Thursday, September 13, 2007

అంతా భ్రాంతియేనా……

మన సముద్రాల మహాశయుడికి ముందుచూపు బాగా ఉన్నట్లుంది.. అందుకే ఈ పాట పూర్వ కాలంలోనే వ్రాశారు..

నిజమే "It Happens".. ఐనా మనం ఇప్పుడు ఉన్నది సాక్షాత్తు ఆ దేవుడి పాలనలో, ఇలాంటి సమయంలో, ఎప్పుడో ఆ రాముడు కట్టిన ఏదో పిల్ల వారధి గురించి ఇంత రాధ్ధాంతం ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు…!

నిన్న సుప్రీమ్ కోర్ట్ లో, మన ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఏమి చెప్పారు.. రాముడు లేడు, రామాయణం అంతకన్న లేదు.. అసలు రాముడు కట్టాడు అనడానికి చారిత్రక ఆధారాలు కూడ లేవు అని అన్నారు..

అయినా నాకు తెలియక అడుగుతాను.. మన కళ్ళముందు బాంబులు పేలుతున్నా, ఆ పెట్టిన వాళ్ళని పట్టుకోలేకపొతున్నం.. ఎందుకంటే వాళ్ళెక్కడో ఏదో దేశం లో ఉన్నారని.. ఇప్పుడు జరుగుతున్నవాటికే ఏ ఆధారాలు చూపించలేని మనం, ఇక ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఏమని చెప్పగలం….

ఇక్కడ వేరే వాదన చూద్దాం.. నాసా వాళ్ళు ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో, ఆ రాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు (1750000) క్రితం వని చెప్పారు.. మన పురాణాల లెక్కల ప్రకారం త్రేతా యుగం కాలానికి అటు ఇటు గా ఉంది ఆ లెక్క… సరే పురాణాలు ఎంత నిజం, ఎంత అబధ్ధం అనే దాన్ని ప్రక్కన పెడితే, చాలామంది హిందువులు దాన్ని నిజంగానే, రాముడు కట్టిన వారధిగా నమ్మడం మొదలుపెట్టరు..

కానీ ఇక్కడ మనం ఒక సంగతి గుర్తు తెచ్చుకోవాలి.. భగవద్గీత లో, శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు(అసలు రాముడే లేడు అంటుంటే మధ్యలో కృష్ణుడు ఎందుకు అని అనచ్చు.. కానీ ఆయన చెప్పిన సిధ్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు..!!!) ఒక శ్లోకంలో, పరధర్మం ఎంత మంచిది ఐనా, నీ ధర్మం ఎంత తప్పైనా, పరధర్మం మాత్రం ఎప్పుడు పాటించకు, ఎల్లెడలా స్వధర్మాన్నే పాటించు అని చెప్పాడు… మనం దాన్ని ఆదర్శంగా తీసుకుంటే, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మన ఆర్కియాలజీ వాళ్ళు చెప్పే కాకమ్మ కధలని ఎటువంటి బాధ లేకుండా హాయిగా వినచ్చు..

ఇంత మంది కలిసి పాపం సోనియమ్మని ఆడిపోసుకుంటున్నారు కానీ, కేవలం ఆవిడ వల్లే కదా మనం ఇప్పుడు దేవుడి పాలన, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే, అంతకన్న ఎక్కువైన ఇందిరమ్మ పాలన లో ఉన్నాం.. నాకు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రొత్తలో, ఇందిరమ్మ పాలన తెస్తాం అది ఇది అని అంటుంటే ఏమీ అర్ధమయ్యేది కాదు.. ఎందుకంటే, నేను పుట్టేసరికి ఇందిరమ్మ చనిపోయింది నేను పుస్తకాలలో, రాముడి గురించి, అశోకుడు గురించి చదువుకున్నాను కానీ, ఇందిరమ్మ రాజ్యం గురించి తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని.. సర్లే అయినా తినబోతూ గారెల రుచి ఎందుకు అన్నట్లు, ప్రాక్టికల్గా చూద్దాం లే అనుకుంటే, ఇప్పుడు తెలుస్తోంది కేవలం ఇందిరమ్మ మాత్రమే ఇంత గొప్ప పాలన అందివ్వగలదు అని..!!

అయినా రామాయణం ఐనా, బైబెల్ ఐనా, ఖురాన్ ఐనా ఏమి ఘోషిస్తున్నాయి.. అందరు దేవుళ్ళు ఒకటే అనే కదా.. అలాంటప్పుడు మనం ఇంత బాధ పడడం ఎందుకు.. రాముడిని పూజించే బదులు ఏ అల్లానో, లేక క్రీస్తునో పూజిద్దాం.. అప్పుడు మన ప్రభువులూ సంతోషపడతారు.. (పనిలో పనిగా నేను “రాముడికి సీత ఏమవుతుంది – రెండో భాగానికి బదులు "క్రీస్తుకి మేరీ మాత ఏమవుతుంది" – మొదటి భాగం వ్రాస్తే సరిపోతుంది..!)

అయితే ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది.. ఏదో మన విష్ణుమూర్తికి ఉన్న దశావతారాల పుణ్యమా అని మనకి ఏడాదికి చాలా పండగలు వాటికి సెలవులు ఎన్నో ఉన్నాయి.. కానీ ఇప్పుడు సోనియమ్మ పాలనలో, ఇవేవి ఉండవు.. కేవలం ఒకే ఒక్కరోజు…..! కాబట్టి ఇందిరమ్మ ప్రజలారా (కాదు కాదు సోనియమ్మ ప్రజలారా) ఇలాంటి షాక్ లు ముందు ముందు చాలా వస్తాయి.. కాబట్టి మీరందరూ వాటికి మానసికం గా సంసిధ్ధులు కాగలరని కోరుకుంటూ, మీ అందరికీ ఆ రాముడు ( అలవాట్లో పొరపాటు ఆ … ) ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను..

7 comments:

తల్లపనేని మాధవరావు said...

బహుబాగున్నది మీ అంతా బ్రాంతియేనా వ్యాసము. ఇపుడు శేకరు గారు మీ వ్యాసము చూసి, అంతా బ్రాందిని కదా నీను చెసినది వీల్లు ఎంటి అంతా బ్రాంతియేనా అంటున్నారు అని, నా బ్రాంది తాగిన తరువాత ఏమన్నా మారి నార అని తలపీకొంటుంటాడు

Aruna said...

ha haa..correst ga chepparu..[:))]

Jai soniamma rajyam..

విహారి(KBL) said...

hahaha nice
baga cepparu.

విశ్వనాధ్ said...

రాముడు లేడు.లేడు.లేడన్ చు నిక్కము పల్కిన మా ప్రభుత్వము పైననే సెటైరులా...హు!

మమ్మే ఎండగట్టు ప్రయత్నంజేయ సాహసించు మూర్క ప్రజలార
మీ అంతు జూ....సెదంగాక..

Naga said...

(ఆర్కియా-లాజికల్) చదువులు చట్టుబండలు అని ఊరికే అనలేదు అనుకుంటాను... :) రాత బాగుంది.

అమర్ (Amar) said...

ఇదంతా ఆ రెండు పత్రికల వల్లనె. మా ప్రభుత్వం గురుంచి తప్పుగ ప్రచారం చేస్తున్నరు. అందుకే మేమె పత్రిక పెట్టి రాముడు లేడని చాటుతాము.

Gorijavolu said...

Excellent..