు వెళ్ళక త్వరలో మూడు సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ టపా చదివిన తరువాత ఆ సంగతి గుర్తుకు వచ్చి, తిక్క రేగుతుంది.
ఉన్నది ఉన్నట్టు బాగా రాసారు! ఇంచు మించు నాదీ ఇదే స్టొరీ..
అందరూ తమ తమ అభిప్రాయాలని తెలిపినందుకు ధన్యవాదములు..
ఇది నా స్వానుభవం కాదండి.. కేవలం ఫ్రెండ్స్ ద్వారా విన్నవి మాత్రమే..
@రాజారావు గారు: మీరు చెప్పినది నిజమే, ఈ సారి నుండి ఇలాంటివి repeat అవకుండా చూస్తాను.
@రాధిక గారు: మీరు అన్నది కూడా నిజమే, నేను చూశాను మా ఫ్రెండ్స్ లో ఇలాంటి వాళ్ళని..
Post a Comment