Wednesday, September 19, 2007

ధర్మసందేహం

మనది ప్రజాస్వామ్య దేశం కదా… ఇక్కడ ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్య హక్కు ఉంది.. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు*.. అయితే అక్కడే ఒక చిన్న మెలిక కూడ ఉంది (conditions apply) అంటే ఏదైనా మట్లాడచ్చు కానీ, అది వేరే వ్యక్తులని, సంస్థలని, వాళ్ళ మనోభావాలనీ కించపరచకూడదు.. ఒకవేళ అలా చేస్తే అది నేరము అని చిన్నప్పుడు చదువుకున్నాను..

మరి అలాంటప్పుడు, గౌరవనీయులైన కరుణానిధి గారు, రాముడు ఎక్కడ ఉన్నాడు, ఏ తాంత్రిక విద్యాలయంలో (ఇంజనీరింగ్ కళాశాలలో) చదివాడు…? ఇంజనీరింగ్ పట్టా ఎప్పుడు పుచ్చుకున్నాడు..? ఇలా అంటున్నారు కదా.. ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి.. మరి వాళ్ళకి ఆయన మీద కేస్ పెట్టాలనే ఆలోచన రాలేదా….??!!

5 comments:

Naga said...

కేసులు, చట్టం మనుషులకు మాత్రమే వర్తిస్తాయి...!

తల్లపనేని మాధవరావు said...

good manchigaa cheppinaaru, ippude nenu oka tamil friend to argue chesinaanu, ee visayamu meeda

Anonymous said...

ఒక్కోసారి అన్నీ తెలిసినా మనం మాట్లాడలేము

మా'రాం'గోపాల్ said...

ఇలా కేసులు పెట్టుకుంటూపొతే దాదాపూ అందరు రాజకీయ నాయకులపైనా ఏదో ఒక కేసు పెట్టాల్సివస్తుంది.కాబట్టి ప్రత్యేకించి ఇలాంటి విషయాల్లో మన స్పందననే కొద్దిగా తగ్గించుకొంటే మంచిదేమో కాస్త ఆలోచించండి.

కొత్త పాళీ said...

నాగరాజా ఉవాచ - "కేసులు, చట్టం మనుషులకు మాత్రమే వర్తిస్తాయి...!"

అవును. గాడిదలకు వర్తించవు :-)